Sharannavarathri 2025: 10 ఏళ్ల తర్వాత దసరా పండుగ 11 రోజులు.. అమ్మవారి దర్శనం కోసం భక్తుల ఎదురుచూపులు!
Sharannavarathri 2025: వినాయక నవరాత్రులు ముగియగానే దేవీ నవరాత్రుల శోభ మొదలవుతుంది. ఊరూరా, వాడవాడలా ఉన్న ఆలయాలు శరన్నవరాత్రుల వేడుకల కోసం అద్భుతంగా అలంకరించుకుంటాయి. అందులోనూ విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయని మనందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం దేవీ నవరాత్రులు సెప్టెంబర్ 22న ప్రారంభం కానున్నాయి. అయితే, ఈసారి అమ్మవారు 9 రోజులకు బదులుగా 11 రోజులపాటు భక్తులకు దర్శనం ఇవ్వడం ఒక ప్రత్యేక విశేషం.
ఏమిటి ఈ ప్రత్యేకత?
సాధారణంగా ప్రతి సంవత్సరం 9 రోజులపాటు జరిగే దసరా శరన్నవరాత్రులు ఈసారి 11 రోజుల పాటు జరగనున్నాయి. విజయదశమి రోజుతో కలిపి అమ్మవారు మొత్తం 11 అవతారాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. పండితులు చెబుతున్న దాని ప్రకారం, పదేళ్లకు ఒకసారి తిథి వృద్ధి చెందుతుంది. దీనివల్ల ఈసారి దసరా ఉత్సవాలు 11 రోజుల పాటు జరుగుతాయి. ఇంతకు ముందు 2016లో కూడా ఇదే విధంగా 11 రోజుల ఉత్సవాలు జరిగాయి. అప్పుడు కూడా తిథి వృద్ధి చెందడం వల్ల అమ్మవారిని కాత్యాయినీ దేవిగా అలంకరించారు. ఈసారి కూడా అమ్మవారు కాత్యాయినీ దేవి అవతారంలో భక్తులకు కనువిందు చేయనున్నారు.

అమ్మవారి 11 అలంకారాలు
భక్తుల కోరికలను నెరవేర్చే కల్పవల్లిగా పూజలందుకునే దుర్గమ్మ ఈ 11 రోజులు మొత్తం 11 రూపాల్లో దర్శనం ఇవ్వనున్నారు. ఇంద్రకీలాద్రి ఆలయ అధికారులు ఇప్పటికే ఈ అలంకారాల షెడ్యూల్ను విడుదల చేశారు.
ఇది కూడా చదవండి : Azerbaijan అజర్ బైజాన్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? 10 టిప్స్!
సెప్టెంబర్ 22: శ్రీ బాలత్రిపుర సుందరి దేవి
సెప్టెంబర్ 23: శ్రీ గాయత్రీ దేవి
సెప్టెంబర్ 24: శ్రీ అన్నపూర్ణా దేవి
సెప్టెంబర్ 25: శ్రీ కాత్యాయనీ దేవి
సెప్టెంబర్ 26: శ్రీ మహాలక్ష్మీ దేవి
సెప్టెంబర్ 27: శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి
సెప్టెంబర్ 28: శ్రీ మహా చండి దేవి
సెప్టెంబర్ 29: శ్రీ సరస్వతీ దేవి (మూల నక్షత్రం రోజు)
సెప్టెంబర్ 30: శ్రీ దుర్గా దేవి
అక్టోబర్ 1: శ్రీ మహిషాసుర మర్దినీ దేవి
అక్టోబర్ 2: శ్రీ రాజరాజేశ్వరి దేవి (విజయదశమి రోజు)
మూల నక్షత్రం రోజున ప్రత్యేక పూజలు
శరన్నవరాత్రులలో అత్యంత ముఖ్యమైన రోజు అమ్మవారి జన్మనక్షత్రమైన మూల నక్షత్రం రోజు. ఈ సంవత్సరం మూల నక్షత్రం సెప్టెంబర్ 29న వచ్చింది. ఈ రోజున అమ్మవారు సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ పవిత్రమైన రోజున ముఖ్యమంత్రి గారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అదేవిధంగా, విజయదశమి అయిన అక్టోబర్ 2న ఉదయం పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయి. అదే రోజు సాయంత్రం కృష్ణా నదిలో హంస వాహనంపై తెప్పోత్సవం కూడా నిర్వహించనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి : Ramayana Trail : శ్రీలంకలో రామాయణం టూరిజం…ఏం చూపిస్తారు? ఎలా వెళ్లాలి ? Top 5 Tips
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.