Indian Railways : పండగల వేళ ప్రయాణికులకు రైల్వే శుభవార్త.. రద్దీని తగ్గించడానికి రైల్వేల ప్రణాళిక
Indian Railways : పండగల వేళ ప్రయాణికులకు రైల్వే శుభవార్త అందించింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం దీపావళి, ఛఠ్ వంటి పండుగల సందర్భంగా పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. పండుగల సమయంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విశాఖపట్నం నుండి దానాపూర్, దానాపూర్ నుండి విశాఖపట్నం మధ్య అనేక ప్రత్యేక రైళ్లను, విశాఖపట్నం-భువనేశ్వర్-విశాఖపట్నం మధ్య ఒక అన్రిజర్వ్డ్ ప్రత్యేక రైలును నడపనున్నట్లు తెలిపింది. ఈ రైళ్ల వివరాలతో రైల్వే ఒక ప్రకటనను విడుదల చేసింది.
విశాఖపట్నం – దానాపూర్ ఎక్స్‌ప్రెస్ స్పెషల్ ట్రైన్: ఇది నవంబర్ 4వ తేదీ ఉదయం 9:10 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 11 గంటలకు దానాపూర్‌కు చేరుకుంటుంది. అక్కడి నుండి దానాపూర్ – విశాఖపట్నం ప్రత్యేక రైలు నవంబర్ 5వ తేదీ మధ్యాహ్నం 12:30 గంటలకు తిరిగి బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు మధ్యాహ్నం 2:42 గంటలకు విశాఖపట్నం స్టేషన్‌కు చేరుకుంటుంది. ఈ రైలులో ప్రయాణికుల కోసం 3 థర్డ్ ఏసీ, 12 స్లీపర్, 5 జనరల్ సెకండ్ క్లాస్ సిట్టింగ్, 2 సెకండ్ క్లాస్ కమ్ దివ్యాంగజన్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని రైల్వే తెలిపింది.

విశాఖపట్నం – భువనేశ్వర్ అన్రిజర్వ్డ్ స్పెషల్ ట్రైన్: ఇది నవంబర్ 15వ తేదీ వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు విశాఖపట్నంలో అందుబాటులో ఉంటుంది. అక్కడి నుండి బయలుదేరి అదే రోజు రాత్రి 7:45 గంటలకు భువనేశ్వర్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో, భువనేశ్వర్ – విశాఖపట్నం అన్రిజర్వ్డ్ ప్రత్యేక రైలు అదే రోజు రాత్రి 10:30 గంటలకు భువనేశ్వర్ నుండి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8:45 గంటలకు విశాఖపట్నం స్టేషన్‌కు చేరుకుంటుంది. ఈ రైలులో 1 దివ్యాంగజన్, 1 మోటార్ కార్ కోచ్‌లు, 10 జనరల్ సెకండ్ క్లాస్ సిట్టింగ్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి.
ఇది కూడా చదవండి : UAE: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు
దేశవ్యాప్తంగా 7,000 ప్రత్యేక రైళ్లు, కొత్త విధానాలు:
దేశవ్యాప్తంగా దీపావళి, ఛఠ్ పండుగల సమయంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని, భారతీయ రైల్వే మరో 7,000 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు తెలిపింది. వీటితో పాటు, రైల్వే స్టేషన్లలో పలు కొత్త విధానాలను కూడా అమలు చేసింది. రైళ్లలోని జనరల్ కోచ్‌లలోకి ఎక్కే ప్రయాణికుల సౌలభ్యం కోసం ప్లాట్‌ఫారమ్‌లపై క్యూ లైన్ సిస్టమ్ అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి : Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు
దక్షిణ మధ్య రైల్వే నుండి అదనపు రైళ్లు, ఏర్పాట్లు:
పండగలను దృష్టిలో ఉంచుకొని, దక్షిణ మధ్య రైల్వే మొత్తం 26 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. దీపావళి పండుగ ప్రత్యేక రైళ్లను కాచిగూడ నుండి నిజామాబాద్, నాందేడ్-పానిపట్, నాందేడ్-పాట్నా, ఛప్రా-యశ్వంత్‌పూర్, చెన్నై-అంబాలా కంటోన్మెంట్ మార్గాల్లో ప్రవేశపెట్టారు. ఈ ప్రత్యేక రైళ్లతో పాటు, పలు ప్రధాన రైల్వే స్టేషన్లలో 14 అదనపు కౌంటర్లను కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, విజయవాడ, గుంటూరు, తిరుపతి వంటి స్టేషన్లలో అదనపు సిబ్బందిని కూడా నియమించినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.