స్కూల్, కాలేజీలో ఉన్నా ఉద్యోగం చేస్తున్నా ఎండాకాలం అంటే అందరికి జాలిగా ఏదైనా టూర్‌కు వెళ్లాలి అనిపిస్తుంది. మీరు కూడా అలా వెళ్లాలి అనుకుంటే అది కూడా రోడ్ ట్రిప్ ప్లాన్ (Road Trip Destinations in India) చేస్తోంటే ఈ పోస్టు మీ కోసమే.
ముఖ్యాంశాలు
హిమాలయాల నుంచి పాండి బీచ్ వరకు | Road Trip Destinations in India
భారత దేశంలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. విభిన్నమైన సంస్కృతితో పాటు భిన్నమైన భౌగోళిక స్వూరూనం, వాతావరణం మన దేశానికి సొంతం. రోడ్ ట్రిప్‌లో వీటన్నింటిని మీరు కవర్ చేయవచ్చు. హిమాయాలయాల (Himalayas) నుంచి పాండీ బీచ్ వరకు మీరు ఎక్కడికి వెళ్లినా ఇంకా ప్రయాణించాల్సిన, మరింత అన్వేషించాల్సిన ప్రదేశాలు ఇంకా అనేకం ఉన్నాయి అని మీకే అర్థం అవుతుంది.
అయితే అన్ని ఆప్షన్స్‌లో బెస్ట్ ఏది ? మన దేశంలో ఎక్కువ మంది ఇష్టపడే సమ్మర్ రోడ్ ట్రిప్ డెస్టినేషన్స్ ఏవి ? అనేగా మీ సందేహం..
ఇదే మా సమాధానం :
1.మనాలి నుంచి లేహ్ : సాహసం శ్వాసగా సాగిపో
Manali To Leh Road Trip: మనాలి నుంచి లేహ్ వరకు రోడ్ ట్రిప్ అనేది భారత్‌లో ఉన్న ప్రతీ బైకర్ కల. ఈ ప్రయాణం చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. రోహ్తాంగ్ (rohtang), బారాలచా లా వంటి ఎత్తైన పర్వత మార్గాల నుంచి వెళ్లడం అనేది ఒక సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌గా మిగిలిపోతుంది. కావాలంటే రాసిస్తాను.

మనాలి (Manali) నుంచి వెళ్లే దారిలో కనిపించే మంచు పర్వతాలు, అద్భుతమైన పర్వత శ్రేణులు… వీటిని మించిన అందమైన సాహసయాత్ర లేదు అనేలా ఉంటుంది ఈ రోడ్ ట్రిప్.

ప్రతీ సంవత్సరం జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో ఈ రూట్లో చాలా మంది బైైక్ ట్రిప్స్ చేస్తుంటారు. ఈ సమయంలో అన్ని మార్గాలు పర్యాటకులు, ప్రయాణికుల కోసం తెరుచుకుంటాయి. వ్యూస్ కూాాడా చాలా అందంగా ఉంటాయి. పెట్టిన ప్రతీ పైసా వసూల్ అవుతుంది.
2.ముంబై నుంచి గోవా : నీలా ఎవరూ లేనే లేరూ
Mumbai – Goa Road Trip అందమైన బీచుల గుండా వెళ్తూ అద్భుతమైన కల్చర్ గురించి తెలుసుకుంటూ రోడ్ ట్రిప్ చేయాలి అనుకుంటే ముంబై -గోవా ట్రిప్ మీకు బాగా సెట్ అవుతుంది. పచ్చిమ కనుమల నుంచి కోంకన్ కోస్ట్‌లో (Konkan Coast) వరకు ఉన్న అందమైన గ్రామాలను చూస్తూ మీ ప్రయాణం కొనసాగించవచ్చు.

ఎటు చూసినా పచ్చదనం, మిమ్మల్ని టెంప్ట్ చేసే పిట్ స్టాప్స్, నాలుకను లపలపలాడించే లోకల్ డిషెస్… ఇవన్నీ ఈ ట్రిప్‌లో ఉన్న కొన్ని హైలైట్స్ మాత్రమే. ఈ ప్రయాణం చాలా అందమైనది అని మీరే అంటారు.
3. గౌహతి నుంచి తవాంగ్ : ఏ దివిలో విరిసిన పారిజాతమో
Guwahati To Tawang Road Trip : పర్సనల్‌గా ఇది నా ఫేవరిట్ రూట్. అఫ్‌కోర్స్ గౌహతిలో ఉండే ఉక్కపోత మిమ్మల్ని ఒక్కక్షణం కూడా ఉండనీయదు. ఎందుకంటే ఆగస్టులో కూడా వేడి అదరగొడుతుంది. అందుకే గౌహతి వెళ్లగానే బైక్ లేదా కారు తీసుకుని అరుణాచల్ ప్రదేశ్‌కు (Arunachal Pradesh) బయల్దేరండి.

మధ్యలో మీకు సేలా పాస్ (Sela Pass) వస్తుంది. చాలా అందంగా కొన్ని కి.మీ వరకు విస్తరించిన ఎత్తైన పర్వతాలను చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు. సేలా పాస్ దగ్గర ఆక్సిజన్ లెవల్ తక్కువగా ఉంటుందని గుర్తుంచుకోండి.
ఇక్కడ నేను లైటర్ వెలిగించడానికి ప్రయత్నించాను. కానీ ఆక్సిజన్ లేకపోవడం వల్ల అది వెలగలేదు. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి.

ఇక తవాంగ్ విషయానికి వస్తే నాకు తెలిసి ఇండియాలో స్విట్జర్లాండ్ లాంటి ఒక ప్లేస్ వెతుకుతోంటే ఈ ప్రాంతం అలాగే ఉంటుంది. దీంతో పాటు తవాంగ్ వెళ్లే మీరు బూమ్లా పాస్ (Bumla Pass) వద్ద చైనా బార్డర్ (Tawang To Bumla Pass) వరకు కూడా రైడ్ చేసుకుంటూ వెళ్లవచ్చు. పైసా వసూల్ ట్రప్ ఇది.
4. చెన్నై నుంచి పుదుచ్చెరి
నీ కళ్లు నీలి సముద్రం నా బైకేమో అందులో రోడ్డు ప్రయాణం

Chennai to Puduchchery: మన దేశంలో అందమైన సీ వ్యూ ఉన్న ప్రాంతాల్లో మీరు రైడింగ్‌కి వెళ్లాలి అనుకుంటే ఈ రూట్ మీకు బాగా సెట్ అవుతుంది. పుదుచ్చెరిలో ఫ్రెంచ్ కాలం నాటి నిర్మాణాల మధ్యలోంచి వెళ్తోెంటే ఏంటి ఒకప్పుడు ఇండియా ఇలా ఉండేదా అని అనిపించడం కామన్.
తమిళనాడుకు వెళ్తే మాత్రం అక్కడ అద్భుతమైన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. వీలైతే దర్శించుకోండి. మన దేశంలోనే అత్యధిక ఆలయాలు ఉన్న రాష్ట్రం గనక మీకు ఎక్కడ చూసినా అందమైన, విశాలమైన ఆలయాలు ఎన్నో కనిపిస్తాయి. వాటిని అస్సలు మిస్ అవ్వకండి.
కిక్ కొట్టి బండి స్టార్ట్ చేయండి
ప్రయాణికులకు (travelers) బైక్ అనేది రెండో శరీరంలాంటిది. రెండు శరీరాలు ఒక ఆత్మగా మారి చేసేదే రోడ్ ట్రిప్. మిమ్మల్ని మీరు ప్రేమించుకునే, మీలోని మిమ్మల్ని తెలుసుకునే అద్బుతమైన అవకాశం ఇది.
ఇలాంటి జర్నీలు (Road Trip Destinations in India) చేసే సమయంలో మీరు సేఫ్ అండ్ సెక్యూర్డ్‌గా ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే సేఫ్‌గా ఇంటికి తిరిగి వచ్చేవాడే నిజమైన రైడర్.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.