పర్యాటక రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశలో సౌత్ ఆఫ్రికా ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా వీసా ప్రక్రియతో ( South African Visa ) పాటు , ఎంట్రీ అరేంజ్‌మెంట్ ప్రక్రియను సులభతరం చేయనున్నట్టు ప్రకటించింది. ఈ మార్పులను భారతీయ పర్యాటకులను ప్రధాన లక్ష్యంగా చేసుకుని చేసినట్టు దక్షిణాఫ్రికా అధికారులు ప్రకటించారు.
ముఖ్యాంశాలు
ఓమాన్, సౌదీ అరేబియా, ఇండోనేషియా ( Indonasia ) వంటి దేశాలు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే దిశలో అడుగులు వేస్తున్నాయి.ఈ తరుణంలో దక్షిణాఫ్రికా కూడా ఈ రేసులో ఉండేలా కీలక నిర్ణయాలు తీసుకుంది. వివిధ దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంచుకుని తమ దేశంలో పర్యాటక ఆదాయాన్ని పెంచాలని భావిస్తోంది.
ఇది కూడా చదవండి : Indian License : భారతీయ లైసెన్స్ ఈ 15 దేశాల్లో కూడా చెల్లుతుంది
వీసా ప్రక్రియ| South African Visa Process
భారతీయు కోసం వీసా ప్రక్రియను సులభతరం చేసింది సౌత్ ఆఫ్రికా. ఇందులో భాగంగా వీసా కోసం కావాల్సిన డాక్యుమెంట్ల సంఖ్యను తగ్గించింది. ప్రాసెసింగ్ సమయాన్ని కుదించింది. ప్రయాణికులకు మరింత అనుకూలంగా మార్చే దిశలో అడుగులు వేస్తోంది. ఇకపై ఆన్‌లైన్లో అప్లికేషన్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత వేగంగా అప్రూవల్స్ రానున్నాయి.దీని వల్ల ప్రయాణికులకు తమ ట్రిప్ ( Trip ) గురించి ఎక్కువ ఆలోచించే అవకాశం లభించనుంది.
టూరిజం ఆదాయం కోసం..
గత కొన్నేళ్లుగా సౌత్ ఆఫ్రికాలో పర్యాటక రంగం సంక్షోభంలో ఉంది. దాంతో పాటు ఈ దేశం పర్యాటకులకు అంత సేఫ్ కాదు అనే అపప్రఖ్యాతిని కూడా మూట కట్టకుంది. దీంతో అంతర్జాతీయ టూరిస్టుల సంఖ్య గణనీయంగా తగ్గింది. అయితే సౌత్ ఆఫ్రికా వెళ్లే భారతీయుల ( Indian Tourists ) సంఖ్య ఎక్కువగా ఉంది.
ఈ కొత్త వీసా ( Visa ) విధానం వల్ల మరింత సంఖ్యలో భారతీయులు ఈ దేశాన్ని విజిట్ చేస్తారని భావిస్తోంది ఈ దేశం. దీని వల్ల టూరిజంపై ఆధారపడే రంగాలు ఆర్థికంగా పుంజుకుంటాయని ఆశిస్తోంది. కొత్తగా ప్రయాణం ( Travel ) మొదలు పెట్టేవారు తమ దేశానికి వస్తారని ఈ మార్పులు చేసింది.
ఇది కూడా చదవండి : Azerbaijan అజర్ బైజాన్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? 10 టిప్స్!
భారతీయులు ఇష్టపడే అంశాలు
భారతీయులు ఇష్టపడేలా సౌత్ ఆఫ్రికాలో ఎన్నో పర్యాటక ప్రదేశాల ఉన్నాయి. కేప్‌టౌన్ ( Cape Town ) , జోహాన్నెస్‌బర్గ్ ( Johanneseburg ) లాంటి నగరాలకు రిలాక్సేషన్ కోసం, సాహసాలు చేయడానికి చాలా మంది వెళ్తూ ఉంటారు. సౌత్ ఆప్రికా భౌగోళిక స్వరూపం , అక్కడి పర్వతాలు, మైదానాలు ఇవన్నీ భారతీయులనను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే సౌత్ ఆఫ్రికా తెచ్చిన ఈ వీసా మార్పులకు భారతీయులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
ఈ కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.