Laknavaram : లక్నవరంలో కొత్త ద్వీపం ప్రారంభం…ఎలా ఉందో చూడండి !
తెలంగాణ ప్రభుత్వం పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టిని సారించింది. అందులో భాగంగానే ములుగు జిల్లాలోని లక్నవరం సరస్సులో ( Laknavaram ) మూడవ ద్వీపాన్ని పర్యాటకుల కోసం ప్రారంభించింది. ఈ కొత్త ద్వీపం ఎలా ఉందో, దాని వివరాలు ఏంటో ఈ పోస్టులో మీకోసం…
తెలంగాణలో ఎన్నో నేచురల్ వండర్స్ ఉన్నాయి. ఇందులో చరిత్రకు నిదర్శనంగా నిలిచే లక్నవరం లేక్ కూడా ఒకటి.
Read Also: Thailand 2024 : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?
వరంగల్ నుంచి 75 కిమీ దూరంలో ములుగు జిల్లాలోని గోవిందరావుపేట మండలం బుస్సాపూర్ గ్రామంలో ఉన్న అందమైన లేక్ ఇది.
లక్నవరాన్ని సింపుల్‌గా సరస్సు అంటే సరిపోదు. దీన్ని నేచురల్ వండర్ అనొచ్చు. కాకతీయుల కాలం నాటి ఇంజినీరింగ్ ప్రతిభకు అద్దం పడుతోంది ఈ సరస్సు. ఈ జలాశయం అందం చూడటానికి దూరదూరం నుంచి పర్యాటకులు ములుగు జిల్లాకు వస్తుంటారు.
లక్నవరం మూడవ ద్వీపం విశేషాలు | Laknavaram Third Island
లక్నవరంలో ఎన్నో ద్వీపాలు ఉన్నా కేవలం రెండు ద్వీపాల్లో మాత్రమే పర్యాటకానికి అనుగుణంగా సదుపాయాలు కల్పించింది టూరిజం శాఖ.
అయితే ఏడాదికేడాది టూరిస్టుల సంఖ్య పెరగడంతో ఇక్కడ ఒక్కొక్కటిగా మిగతా ద్వీపాలను కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు మూడవ ద్వీపాన్ని పర్యాటకుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు.
Read Also: Manali : మనాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి ? ఎక్కడ ఉండాలి ? ఏం చూడాలి?

ఈ కొత్త ఐలాండ్‌ను తెలంగాణ టూరిజ శాఖ ( Telangana Tourism Department ) , ప్రీకోట్స్ సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో రూ. 7 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేశారు. మూడవ ద్వీపాన్ని తెలంగాణ పర్యటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు.

ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి…
ఈ ద్వీపంలో అధునాతన సదుపాయాలతో రిసార్ట్స్ ఉన్నాయి.

కుటుంబంతో కలిసి సరదాగా ఔటింగ్‌కు ప్లాన్ చేసే వారికి లక్నవరం అనువైన పర్యటక స్థలంగా చెప్పవచ్చు. ఈ సరస్సులో మీరు ఫ్యామిలీతో కలిసి జాలీగా సమయాన్ని గడపవచ్చు.

లక్నవరంలో కాయాకింగ్ (kayaking) వంటి పలు యాక్టివిటీస్ చేసే అవకాశం కూడా ఉంది.

మీకు టైమ్ ఉంటే లక్నవరంతో పాటు ములుగు జిల్లాలో ఉన్న ఇతర పర్యటక స్థలాలను సందర్శించండి.ములుగు జిల్లాలోని లక్నవరానికి ఎలా వెళ్లాలి ? అలాగే ములుగు జిల్లాలో ఉన్న పర్యాటక స్థలాలపై నేను కొన్ని వీడియోలు చేశాను. నా వ్లాగ్‌లో వాటిని చూడగలరు.
ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
