రష్యాలో కమ్చాట్కాలో మంచు ప్రళయం | Russia Kamchatka Record Snowfall
Kamchatka Record Snowfall : ఒక్క రోజులోనే ఇక్కడ సగం నెల స్నోఫాల్. మంచు ఎడారిలా మారిన నగరం.2-3 అంతస్థుల ఎత్తు వరకు హిమదిగ్బంధంలో ఉన్న ద్వీపకల్పం
మంచు ప్రళయం | Snow Apocalypse
రష్యాలోని కమ్చాట్కా ద్వీపకల్పం (Kamchatka Peninsula) జనవరి 2026లో పూర్తిగా మంచుతో కప్పబడి “మంచు ప్రపంచం”గా మారిపోయింది. ఈసారి కురిసిన హిమపాతం 130 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంత తీవ్రంగా ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పరిస్థితి అంత తీవ్రంగా ఉండటంతో స్థానికులు దీనిని “మంచు ప్రళయం”గా అభివర్ణిస్తున్నారు.
No AI
— Linus ✦ Ekenstam (@LinusEkenstam) January 17, 2026
This is from Kamchatka in easter Russia. Where historical amounts of snow has pounded some 10feet, but in rare cases like here, piles up to 40 feet.
100% of Russia is currently covered in snow.
Extreme climate is new norm pic.twitter.com/HOittWoGA8
మంచు దుప్పటిలో నగరం | City Buried Under Snow
నగరమంతా మంచు దుప్పటిలా కప్పేయడంతో ఏది ఎక్కడ ఉందో గుర్తించలేని పరిస్థితి ఏర్పడింది. రోడ్లు, కార్లు, భారీ భవనాలు అన్నీ మంచులో మాయమయ్యాయి. “ఇల్లు కనుక్కోవడానికి కూడా చెమటోడ్చాల్సి వస్తోంది” అంటూ సోషల్ మీడియాలో స్థానికులు పోస్టులు పెడుతున్నారు.
Watching mountains like this from window in kamchatka 😂 Stop it. pic.twitter.com/flqGbFhcEV
— Sagar (@SagarGaonkar23) January 18, 2026
- ఇది కూడా చదవండి : Oymyakon : ప్రపంచంలోనే అత్యంత చల్లని గ్రామం
రాజధానిలో మరీ దారుణం | Worst Impact in Petropavlovsk-Kamchatsky
కమ్చాట్కా ప్రాంత రాజధాని పెట్రోపావ్లోస్క్-కమ్చాట్స్కీలో ఒక్క రోజులోనే సుమారు 39 మిల్లీమీటర్ల హిమపాతం నమోదైంది. ఇది సాధారణంగా నెలరోజుల్లో పడే మంచులో సగం కన్నా ఎక్కువ. కొన్ని ప్రాంతాల్లో మంచు రెండు నుంచి మూడు అంతస్తుల ఎత్తుకు చేరింది. దగ్గర్లోని Sea of Okhotsk నుంచి వచ్చిన శక్తివంతమైన తుపానులే దీనికి కారణమని అధికారులు తెలిపారు.
POV: You live in Kamchatka and the snow said “no rules today.” pic.twitter.com/eYGxc5bn4G
— Alina (@anymatnft) January 19, 2026
నగర జీవనం అస్తవ్యస్తం | Daily Life Comes to a Standstill
భారీ హిమపాతం వల్ల రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. రోడ్లు బ్లాక్ అయ్యాయి. ఫుడ్ సప్లై, ఎమర్జెన్సీ సేవలు, రోజువారీ జీవితం తీవ్రంగా ప్రభావితమయ్యాయి. నివాస ప్రాంతాలు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టిన బొమ్మల పట్టణంలా మారిపోయాయి. దీంతో అధికారులు అత్యవసర పరిస్థితి ప్రకటించి సహాయక చర్యలు ప్రారంభించారు.
మంచు బరువు… | Kamchatka Record Snowfall
ఇళ్ల పైకప్పులపై భారీగా పేరుకుపోయిన మంచు కూలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కొన్ని చోట్ల పైకప్పుల నుంచి జారిన మంచు కారణంగా ప్రాణ నష్టం కూడా జరిగింది.

ప్రకృతి ప్రకోపానికి ఉదాహరణ | Nature’s Fury in Russia’s Far East
అగ్నిపర్వతాలు, భూకంపాలకు పేరుగాంచిన కమ్చాట్కా ఇప్పుడు తీవ్ర హిమపాతంతో మరో సవాల్‌ను ఎదుర్కొంటోంది. ఆవెలాంచెస్, తీవ్రమైన చలి, ఎడతెరిపిలేని మంచు… ఇవన్నీ కలిసి ప్రజల జీవితాన్ని కఠినంగా మార్చేశాయి.
ఆర్కిటిక్‌కు సమీపంగా ఉన్న రష్యా ప్రాంతాల్లో చలి తీవ్రత ఎంత భయంకరమో ఈ ఘటన మరోసారి ప్రపంచానికి గుర్తు చేసింది.
చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
