Mana : భారత్‌లో చివరి గ్రామం…ఇక్కడే సరస్వతి నది పుట్టేది | India’s Last Village

షేర్ చేయండి

Mana: అందరికీ నమస్కారం, నేను 2024 సెప్టెంబర్‌లో ఒకప్పుడు భారత దేశంలో చివరి గ్రామం (India’s Last Village) పిలుచుకునే మాణాకు వెళ్లాను. దీనిని ఇప్పుడు భారత్‌లో తొలి గ్రామం అని కూడా పిలుస్తున్నారు.

ఈ గ్రామానికి నేను ఎలా వెళ్లాను… నా ప్రయాణం ఎలా జరిగింది…ఏం చూశాను, ఏం తెలుసుకున్నానో…మీతో షేర్ చేసుకోబోతున్నాను. దీనికి సంబంధించిన వ్లాగ్ (Prayanikudu Channel) కూడా చేశాను. 

ఈ బ్లాగ్ చివరిలో ఆ వీడియో ఉంటుంది. కావాలంటే అది కూడా చూడండి. అయితే వీడియోలో అన్ని (Mana Village Vlog Telugu) విషయాలు చెప్పడం సాధ్యం కాదు కాబట్టి ఇక్కడ వాటిని కూడా కవర్ చేశాను. సో ముందు ఈ బ్లాగ్ చదివి తరువాత వీడియో చూడండి. ఎందుకంటే బోటని చదివితే పువ్వుల అందం మరింత బాగా అర్థం అవుతుంది అంటారు కదా.

మాణా ఎక్కడుంది ? | Where Is Mana ?

మాణా అనేది ఉత్తరాఖండ్‌లోని ఛమోలి జిల్లాలో ఉంది. బద్రినాథ్ (Badrinath Temple) ఆలయానికి ఇది కేవలం 3 కిమీ దూరంలో మాత్రమే ఉంటుంది. బద్రినాథుడి దర్శనం తరువాత నేను నెక్ట్స్‌డే మాణాకు బయల్దేరాను. కథలో ముందుకు వెళ్లడానికి ముందు మీకు ఒక విషయం చెప్పాలి. నేను హైదరాబాద్ నుంచి బయల్దేరే ముందే హోటల్స్, ట్రైన్, అన్ని టికెట్లు బుక్ చేసుకున్నాను. 

India's Last Village
భజన్ ఆశ్రమం

ఆన్‌లైన్లో ఆలయానికి దగ్గర్లో ఉన్న హోటల్ ఏంటి అని సెర్చ్ చేస్తే నాకు భజన్ ఆశ్రమ్ (Bhajan Ashram In Badrinath ) అనే ఒక హోటల్ కనిపించింది. ఆశ్రమం అంటే నీట్‌గా, పవిత్రంగా ఉంటుంది కదా అనుకున్నాను. కానీ నాకు రూమ్ అస్సలు నచ్చలేదు.

  • బెడ్ లైన్ సరిగ్గా లేదు.
  • దుప్పట్లు నీట్‌గా లేవు. టేబుల్స్ , ఫ్లోర్ క్లీన్‌గా లేదు.
  • రూమ్‌లో లైటింగ్ సరిగ్గా లేదు, వెంటిలేషన్ లేదు.
  • కామన్ వాష్‌రూమ్ ఉంది. ఇంకా చాలా లోపాలు ఉన్నాయి.
  • అందుకే మీకు ఆ హోటల్ అస్సలు సజెస్ట్ చేయను.

బద్రినాథ్‌ నుంచి మాణాకు | Badrinath To Mana

బద్రినాథ్ నుంచి మాణా సుమారు 3 కీమీ దూరంలో ఉంటుంది. అక్కడికి వెళ్లడానికి మనకు షేరింగ్ క్యాబ్స్ అందుబాటులో ఉంటాయి. పర్ పర్సన్ 100 చార్జ్ చేస్తారు. ఇక్కడ క్యాబ్స్‌ను ఒక నెంబరింగ్ ప్రకారం క్యూలో అందుబాటులో ఉంచుతారు. ఒకదాని తరువాత ఒకటి ప్రయాణికులను ఎక్కించుకుని బయల్దేరుతాయి. మంచి సిస్టమ్ ఇది. అయితే కనీసం 8 మంది వచ్చే వరకు బండి తీయరు. సో ఇక్కడ కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది.

డ్రైవర్‌తో తెలుగు యాత్రికుల ఫైట్ 

Badrinath To Mana Village Taxi Fare
వంద ఇవ్వమని కారు డ్రైవరు…50 ఇస్తాను అని తెలుగు యాత్రికులు…కాసేపు చిన్నపాటి ట్రాఫిక్ జామ్ అయింది.

మానాకు బయల్దేరిన నా క్యాబ్‌లో కొంత మంది తెలుగు వారు కూడా ఉన్నారు. జస్ట్ 3 కీలో మీటర్లకు రూ.100 చార్జ్ చేస్తున్నారు అనే చిన్న విషయానికి వాళ్లు వెహికల్ డ్రైవర్‌తో గొడవ పెట్టుకున్నారు. ఆ వంద రూపాయలతో తెలుగు రాష్ట్రాల్లో వాళ్లు ఎక్కడెక్కడికి వెళ్లగలరో, ఎంత దూరం వెళ్లగలరో డిస్కస్ చేసుకున్నారు. 

టాక్సీ యూనియన్‌‌తో పోరాడి టైమ్ వేస్ట్ చేయలేము

నాకు ఎందుకో వాళ్ల డిస్కషన్‌లో జాయిన్ అవ్వాలి అనిపించలేదు. ఎందుకంటే ఇక్కడ యూనియన్ రేట్ల ప్రకారమే వాళ్లు చార్జ్ చేస్తారు. ఇక్కడే కాదు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్ వద్ద టాక్సీ వాళ్లు అందరూ ఒకే మాటపై ఉంటారు. అందరం కలిసి సమానంగా దోచుకుందాం అన్నట్టుగా ఉంటుంది వీరి విధానం. మనం అరిస్తే వాళ్లు కరుస్తారు. స్థానబలం చూపిస్తారు..

సో తక్కువో ఎక్కువో కానీ నేనేం అనలేదు. గోవాలో (Goa) కూడా ఇదే కదా నడుస్తోంది. అందుకే కదా చాలా మంది థాయ్‌లాండ్‌ వెళ్లడానికి ఇష్టపడుతున్నారు.

కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అనే పరిస్థితి ఉండటంతో నేను లొకేషన్స్‌ చూస్తూ డైవర్ట్ అయ్యాను. కారు అతను వాళ్లని మాణా దగ్గర డ్రాప్ చేసి వెనక్కి వెళ్లే దారిలో బడ్డీ హైకర్స్ (Buddy Hikers Badrinath) అనే నా హోమ్ స్టే దగ్గర డ్రాప్ చేశాడు.

హిమాలయాల పాదాల వద్ద స్టే 

Himalayan Foot Hill
హిమాలయా పర్వతాల పాద భాగంలో నేను ఉన్న టెంట్ క్యాంప్

ఇదే నా టెంట్ క్యాంప్ స్టే. హిమాలయ పర్వతాల మధ్యలో జనావాసాలకు దూరంగా టెంటుల్లో ఉంది. దీని రివ్యూస్ చూశాను. పాజిటీవ్‌గా అనిపించడంతో ఇక్కడికి వచ్చాను. మిట్టమధ్యాహ్నం అయినా ఇక్కడి గాలిలో వెచ్చదనం లేదు. చల్లని గాలిలో ఎండలో కూర్చొని చుట్టుపక్కన ఉన్న పచ్చని లోయను చూసుకుంటూ చాయ్ తాగుతూ ఈ క్యాంప్ యజమాని మాధవ్ గారు చెప్పే విషయాలను విన్నాను.

ఆయన భవిష్య బద్రి (Bhavishy Badri) ఆలయం గురించి తెలిపారు. విగ్రహానికి ఒక చేయి వచ్చేసింది అని నాలుగు భుజాలు ఏర్పడితే ఏం జరుగుతుందో ఆయన చెబుతున్నారు.

పాపులపై పడని జలపాతం 

అయితే నాకు ఆయన చెప్పేవి వినాలని ఉన్నా, మాణా వెళ్లాల్సి ఉండటంతో నేను మాణా వెళ్లాలి…ఎవరైనా నాతో పాటు వస్తారా ? అనడిగాను. వస్తారని అనుకోలేదు. అయితే వెంటనే ” సరే పదండి. మీకు మానాతో పాటు పంచపాండవులు స్వర్గానికి నడిచి వెళ్లిన దారి, వసుధారా (Vasudhara Falls) అనే జలపాతం చూపిస్తాను అని నాతో రావడానికి సిద్ధం అయ్యారు మాధవ్ గారు. 

First Tea Stall In India
భారత్‌లో తొలి టీ స్టాల్ (First Tea Stall In India). ఇలాంటి టీ స్టాల్స్ అక్కడ చాలా ఉంటాయి.

ఈ జలపాతం నీళ్లు పాపం చేసిన వారిపై అస్సలు పడదట. మాతో పాటు ఆయన, మహారాష్ట్రకు (Maharashtra) చెందిన మోహన్ గారు అని మరో పెద్దాయన కూడా వస్తానన్నారు. సో, మరికాసేపట్లో ఇండియాలో ఫస్ట్ విలేజ్‌కు బయల్లేరాము.

ఈ ప్రయాణంలో నాకు ఇద్దరు అద్బుతమైన స్నేహితులు పరిచయం అయ్యారు. ఒకరు మాధవ్ గారు, మోహహన్ గారు. ముగ్గురిదీ వేరే వేరే ఏజ్ గ్రూప్ అయినా ఐడియాలజీ ఒకటే అవడంతో ఈజీగా కనెక్ట్ అయ్యాం. నిజానికి వాళ్లు వేరే చోటికి వెళ్లాల్సి ఉన్నా నాతో పాటు రమ్మని వారిని రిక్వెస్ట్ చేశాను. 

సో మా క్యాంప్ నుంచి 1 కీమ దూరంలో ఉన్న మాణాకు నడుచుకుంటూ బయల్దేరాం. 

కొద్ది దూరంలోనే మాణా ఎంట్రెన్స్ గేట్ కనిపించింది. ఇక్కడ చిన్న యాంకర్ పార్ట్ షూట్ చేశాను.

Mana Entrance Gate
మాణా గ్రామం ప్రదేశ ద్వారం

నారాయణ పర్వతం, నాగ పర్వతం

బద్రినాథ్‌లో ప్రతీ పర్వతానికి ఆధ్యాత్మిక విశిష్టత ఉంది. వాటి గురించి మాధవ్ గారు చక్కగా వివరించారు.

బద్రినాథ్‌కు స్వాగతం  మీకు ఎదురుగా కనిపిస్తున్న ఈ పర్వతం ఉంది చూడండి మన పూర్వికుల ప్రకారం … బద్రినాథ్‌గారు ఇక్కడికి తొలిసారి ధ్యానం చేయడానికి వచ్చినప్పుడు ఆయన ఒక గుర్రంపై ఇక్కడికి చేరుకున్నారు .ఇది ఆ గుర్రమే అని అంటారు. మీకు మధ్యలో ఒక గ్యాప్‌లాంటిది కనిపిస్తుంది అది కూర్చునే స్థలం .ఇది ఇప్పుడు కూర్చొని ఉంది .

Lord Badrinath Horse Near Mana Village
బద్రినాథుడు ప్రయాణించినట్టు చెబుతున్న అశ్వం…ఇప్పుడు కూర్చుని ఉంది అంటారు.

“కొన్ని కథనాల ప్రకారం బద్రినాథుడు (Lord Badrinath) ఇక్కడికి వచ్చే సమయానికి ఇక్కడ పార్వతి సమేత మహా శివుడు నివసించేవారట. అదే సమయంలో నారాయణుడు తను మృత్యులోకంలోనే ధ్యానం చేయాలి అని అనుకున్నారు .అప్పుడు ఆయనకు గుర్తుకు వచ్చిన విషయం ఏంటంటే మృత్యులోకంలో ఉండేది కేవలం ఒక ఒక దేవుడు దటీజ్ శివ ( Lord Shiva). తరువాత అయన శివుడుని వెతకడం మొదలుపెట్టాడు. 

అప్పుడు శివపార్వతులు ఆయనకు ఇక్కడ కలిశారు.

Mana Village at Himalayas
శివపార్వతుల నుంచి ఈ ప్రాంతాన్ని తీసుకోవడానికి బద్రినాథుడు ఎలా ప్లాన్ వేశారో వివరించిన మాధవ్ గారు.

తరువాత ఈ ప్రాంతాన్ని శివుడి నుంచి తీసుకోవాలి అని ఆయన అనుకున్నాడు

నారాయణ్ (Lord Narayana) బీయింగ్ నారాయణ్ తన చక్రాన్ని తిప్పడానికి మారువేషంలో వచ్చి ఈ గుర్రంపై వచ్చి ఆ గుర్రానికి ఇక్కడే కూర్చోమని ఆదేశించారట. అందుకే ఇది కూర్చున్న పొజిషన్‌లో ఉంటుంది.

మీకు అక్కడ ఎదురుగా కనిపిస్తుంది చూడండి అది నాగ్ పర్వత్ (Nag Parbat)

india's First Village
నాగ్ పర్వత్

ఎప్పుడు నారాయణుడితో స్నేహితుడిగా, పెద్దన్న, చిన్న అన్నగా, లక్ష్మణుడు, ఉద్ధవుడిగా బలరాముడిగా అనేక రూపాల్లో శేషనాగ్ నారాయణుడితో ఉంటాడు.

Narayan Parbat From Mana
ఇది నారాయణ పర్వతం

ఇది నారాయణుడి బద్రి విశాల్ స్వరూపం (Narayan Parbat). ఇందులో ఆయన పద్మాసనంలో ఆశీనులై ఉంటారు”.

ఒక 15-20 నిమిషాలు నడిచి మాణా గ్రామానికి చేరుకున్నాము.

మాణా గురించి | Quick Facts About India’s Last Village

మాణా అనేది చాలా చిన్నగ్రామం సుమారు 1300 మంది మాత్రమే ఉంటారు. ఇది ఉత్తరాఖండ్‌లోని ఛమోలి జిల్లాలో బద్రినాథ్ తరువాత ఉంటుంది. దీనిని ఒకప్పుడు ఇండియాలో చివరి గ్రామం (Last Village In India) అనేవారు. ఎందుకంటే దీని తరువాత మాణా పాస్ ఉంటుంది. అక్కడి నుంచి 26 కీమీ దూరంలోనే ఇండో-టిబెట్ బార్డర్ (India-Tibet Border) ఉంటుంది. 

  • 10500 అడుగుల ఎత్తులో ఉన్న మాణాలో చలికాలంలో (Winter In Mana) ఎవరూ ఉండరు.
  • ఎందుకంటే ఈ ప్రాంతం మొత్తం నిండుగా మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ సమయంలో ఈ గ్రామంలోని ప్రజలంతా దిగువ ప్రాంతాలకు వెళ్తారు.
  • దిగువ ప్రాంతాలు అంటే బద్రినాథ్ ప్రాంతం కాదు. వ్యాలీ ఆఫ్ ప్లవర్స్‌ (Valley Of Flowers) వెళ్లడానికి ముందు నేను ఉన్న గోవింద్ ఘాట్ అనే ప్రాంతం అన్నమాట. 

Watch : దేవకన్యలు ఆటలాడే స్థలం

మాణా అందాలు అదరహో

మాణా చాలా చిన్నది. కానీ చాలా అందంగా ఉంటుంటి. ఒకవైపు భారీ హిమాయల పర్వతాలు (Himalayas), గ్లేషియర్స్, మరోవైపు లోయ, లోయ మధ్యలోంచి ప్రవాహిస్తున్న అలకానంద నది, నదికి అటువైపున ఉన్న నారాయణ పర్వతం, నర పర్వతం, నాగ్ పర్వత్…దూరంలో అక్కడక్కడ కనిపిస్తున్న జలపాతాలు, లోపలికి వెళ్తున్నా కొద్ది ఎక్కడి నుంచో అత్యంత వేగంతో నీరు దూకుతున్నట్టుగా వినిపిస్తోన్న శబ్దం…మాణాలో మీ మనసు నేచర్‌తో సులభంగా కనెక్ట్ అవుతుంది.

మాణాలో చాలా ఫేమస్ సూప్ 

Mana Village Famous Soup
మాణాలో మూలికతో తయారు చేసిన తన సూప్‌ గురించి వివరిస్తున్న సురేందర్ సింగ్ గర్వాల్

మాణాలో నాకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. ఇక్కడి వనమూలికలతోె తయారు చేసిన ఒక సూప్ చాలా మంది ఇష్టపడి టేస్ట్ (Mana Famous Soup) చేస్తుంటారట. కానీ టైమ్ లేకపోవడంతో నేను దీన్ని టేస్ట్ చేయలేకపోయాను. మీరు వెళ్తే తప్పకుండా టేస్ట్ చేయండి. 

హోమ్ స్టేస్ | Home Stays

Mana Home Stays
పర్యాటకులు ఇక్కడ స్టే కూడా చేయవచ్చు

టూరిస్ట్‌ల కోసం ఇక్కడ కొత్తగా ఎన్నో హోమ్‌స్టేస్ కడుతున్నారు. కావాంటే మీరు ఆన్‌లైన్లో కూడా బుకింగ్ చేసుకోవచ్చు. అయితే నవంబర్ నుంచి మే వరకు ఇక్కడ ఎవరూ ఉండరు అనే విషయాన్ని గమనించి ప్లాన్ చేసుకోండి. 

చూడాల్సిన ప్రదేశాలు | Places In Mana Village

మాణా అనేది భౌగోళికంగానే కాదు చారిత్రాత్మకంగా కూడా అత్యంత ప్రధానమైనది అని చెప్పవచ్చు.  

స్వర్గానికి దారి | Steps To Heaven

Mana Village
మానా నుంచి సతోపంత్ వెళ్లే దారిలో…

స్వర్గానికి దారి కనుక్కునేందు పంచ పాండవులు (Pandavas), ద్రౌపది ఇదే దారిలో సతోపంత్ వైపునకు వెళ్లారు.

భీమ్ పుల్ | Bhimpul

Bhimpul mana
భీముడు నిర్మించాడు అని చెబుతున్న భీమ్‌పుల్

అయితే రెండు కొండల మధ్య దూరం ఎక్కువగా ఉండటంతో ద్రౌపది ముందుకు వెళ్లడంలో ఇబ్బంది పడిందని, దాంతో భీముడు వెంటనే ఒక పెద్ద బండరాయిని తీసుకుని ఒక వంతెనలా ఏర్పాటు చేశారని అంటారు.

మహాభారత రచన

Places To Visit In Mana
మాణాలో చూడాల్సిన ప్రదేశాలు

శ్రీ వరసిద్ధి వినాయకుడు, వేద వ్యాసుడు ఇక్కడే కూర్చుని మహాభారతాన్ని పూర్తి చేశారంటారు. దానికి ప్రతీకగా ఇక్కడ గణేష్ గుఫా (Ganesh Gufa), వ్యాస్ గుఫా (Vyas Gupha) అనే రెండు గుహలు ఉన్నాయి. 

అయితే నేను ముందు సరస్వతి నది, భీమ్ పుల్, సరస్వతీ ఆలయం, కేశవ్ ప్రయాగ్ (Keshav Prayag) చూడటానికి వెళ్తున్నాను. టైమ్ ఉంటే గణేష్ గుఫా, వ్యాస్ గుఫా కూడా మీకు చూపించేందుకు ప్రయత్నిస్తాను. 

మరికాసేపట్లో మీరు సరస్వతీ నదిని చూస్తారు. ఇక్కడే పౌరాణిక సరస్వతి దేవి ఆలయం ఉంది.

సరస్వతీ నది | Saraswathi River At Mana Village

Tasting Saraswati River Water
సరస్వతి నది నీటిని ప్రసాదంగా స్వీకరించి తలపై చల్లుకున్నాను..

చిన్నప్పటి నుంచి సరస్వతి నది గురించి వింటూనే ఉన్నాం. ఈ నది ఉంది అని లేదు అని ఎన్నో కథలు. కానీ నేను ఇక్కడ సరస్వతి నదిని చూశాను. అయితే నది దగ్గరికి వెళ్లే అవకాశం లేదు. లక్కీగా మనం సరస్వతి నదీ నీటిని ప్రసాదంగా తీసుకోవచ్చు. జీవితంలో అరుదుగా లభించే ఇలాంటి ఛాన్స్‌లను నేను అస్సలు మిస్ అవ్వాలి అనుకోవడం లేదు.

Saraswati Temple Mana
ప్రాచీన సరస్వతీ అమ్మవారి ఆలయం (ఇటీవలే రినోవేట్ చేయడంతో కొత్తగా అనిపిస్తుంది)

సరస్వతి నది ఇక్కడే పుట్టి వెంటనే అలకనందా నదిలో కలిసిపోతుంది. ఇక్కడ సరస్వతి మాతా పురాతన ఆలయం కూడా ఉంది. ఇటీవలే ఈ ఆలయాన్ని రినోవేట్ చేశారు

సరస్వతి నది కథ | Story Of Saraswathi River

Saraswati River Mana
లక్కీగా నేను వెళ్లినప్పుడు ఇంద్ర ధనస్సు ఏర్పడింది

వేద వ్యాసుడు-వినాయకుడు గుహలో కూర్చుని మహా భారతాన్ని (Mahabharat) రచించే పనిలో ఉన్నప్పుడు ఇక్కడి సరస్వతీ నది ప్రవాహం హోరు, ఆ శబ్దం వారిని బాగా ఇబ్బంది పెట్టేదట. దీంతో వినాయకుడికి కోపం వచ్చి సరస్వతి నదిని శపిస్తాడట.అందుకే సరస్వతి నది ఇలా పుట్టి అలా భూతలంలోకి వెళ్లిపోయిందని అంటారు. కొంత మంది వ్యాస మహర్షి సరస్వతి నదికి శాపం పెట్టారని అంటారు.

సరస్వతి నది మిస్టరి | Mystery Of Saraswati River

మాణాలో (India’s First Village) పుట్టి మాణాలోనే నేలలో కలిసే సరస్వతి నది భూమిలోపల అంతర్వాహినిగా ప్రవాహించి అది ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని (Prayagraj) త్రివేణి సంగమం వద్ద గంగా, యమునా నదిలో కలుస్తుందంటారు. అయితే సరస్వతి నది అలకానంద నదిలో కలుస్తుంది అని కూడా అంటారు.

అలకానంద నది దేవ్ ప్రయాగ్ (Dev Prayag) వద్ద భగీరథి నదితో కలిసి గంగా నదిగా అవతరిస్తుంది. ఈ ప్రాంతంపై కూడా గతంలో నేను ఒక వీడియో చేశాను. కాస్త టైమ్ తీసుకుని అది కూడా చూడగలరు.

Watch:  గంగా నది ఏర్పడే ప్రాంతం

ఈ బ్లాగ్ ఇంతటితో ముగిస్తున్నాను. నెక్ట్స్ బ్లాగ్‌లో వాసుకీ నాగు తపస్సు చేసిన ప్రాంతం, వసుధారా జలపాతం చూపిస్తాను. ఈ జలపాతం నీరు ఎవరైతే పాపం చేయరో వారిపైనే పడుతుంది అంటారు. పంచపాండవులు, ద్రౌపదీ కూడా సతోపంత్ (Sathopant) వెళ్లే దారిలో వసుధార జలపాతం నీరు తమపై పడుతుందేమో అని చెక్ చేశారట. 

కానీ అందులో ఒక్కరిపైనే ఆ జలపాతం నీరు పడిందట. ఆ ఒక్కరు ఎవరు? నేను ఈ టెస్టులో పాస్ అయ్యానా లేదా ఫెయిలా అనేది నెక్ట్స్ వీడియోలో చూపిస్తాను. తరువాత బ్లాగ్ కూడా షేర్ చేస్తాను.

ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానెల్ ముందుకు వెళ్లేందుకు మీ సపోర్ట్ నాకు కావాలి. అలాగే లేటెస్ట్ ట్రావెల్ న్యూస్, డెస్టినేష్ గెడెన్స్ కోసం తెలుగులో తొలి & నెంబర్ 1 ట్రావెల్ వెబ్‌సైట్ అయిన Prayanikudu.Com విజిట్ చేయండి.

📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!