పండరీపురంలో అప్పటి వరకు ఆన్‌లైన్ దర్శనం పాస్ బుక్ చేసుకోలేరు ! Pandharpur Online Darshan Pass Updates

షేర్ చేయండి

మీరు పండరిపురంలోని ( Pandharpur ) విఠోభా దర్శనానికి పండరిపురం వెళ్తుంటే ఈ అప్టేట్స్ మీకోసమే

పాండురంగడు, విఠోభా… ఎలా పిలిచినా భక్తులను కరుణిస్తాడు పండరినాథుడు. అందుకే ఆయనను దర్శించుకోవడానికి దూరదూరం నుంచి భక్తులు పండరిపురం వెళ్తుంటారు. వెళ్లడానికి ముందు ఆన్‌లైన్‌లో దర్శనం కోసం పాస్ ( Pandharpur Online Darshan Pass ) తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు.

Prayanikudu WhatsApp2
| ప్రతిరోజు వాట్స్ అప్ ద్వారా ట్రావెల్ కంటెంట్ తెలుగులో పొందాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి
భక్తుల రద్దీని, సెలవులను దృష్టిలో ఉంచుకొని ఆన్‌లైన్ పాస్ జారీ చేసే విధానంలో మార్పులు తీసుకువచ్చారు.
2025 జనవరి 2వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దర్శనం పాస్‌లను బుక్ చేసుకునే వెసులుబాటు ఉండదు అని పండరిపురం దేవాలయ సంస్థానం తెలిపింది. మీరు జనవరి 2వ తేదీ తరువాత ఆన్‌లైన్ దర్శనం పాస్ కోసం ప్రయత్నించవచ్చు.
పండరిపురం అనేది మహారాష్ట్ర ప్రజలకు తిరుపతి లాంటిది ఇక్కడికి దూరదూరం నుంచి విఠోభా భక్తులు వస్తుంటారు.
సాధారణ రోజుల్లోనే దర్శనానికి కనీసం నాలుగైదు గంటల సమయం పడుతుంది. అదే సెలవు రోజుల్లో, ప్రత్యేక దినాల్లో దర్శనం కోసం కొన్ని రోజుల సమయం కూడా పట్టవచ్చు.
ఆలయ దర్శనానికి వేచి ఉండే భక్తులు నిత్యం పాండురంగా విఠలా నామస్మరణ చేస్తూ ముందుకు సాగుతుంటారు
దర్శనం కోసం క్యూ కాంప్లెక్స్‌ భవనం మొత్తం తిరగాల్సి ఉంటుంది. అందుకే వీఐపీ, ఆన్‌లైన్ దర్శనం కోసం ప్రయత్నిస్తుంటారు భక్తులు. కానీ పండగల సీజన్లో ఈ వెసులుబాటును దేవస్థానం తొలగించింది.
ఇక్కడ క్యూలైన్‌ అనేది చంద్రభాగ నదీ తీరం నుంచి మొదలవుతుంది. కొన్ని సార్లు ఇది కొన్ని కిమీ వరకు ఉంటుంది.
క్యూల్లైన్లో ఉన్నప్పుడు మీకు తినుబండారాలు, చిరుతిల్లు లభిస్తాయి.
దర్శనం లైన్ అనేది పండరిపురం వీధుల్లోంచి వెళ్తుంది. ఈ సమయంలో అక్కడి పాత నివాసాలను, వీధులను గమనించండి. వాటిని ఇప్పటికీ జాగ్రత్తగా సంరక్షించడాన్ని గమనించండి
ఆలయం లోపలికి మొబైల్ తీసుకెళ్లే వెసులుబాటు లేదు. క్యూ లైన్లో ఉన్నప్పుడు చాలా మంది షాపు వాళ్లు మీ మొబైల్స్ తమ దగ్గర పెట్టమని అడుగుతారు. అయితే దేవాలయ ప్రాంగణంలోకి మెట్లదారిలో ఎంటర్ అవ్వగానే ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేసిన మొబైల్ లాకర్స్‌లో కూడా మీరు మొబైల్ పెట్టవచ్చు.
దర్శనం పూర్తి చేసుకుని బయటికి రాగానే ఇక్కడ భాక్రి, పిట్లా అనే రెసెపీ ట్రై చేయవచ్చు. ఇది జొన్నరొట్టెలా ఉంటుంది. మహారాష్ట్ర ప్రజలు దీన్ని ఇష్టంగా తింటారు.
ఆలయం బయట కొంత మంది మట్టిగాజులు తయారు చేస్తూ కనిపిస్తారు. చూడటానికి ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది.

పండరిపురం వస్తే కాశీకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది అని చాలా మంది చెబుతారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ చూసినా ఆలయాలు, ఆశ్రమాలే కనిసిస్తాయి. ఎటు చూసినా విఠలుడి నామం జపిస్తున్న భక్తులను చూడవచ్చు.

గమనిక: ఈ వెబ్‌సైట్లో ప్రకటనలు కూడా ఉంటాయి. ముఖ్యంగా గూగుల్ యాడ్స్ ద్వారా ఈ ప్రకటనలు మీకు కనిపిస్తాయి. ఈ ప్రకటనలే మాకు ఆధారం. ఇందులో కొన్ని ప్రకటనలపై మీరు క్లిక్ చేస్తే మాకు ఆదాయం వస్తుంది.

Watch More Vlogs On : Prayanikudu

ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

Most Popular Stories

ప్రపంచ యాత్ర గైడ్

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!