Srikalahasti Brahmotsavam 2026: ఫిబ్రవరి 18 నుంచి 23 వరకు వైభవంగా శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలు
Srikalahasti Brahmotsavam 2026: ఆంధ్రప్రదేశ్లో ఉన్న శ్రీకాళహస్తి దేవస్థానంలో ప్రతి సంవత్సరం జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈసారి 2026 ఫిబ్రవరి 18 నుంచి 23 వరకు వైభవంగా నిర్వహించనున్నారు.
ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తుల కోసం ప్రత్యేక పూజలు, వాహన సేవలతో పాటు ఉత్సవ మూర్తుల అలంకరణ ప్లాన్ చేస్తున్నారు.
ఈ బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 18వ తేదీన మంగళవారం ధ్వజారోహణంతో ప్రారంభం అవుతాయి. ఉత్సవం మధ్యలో కళ్యాణోత్సవం, వసంతోత్సవం, రథోత్సవం, పల్లకి సేవలు వంటి ముఖ్యమైన కార్యక్రమాలు జరగనున్నాయి.
ఫిబ్రవరి 19వ తేదీన మహా శివరాత్రి (Maha Shivaratri ) సందర్భంగా శ్రీ కాళహస్తీశ్వర స్వామి దర్శనం కోసం లక్షల మంది భక్తులు రానున్నారని దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు.
- ఇది కూడా చదవండి : తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఎవరు నిర్మించారు ? శ్రీవారు వైకుంఠం విడిచి ఎందుకు వచ్చారు?
బ్రహ్మోత్సవం చివరి రోజు అంటే 2026 ఫిబ్రవరి 23వ తేదీన ధ్వజావరోహణంతో ఉత్సవం ముగుస్తుంది. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక దర్శనాలు, క్యూ లైన్లు, భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ కోసం చర్యలు తీసుకున్నట్లు దేవస్థానం తెలిపింది.
శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవం కేవలం ఒక ఆధ్యాత్మిక ఉత్సవం మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక వేడుకగా కూడా నిలుస్తోంది. ఈ ఉత్సవానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా భక్తులు శ్రీకాళహస్తికి రానున్నారు.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.

▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
Feature Image Source: theblehwoman/twitter
