Turkey Wedding Industry :టర్కీకి బాయ్‌కాట్ సెగ…డెస్టినేషన్ వెడ్డింగ్ రద్దు చేసుకుంటున్న భారతీయులు

షేర్ చేయండి

Turkey Wedding Industry:  టర్కీ వెడ్డింగ్ పరిశ్రమకు భారతీయులు షాక్ ఇస్తున్నారు. ఆపరేషన్ సిందూర్‌కు వ్యతిరేకంగా తన మిత్రదేశం పాకిస్తాన్‌కు అండగా నిలిచింది టర్కీ. క్లిష్ట సమయాల్లో శత్రు దేశానికి అన్ని విధాలుగా సాయం చేసిన ఈ దేశాన్ని ప్రస్తుతం భారతీయులు బాయ్‌కాట్ చేస్తున్నారు.

అందులో భాగంగానే టర్కీలో జరగాల్సిన విలాసవంతమైన వివాహాలను కేన్సిల్ చేసుకుంటున్నారు. భారతీయుల దెబ్బకు టర్కీకి దౌత్యపరంగానే కాదు ఆర్థికంగా కూడా భారీ నష్టం కలుగుతోంది. 

బహిష్కరణ ప్రభావాలు | The Boycott and Its Impact

2025 మే నెలలో భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పూర్తయిన తరువాత భారతీయ వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు టర్కీని బాయ్‌కాట్ చేస్తున్నట్టు ప్రకటించారు. వేలాది మంది పర్యాటకులు కూడా తమ బుకింగ్స్ రద్దు చేసుకున్నారు. టర్కితో మెల్లిమెల్లిగా అన్ని బంధాలు తెంచుకుంటోంది భారత్.

ఒకప్పుడు టర్కీకి విలాసవంతమై వివాహాలకు, ఆతిథ్యం కోసం భారతీయులు వెళ్లే వారు. 2024 లో 50 ఇండియన్ వెడ్డింగ్స్ జరిగాయి. ఒక్కో వివాహానికి సుమారు 3 మిలియన్ డాలర్లు ఖర్చు అవ్వగా, మొత్తం 150 మిలియన్ డాలర్లు కేవలం లగ్జరీ వెడ్డింగ్ కోసమే భారతీయులు వెచ్చించినట్టు సమాచారం. 

ఇక 2025 విషయానికి వస్తే మొత్తం 50 పెళ్లిళ్లు జరగాల్సి ఉండగా అందులో 30 వరకు ఇప్పటికే రద్దు అయ్యాయట. దీంతో టర్కీ వెడ్డింగ్ ఇండస్ట్రీకి 90 మిలియన్ల డాలర్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. 

ఆట ఇప్పుడే మొదలైంది | Turkey Wedding Industry

ఇక భారతీయులు ఇలా పెళ్లిల్లు రద్దు చేసుకోవడం వల్ల వెడ్డింగ్ సెక్టార్‌పై మాత్రమే కాకుండా ఇతర అనేక రంగాలపై కూడా దీని ప్రభావం కనిపించనుంది. పెళ్లి పనులు చేసేవారు, పువ్వులు, డెకరేషన్ పరిశ్రమ, ఈవెంట్ మేనేజర్స్ ఇలా ఎంతో మంది ప్రభావితం అవుతారు.

2024 లో మొత్తం 3,30,000 మంది భారతీయులు టర్కీ పర్యటించగా ఆ దేశానికి 350 నుంచి 400 మిలియన్ డాలర్ల వరకు ఆదాయం వచ్చింది. ఇక తాజా పరిణామాల వల్ల భారతీయులు టర్కీకి బదులు అర్మేనియా (Armenia), గ్రీస్ (Greece) వంటి దేశాలకు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు.

📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!