Papi Kondalu Tour : శీతాకాలంలో గోదావరి పయనంలో మంచు తెరల మధ్య మధురానుభూతినిచ్చే పాపికొండల టూర్
Papi Kondalu Tour : చలికాలంలో గోదావరిపై మంచు తెరల మధ్య, చల్లని వాతావరణంలో పచ్చని కొండల మధ్య ప్రయాణం ఒక మధురానుభూతిని ఇస్తుందనడంలో సందేహం లేదు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య సుమారు 40 కిలోమీటర్ల పొడవునా గోదావరి నదికి ఇరువైపులా ఈ పాపికొండలు విస్తరించి ఉన్నాయి. గోదావరి వెంబడి ఎత్తైన కొండలు, దట్టమైన పచ్చని వృక్షాలు, అడవుల గుండా పవిత్ర గోదావరి నదిలో బోట్లో విహరించడం కళ్లకు పండుగలా ఉంటుంది. రోజువారీ ఒత్తిడికి దూరంగా, ప్రశాంతమైన వాతావరణంలో టూర్ చేయాలనుకునేవారు, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఈ పాపికొండల బోటు షికారుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.
పాపికొండలకు ఎలా వెళ్లాలి?
పాపికొండల విహారయాత్రకు రెండు ప్రధాన రూట్లు అందుబాటులో ఉన్నాయి
భద్రాచలం రూట్: భద్రాచలం రామాలయాన్ని దర్శించుకున్న తరువాత, అక్కడి నుంచి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోచవరం బోట్ పాయింట్‌కు రోడ్డు మార్గంలో చేరుకోవాలి. అక్కడి నుంచి గోదావరి నదిలో బోట్లో ప్రయాణం మొదలవుతుంది.

రాజమండ్రి రూట్: తూర్పుగోదావరి జిల్లాలో దేవీపట్నం మండలం పోశమ్మ గండి ఆలయం వద్ద ఉన్న బోట్ పాయింట్ నుంచి కూడా పర్యాటకులు పాపికొండల యాత్రకు బయలుదేరవచ్చు. రాజమహేంద్రవరం నుంచి వాహనంలో పురుషోత్తపట్నం మీదుగా పోశమ్మ గండికి చేరుకోవచ్చు.
ఇది కూడా చదవండి : Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
టికెట్ ధరలు, ఆహారం వివరాలు
పాపికొండల బోటు షికారు సాధారణంగా ఉదయం 10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది.
పెద్దలకు ధర: రూ. 950/-
పిల్లలకు ధర: రూ. 750/-
ఇది కూడా చదవండి : UAE: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు
ప్యాకేజీలో ఏముంది?
ఈ టికెట్ ధరలోనే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం శాఖాహార భోజనం, సాయంత్రం అల్పాహారం (స్నాక్స్) అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. భద్రాచలం పట్టణం నుంచి బోటు షికారు ప్రారంభమయ్యే పాయింట్‌కు వెళ్లడానికి అయ్యే ట్రాన్స్పోర్ట్ ఛార్జీ మాత్రం అదనంగా ఉంటుందని నిర్వాహకులు తెలియజేశారు.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
