చాలా మంది ప్రయాణికులు ఈ వీకెండ్ ఎక్కడికి వెళ్లాలి అని ప్రతీ వీక్ ఆలోచిస్తుంటారు. అలాంటి వారి కోసం వీకెండ్ రామప్ప టెంపుల్ ( Ramappa Temple) టూర్ ప్యాకేజ్ తీసుకొచ్చింది తెలంగాణ తెలంగాణ టూరిజం శాఖ ( Telangana Tourism Department).ఈ ప్యాకేజీ వివరాలు ఈ పోస్టులో మీకోసం..
ముఖ్యాంశాలు
ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన ఆలయాలు తెలంగాణలో ఎన్నో ఉన్నాయి. అందులో రామప్ప ఆలయం ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే తెలంగాణ నుంచి యూనెస్కో గుర్తింపు తెచ్చుకున్న ఆలయం ఇది.
రామప్ప ప్యాకేజీ వివరాలు…| Ramappa Temple Package
ములుగు జిల్లాలోని ( mulugu district) పాలంపేట గ్రామంలో ఉన్న ఈ ఆలయాన్ని చూసేందుకు చాలా మంది దూర దూరం నుంచి వస్తుంటారు. ఇలాంటి వారి కోసం తెలంగాణ టూరిజం విభాగం శని -ఆదివారాల్లో టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది.
Read Also: Telugu Women Travel Vloggers : ట్రావెల్ వ్లాగింగ్‌లో వీర వనితలు
ఈ టూర్ హైదరాబాద్‌లోని యాత్రి నివాస్ నుంచి ఉదయం 6 గంటల 30 నిమిషాలకు ప్రారంభం అవుతుంది.అదే రోజు రాత్రి 9 గంటల 30 నిమిషాలకు తిరిగి యాత్రి నివాస్ చేరుకుంటారు.
ప్యాకేజీ ధర..
ఈ ప్యాకేజీలో భాగంగా భద్రకాలీ పద్మాక్షి ఆలయం, వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయాన్ని కవర్ చేస్తారు.
రామప్ప దేవాలయం ప్రధాన డెస్టినేషన్‌గా మొదలయ్యే ఈ ప్యాకేజి ధరను పెద్దలకు రూ.2,800 కాగా పిల్లలకు రూ.2,240 గా నిర్ణయించారు.
రామప్ప ఆలయం గురించి…
తెలంగాణలో రెండున్నరవేలకు పైగా ప్రాచీన ఆలయాలు ఉన్నాయి. ఆధ్మాత్మిక చరిత్రకు సాక్షిగా నిలచే ఎన్నో మందిరాలు కేవలం భక్తికి మాత్రమే కాకుండా కళలకు, శిల్పకళ వైభవానికి ప్రతీకగా నిలుస్తున్నాయి.
Read Also : వంజంగి ఎలా వెళ్లాలి ? ఎలా సిద్ధం అవ్వాలి ? 10 టిప్స్ !
అలాంటి ఒక అద్బుతమైన ఆలయమే ములుగు జిల్లాలోని రామప్ప రుద్రేశ్వర ఆలయం. దీనిని కాకతీయ రుద్రేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు.
ఆలయాన్ని శిల్పకారుడు రామప్ప నిర్మించగా అతని పేరుమీదే ఆలయానికి రామప్ప ఆలయంగా పేరు వచ్చింది అని కొందరంటారు.
మరికొంత మంది ప్రధానాలయంలో కొలువై ఉన్నది రామ లింగేశ్వర స్వామి కాబట్టి ఆయన పేరు మీదుగానే రామప్ప ఆలయం అని పిలుస్తారు అని కొంత మంది అంటారు.
అద్భుతమైన వాస్తు శిల్పాలకు మాత్రమే కాకుండా పేరిణి, కోలాటం వంటి శాస్త్రీయ, జానపద నృత్యాలకు కూడా రామప్ప చిరునామాగా మారింది. ముస్లిం రాజుల దాడులను తట్టుకుని మరీ నేటికీ భక్తులకు దైవ దర్శనం కల్పిస్తోంది.
Watch : రామప్ప ఆలయం స్పెషల్ స్టోరీ
ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
Provide new tourist places information
Sure andi. Iam working on the task. Can u pls tell me what kind of destinations u would like to see on prayanikudu blog?