Saleshwaram : 3 రోజులు మాత్రమే తెరిచి ఉండే తెలంగాణ అమర్‌నాథ్‌ ఆలయం

షేర్ చేయండి

తెలంగాణలోని దట్టమైన నల్లమల అడవిలో కొలువై ఉన్న గుహాలయం శ్రీ సలేశ్వరం అలయం (Saleshwaram). దీనిని తెలంగాణ అమర్‌నాథ్ యాత్రగా కూడా పిలుస్తారు. చారిత్రాత్మకంగా, ఆధ్యాత్మికంగా అత్యంత విశిష్టత ఉన్న ఈ ఆలయానికి చేరుకునే మార్గం, చేసే ప్రయాణం చాలా అందంగా ఉంటుంది. 

మహాశివుడికి (Lord Shiva) అంకితమైన ఈ అతిపురాతన ఆలయం భక్తులకు, సాహస యాత్రికులకు ఆధ్యాత్మిక చైతన్యం వైపు ప్రయాణించాలి అనుకునే వారికి ఎంతో ఇష్టమైన యాత్రగా చెప్పవచ్చు.

సలేశ్వరం ఎక్కడ ఉంది ? | Location Of Saleshwaram

Saleshwaram Temple Travel Guide (13)
హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే దారిలో (Source: google Photos)

సలేశ్వరం లింగమేశ్వర స్వామి ఆలయం తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (Amrabad Tiger Reserve) పరధిలోని నల్లమలలో ఉంటుంది.

  • జనవాసాలకు దూరంగా, లోతట్టు అభయారణ్యంలో ఉన్న ఈ ఆలయానికి చేరుకోవాలి అంటే దట్టమైన కీకారణ్యంలో నడవాల్సి ఉంటుంది.
  • ఆలయానికి ఏ మార్గంలో వచ్చినా మీరు కొండల్లో నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది.

సలేశ్వరం విశిష్టత | Spiritual Significance

a group of people in a Saleshwaram cave
సలేశ్వరం ఆలయం ముందు గుహలో భక్తులు

సలేశ్వరం ప్రకృతి అందాలతో అలరారే దట్టమైన అడవుల్లో ఉంది. ఈ ప్రాంతంలో అత్యంత ఎత్తైన కొండలు, పాలనురుగులా జాలువారే అందమైన జలపాతాలు భక్తులను పరవశించేలా చేస్తాయి.  

సలేశ్వరం గుహాలయం (Saleshwaram Cave Temple ) చరిత్ర అనేది 6వ లేదా 7వ శతాబ్దం నాటిదిగా చెప్పవచ్చు. ఈ ఆలయం గురించి 16వ శతాబ్దానికి శ్రీ పర్వత పురాణంలో (Sri Parvatha Purana), 13వ శతాబ్దంలో మల్లికార్జున పండితారాధ్యచరిత్రలో ఈ క్షేత్రం గురించి ప్రస్తావన ఉంది. ఈ ఆలయం శ్రీశైలంలోని పవిత్ర ప్రాంతాల్లో ఒకటిగా వర్ణించారు. 

Saleshwaram Temple Travel Guide (8)
సలేశ్వరం ఆలయం నుంచి చూస్తే శ్రీశైలం కొండలు కనిపిస్తాయి అంటారు

సలేశ్వరం గురించి పలు పురాణాల్లో కూడా ప్రస్తావన ఉంది. ఈ ఆలయం సమీపంలో రెండు పవిత్ర జల తీర్థాలు ఉంటాయి. అందులో ఒకటి సర్వేశ తీర్థం, రెండవది పుష్కర తీర్థం. ఈ రెండు తీర్థాలు ఆలయ ఆధ్యాత్మిక ప్రవాహానికి ఒక ప్రతీకగా చెప్పవచ్చు.

ఛత్రపతి శివాజి ఆశ్రయం పొందిన ప్రాంతం

ఈ ఆలయం , ఈ ప్రాంతం గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే మరాఠా యోధుడు, హిందూ సామ్రాజ్య స్థాపకుడు అయిన ఛత్రపతి శివాజి (Chhatrapati Shivaji) ఇక్కడ ఆశ్రయం పొందారట.

  • 17వ శతాబ్దం చివరిలో ఆయన ఇక్కడికి వచ్చారని అంటారు.
  • ఛత్రపతి శివాజీ శ్రీశైలం (Srisailam) మల్లికార్జునుడిని దర్శంచుకున్న విషయం కూడా తెలిసిందే.

ప్రకృతి అందాలకు నెలవు | Beauty Of Nallamala Forest

Saleshwaram Temple Travel Guide (10)
మల్లెల తీర్థ జలపాతం (ఇది ఆలయానికి దగ్గర్లో ఉండే జలపాతం కాదు)

నల్లమలలోని దట్టమైన ఆటవిక ప్రాంతంలో కొండల మధ్య ఈ ఆలయం కొలువై ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ ఆలయానికి ముందు ఒక జలపాతం ఉంటుంది. దాదాపు 200 మీటర్ల ఎత్తు నుంచి జాలువారే ఈ జలపాతం చూసేందుకు ఒక పాలధారలా, ఆకాశం నుంచి జారుగుతున్న అనుభూతిని కల్పిస్తుంది.

ఈ జలపాతం చుట్టూ ఉండే పచ్చదనం, నేచర్ అవన్నీ ప్రకృతి ప్రేమికులను అలరిస్తారు. ట్రెక్కింగ్‌ను ఇష్టపడే వారికి ఈ ప్రాంతం ఒక సాహసయాత్రే అని చెప్పవచ్చు.

ఏడాదికి 3 రోజులు మాత్రమే తెరిచి ఉండే ఆలయం 

సలేశ్వరం ఆలయం ఏడాదికి కేవలం మూడు రోజులు మాత్రమే తెరిచి ఉంటుంది. 2025 లో మార్చి 11,12,13వ తేదీల్లో సలేశ్వరం జాతర జరగనుంది. తెలంగాణ అమర్నాథ్‌‌గా (Telangana Amarnath Yatra) పిలుచుకునే సలేశ్వరానికి వచ్చే భక్తుల కోసం సరైన ఏర్పాట్లు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు.

Saleshwaram Temple Travel Guide (11)
దారి మధ్యలో కనిపించే గుండాలు

ఇక ఈ జాతర జరిగే సమయాన్ని ఎలా నిర్ణయిస్తారు అనే విషయానికి వద్దాం. ప్రతీ సంవత్సరం మార్చి – ఏప్రిల్ మాసంలో వచ్చే  చైత్ర పూర్ణిమ సమయంలో ఇక్కడ సలేశ్వరం జాతర జరుగుతుంది.

  • ఈ జాతరకు ఇరు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, మహారాష్ట్ర (Maharastra), ఝార్ఖండ్, ఛత్తీస్‌ఘడ్ నుంచి కూడా భక్తులు తరలి వచ్చి స్వామిని దర్శించుకుంటారు.
  • వివధ జిల్లాల నుంచి వచ్చే భక్తుల కోసం తెలంగాణ ఆర్టీసి (Telangana RTC) ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేస్తుంది.

సలేశ్వరం చేరుకోవడం ఎలా ? | How To Reach Saleshwaram

trekking to Saleshwaram
నల్లమల అడవిలో అర్థరాత్రి సమయంలో సలేశ్వరం ట్రెక్కింగ్

సలేశ్వరం చేరుకోవడానికి మూడు నడక దారులు ఉన్నాయి. 

  1. మన్నూరు నుంచి చేరుకోవచ్చు.
  2. బలనేరు మండలం నుంచి కూడా మీరు సలేశ్వరం చేరుకోవచ్చు.
  3. లింగాల నుంచి నడకమార్గంలో చేరుకోవచ్చు.
  • రోడ్డు మార్గంలో వీలైనంత దగ్గరి వరకు వెళ్లాలి అనుకునేవారు హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే దారిలో పరహాబాద్ గేట్ (Farahabad Gate) వరకు చేరుకుని తరువాత 32 కిమీ మేరా అడవిలోకి ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అనుమతితో ప్రయాణించాల్సి ఉంటుంది. 
  • రాంపూర్ పెంట (Rampur Penta) వరకు మాత్రమే వాహనాలను వెళ్లనిస్తారు. చివరిలో 5 కిమీ మాత్రం కాలినడకనే సాగాల్సి ఉంటుంది. అయితే ఇక్కడి ప్రకృతి అందాలు చూస్తే కష్టం కాస్త ఇష్టం మారిపోతుంది. రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతారు.

కొంచెం ఇష్టం కొంచెం కష్టం

Saleshwaram Temple Travel Guide (2)
పగలు వెలుగుతో పాటు వేడి ఉంటుంది. రాత్రి చీకటితో పాటు చల్లదనం, రిస్కు కూడా ఉంటుంది. బెటర్ వెలుగు ఉన్నప్పుడే వెళ్లండి

ఇక లింగాల మార్గంలతో వస్తే మాత్రం అప్పాయిపల్లి (Appayipalli) దారిలో గిరిజన గుడారాల వరకూ వాహనంలో వెళ్లవచ్చు. ట్రెక్కింగ్ లేదా అడవిలో నడవాలి అనుకునేవారికి ఈ దారి బాగా నచ్చుతుంది. గిరిజన గుడారాల నుంచి సలేశ్వరం ఆలయం 15 కిమీ దూరంలో ఉంటుంది. దారిలో మీకు ఎన్నో గుహలు కనిపిస్తాయి.

చెంచులు నిర్వహించే ఆలయం 

Saleshwaram Temple Travel Guide (3)
ఈ ఆలయాన్ని పూర్తిగా చెంచులే నిర్వహిస్తారు

సలేశ్వరం ఆలయ నిర్వహణ బాధ్యత పూర్తిగా స్థానిక గిరిజనులే చేపడతారు. వీరిని చెంచులు (Chenchus) అని పిలుస్తారు.

  • ఇది తమ ఆధ్యాత్మిక బాధ్యత అని వారు భావిస్తారు.
  • ఆలయ ఆచారాలను , జాతర విధివిధానలు అన్నింటినీ వీళ్లే నిర్వహిస్తారు.
  • ఈ జాతరకు సంబంధించిన ఏర్పాట్లను కొన్ని వారాల ముందు నుంచే చేయడం ప్రారంభిస్తారు.
  • ఇది వారి అంకిత భావానికి ప్రతికగా చెప్పవచ్చు.

భక్తికి పరీక్ష | Saleshwaram Trek

Saleshwaram Treking
సలేశ్వరం ట్రెక్కింగ్

సలేశ్వరం వెళ్లే దారిలో వస్తున్నామయ్యా లింగయ్య అనే భక్తులు దారిలో చాలా మంది కనిపిస్తారు. నీ దర్శనం చేసుకునే శక్తిని మాకు ఇవ్వు అనుకుంటూ ముందుకు వెళ్తుంటారు.

  • ఎందుకంటే ఈ యాత్ర లేదా ట్రెక్ అనేది అంత సులభం కాదు.
  • ఒక నిర్ధిష్టమైన దారి ఉండదు (కొండ ఎక్కే లేదా దిగే సమయంలో). దారి పొడవునా ఎటు చూసినా బండరాళ్లే కనిపిస్తాయి. 
  • ఆచి తూచి అడుగు ముందుకు వేయాల్సి ఉంటుంది. పైగా కొన్ని దారులు మరీ చిన్నగా, లోయవైపు ఓపెన్ అయ్యి ఉంటాయి.
  • పొరపాటున పడితే శివైక్యం చెందాల్సి ఉంటుంది. అందుకే నెమ్మదిగా, ప్రశాంతంగా వెళ్లడానికి ప్రయత్నించండి. 
  • ఇది కూడా చదవండి : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గురుద్వార

నేను మొదటిసారి వెళ్లినప్పుడు అడవి జంతువులు ఏమైనా వస్తాయేమో అనుకున్నాను. కానీ ఇంత మంది జనం ఉంటే అవి దగ్గరికి రావు అని అర్థం అయింది. ఎందుకంటే మనుషులంటే వాటికి కూడా భయం.

ఎప్పుడు వెళ్లాలి ? | Best Time to Visit

a group of people in a cave
దారిలో ఇలాంటి ఎన్నో నీటి గుండాలు, గుంటలు కనిపిస్తాయి. అందులో ఒక చోట ఇలా ఫోజు ఇచ్చాను.

సలేశ్వరం ఆలయం ఏడాదికి కేవలం 3 రోజులు మాత్రమే తెరిచి ఉంటుంది. అది కూడా చైత్ర పూర్ణిమ (Chaitra Purnima) సమయంలో మాత్రమే. సో బెస్ట్ టైమ్ ఇదే. ఇందులో కూడా బెస్ట్ టైమ్ ఎప్పుడంటే జాతర మొదలైన మొదటి రోజు మాత్రమే అని చెప్పగలను. మూడవ రోజు లేదా చివరి రోజు రద్దీ మామూలుగా ఉండదు.

గతంలో 11 రోజుల ఉన్న తరువాత 5 రోజులకు కుదించారు. అనంతరం మూడు రోజులకు మాత్రమే పరిమితం చేశారు. దీంతో రద్దీ మరీ దారుణంగా ఉంటుంది.

ఈ యాత్ర ఎవరు చేయాలి ? ఎవరు చేయకూడదు ? ఎలా సిద్ధం అవ్వాలి ? ఈ సారి పరిస్థితి ఎలా ఉంది పరిస్థితి అనే విషయాలపై ఫ్రెష్‌గా వ్లాగ్ చేసి ఇక్కడే పోస్ట్ చేస్తారు.

అప్పటి వరకు ఇండియాలో లాస్ట్ విలేజ్‌కు వెళ్లినప్పటి నా ట్రావెల్ వ్లాగ్ చూడగలరు.!

📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!