Public Transport : తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సులు.. ఈ దేశాల్లో అందరికీ ఉచితమే.. బోలెడన్ని డబ్బులు ఆదా
Public Transport : ప్రపంచంలోని అన్ని దేశాల్లో ప్రజా రవాణా అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వాలు ప్రజల కోసం బస్సులు, రైళ్లు, మెట్రోలు నడుపుతుంటాయి. ఇతర ప్రైవేట్ వాహనాలు, క్యాబ్‌లతో పోలిస్తే ప్రజా రవాణాలో ఛార్జీలు తక్కువగా ఉంటాయి. ఈ ప్రయాణ విధానంతో కాలుష్యం కూడా చాలా వరకు తగ్గుతుంది. ప్రతిరోజూ లక్షలాది మంది కార్యాలయాలకు, పాఠశాలలకు, ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి ప్రభుత్వం నడిపే బస్సులనే ఎక్కువగా ఉపయోగిస్తారు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మహిళలకు బస్సు ప్రయాణం ఉచితంగా కల్పించినట్లు, కొన్ని దేశాల్లో ప్రజా రవాణా అందరికీ ఉచితంగా ఉంటుంది. ఈ దేశాల్లో టిక్కెట్లు, ఛార్జీలు లేకుండా ఎంత దూరమైనా ప్రయాణించవచ్చు. ట్రాఫిక్ జామ్‌లను తగ్గించడానికి, కాలుష్యాన్ని తగ్గించడానికి, ప్రజలకు మేలు చేయడానికి ఇలాంటి పథకాలను అమలు చేస్తున్నారు. 2025 నాటికి ప్రపంచంలో ప్రజా రవాణాను ఉచితంగా అందిస్తున్న దేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఎందుకు ఉచితం?
ప్రజా రవాణాను ఉచితం చేయడం చాలా తెలివైన నిర్ణయం. ఎందుకంటే ఎక్కువ మంది కార్లు ఉపయోగించరు. దీంతో కాలుష్యం చాలా వరకు తగ్గుతుంది, స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. కుటుంబాలు, విద్యార్థులు, పర్యాటకులకు చాలా డబ్బు ఆదా అవుతుంది. ప్రభుత్వాలు పన్నులు లేదా ఇతర వనరుల ద్వారా దీనికి నిధులు సమకూరుస్తాయి. దీన్ని సంతోషకరమైన, ఆరోగ్యకరమైన నగరాలను సృష్టించేందుకు ఒక పెట్టుబడిగా చూస్తాయి.

ఎస్టోనియా
ఎస్టోనియా రాజధాని టాలిన్ 2013 నుంచి స్థానికులకు ఉచిత ప్రజా రవాణాను అందిస్తోంది. మీరు నమోదు చేసుకుంటే బస్సులు, ట్రాలీబస్సులు, రైళ్లు అన్నింటిలో ఉచితంగా ప్రయాణించవచ్చు. స్థానికులుగా నమోదు చేసుకోవడానికి, రోజువారీ ప్రయాణాలను సులభతరం చేయడానికి ఈ పథకం అమలు చేస్తోంది. ఇది ప్రారంభమైనప్పటి నుంచి అదనపు పన్నుల రూపంలో 38 మిలియన్ యూరోలకు పైగా లభించింది. పర్యాటకులు తక్కువ మొత్తంలో ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది, కానీ స్థానికులకు డబ్బు ఆదా అవుతుంది. ఉచిత ప్రయాణాలు సమాజాన్ని ఎలా మారుస్తాయో ఎస్టోనియా చేసి చూపించింది.
లక్సెంబర్గ్
యూరోపియన్ దేశమైన లక్సెంబర్గ్ 2020లో దేశవ్యాప్తంగా ప్రజా రవాణా ఉచితమని ప్రకటించింది. ప్రజా రవాణాను పూర్తిగా ఉచితంగా అందించిన మొదటి దేశంగా చరిత్ర సృష్టించింది. బస్సులు, రైళ్లు, ట్రామ్‌లు అన్నింటిలో ఎలాంటి ఖర్చు లేకుండా ప్రయాణించవచ్చు. పర్యాటకులతో సహా అందరికీ ఉచితం. ఈ చిన్న దేశం (సుమారు 660,000 మందికి నిలయం) ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడటానికి, పర్యావరణ అనుకూల ప్రయాణాల కోసం ఈ నిర్ణయం తీసుకుంది. 2025 నాటికి రైళ్లలో సైకిల్ పార్కింగ్‌కు ఉచిత స్థలాలతో అదనపు ప్రోత్సాహకాలు తీసుకొచ్చింది. దీంతో ప్రయాణీకుల సంఖ్య 20% పెరిగింది.
ఇది కూడా చదవండి : Peaceful Countries: ప్రపంచంలోని టాప్ 10 శాంతియుత దేశాలు
రొమేనియా
రొమేనియన్ నగరాలైన క్లూజ్, నాపోకాలో, ప్రతి శుక్రవారం ప్రజా రవాణా ఉచితం. నివాసితులు, సందర్శకులు ఎటువంటి ఛార్జీలు చెల్లించకుండా బస్సులు, రైళ్లు, ట్రామ్‌లను ఉపయోగించవచ్చు. ప్రజలు ప్రజా రవాణాను ఎక్కువగా ఉపయోగించమని ప్రోత్సహించేందుకు వారంలో ఒకరోజు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నారు. కారు వినియోగాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణాన్ని రక్షించడంలో కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా అందరు ప్రీ-యూనివర్సిటీ విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించవచ్చు.
ఇది కూడా చదవండి : Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు
కెనడా
కెనడాలో చాంబ్లీ చుట్టూ ఉన్న పట్టణాలు (మాంట్రియల్ సమీపంలోని క్యూబెక్ సౌత్ షోర్లో) 2012 నుంచి స్థానికులకు ప్రజా రవాణా ఉచితం. ఇది రోడ్డు రద్దీ, గ్రీన్హౌస్ వాయువులను తగ్గిస్తుంది. అన్ని ప్రాంతాల్లో కాలుష్యం తగ్గిస్తుంది, పచ్చదనం పెరగడానికి కారణం అవుతుంది. రోజువారీ అవసరాలకు అనుకూలంగా ఉంటుంది.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.