One Day Tour : ఫ్యామిలీతో కలిసి వన్డే టూర్ ప్లాన్ చేస్తున్నారా? హైదరాబాద్కు అతి దగ్గరలో అందమైన కొండలివే
One Day Tour : వీకెండ్ రాబోతుంది. ఆదివారం వచ్చిందంటే చాలు చాలామంది ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి టూర్లు ప్లాన్ చేస్తుంటారు. ఈ మధ్య పని ఒత్తిడితో, పిల్లల పరీక్షలతో బిజీగా ఉన్నవాళ్లందరూ ఒక రోజు సరదాగా గడిపేందుకు ఒక ట్రిప్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. పెద్ద టూర్లకు కాకుండా, హైదరాబాద్కు చాలా దగ్గరలో ఉన్న అందమైన ప్రదేశాల కోసం చూసేవారికి ఇది బెస్ట్ టూరిస్ట్ స్పాట్. తెలంగాణ ఊటీగా పిలువబడే అనంతగిరి హిల్స్ ను చూసేందుకు ఒక రోజు సరిపోతుంది.

ఇది కూడా చదవండి : Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు
వికారాబాద్ జిల్లాలో ఉన్న అనంతగిరి హిల్స్ హైదరాబాద్కు చాలా దగ్గరగా ఉన్నాయి. ఇక్కడి పచ్చదనం, లోయలు, కొండలు, జలపాతాలు మనసును చాలా ఉల్లాసపరుస్తాయి. నిన్నటి ఒత్తిడిని పక్కనపెట్టి, ప్రకృతి అందాలలో మీరు లీనమైపోతారు. ఈ ప్రదేశం అంతా బాగుంటుంది. పురాణాల ప్రకారం ఈ అనంతగిరి కొండలకు శ్రీ మహావిష్ణువుకు దగ్గరి సంబంధం ఉందని చెబుతారు. తిరుమల కొండలతో పోలిస్తే, అనంతగిరి కొండలు చాలా చిన్నవి. తిరుమలలోని శేషాచల కొండ ఆదిశేషుడి తల భాగం, కర్నూలు జిల్లాలోని అహోబిలం కొండలు మధ్య భాగం, అనంతగిరి కొండలు తోక భాగం అని చెబుతారు. అడవి అందాల మధ్య, కొండల నడుమ ఉన్న 1300 సంవత్సరాల నాటి అనంత పద్మనాభస్వామి దేవాలయం అందరినీ ఆకర్షిస్తుంది.
ఇది కూడా చదవండి : Bhutan : భూటాన్ ఎలా వెళ్లాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
గుడికి దిగువన ఉన్న లోతైన లోయలో భవనాశి అనే పుష్కరిణి ఉంది. అక్కడికి చేరుకోవడానికి వంద మెట్లు దిగాలి. ఈ పుష్కరిణి మూసీ నదికి పుట్టినిల్లు అని చెబుతారు. ఈ నది చిన్న ప్రవాహంగా మొదలై హైదరాబాద్ నగరం గుండా ప్రవహించి, ఆ తర్వాత నల్గొండ జిల్లాలోని వాడపల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. సెలవుల్లో వీకెండ్లలో పెద్ద సంఖ్యలో పర్యాటకులు అనంతగిరిని సందర్శిస్తుంటారు. హైదరాబాద్ నుండి కేవలం 80 కి.మీ. దూరంలో ఉన్న ఈ హిల్ స్టేషన్ స్వర్గం కంటే అందంగా ఉంటుంది. కులుమనాలి అందాలు కూడా అనంతగిరి కొండల ముందు తక్కువ అని చెప్పవచ్చు. అనంతగిరి కొండల నుంచే మూసీ నది పుడుతుంది. దాని అందం అద్భుతంగా ఉంటుంది. చాలా దూరం నుంచి ప్రజలు దీనిని చూడటానికి ఇక్కడికి వస్తారు. ట్రెక్కింగ్ ఇష్టపడేవారు ఇక్కడికి వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు. ఈ హిల్ స్టేషన్ సముద్ర మట్టానికి 700 మీటర్ల ఎత్తులో ఉంది.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.