Srirangam Travel Guide 2025: ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం – History, Darshan, Timings & Tips
Srirangam Travel Guide 2025 కొన్ని ఆలయాలకు దర్శనం కోసం మనమే వెళ్తాం… కానీ కొన్ని ఆలయాలు మనల్ని పిలుస్తాయి. శ్రీరంగం , ఆలాంటి ఆలయమే. ఇక్కడ అడుగుపెడితే… మనసు నిశ్శబ్దమైపోతుంది…
మనకన్నా పెద్ద శక్తి ఉందని మనం తెలుసుకుంటాం.
ఇది భూమిపై ఉన్న వైకుంఠం.
కీలక అంశాలు
స్థలం : శ్రీరంగం, తమిళనాడు ( Srirangam, Tamil Nadu)
ప్రత్యేకత : ప్రపంచంలోనే అతిపెద్ద యాక్టివిల్ దేవాలయం ( The World’s Largest Functioning Hindu Temple )
ముఖ్యాంశాలు
శ్రీరంగం విశిష్టత | Significance of Srirangam
“హిందూ మతంలో మూడు ప్రధాన వైష్ణవ ధామాలు ఉన్నాయి…
📍 శ్రీరంగం -ఇక్కడ శ్రీ మహా విష్ణుడు సేదతీరుతూ ఉంటాడు
📍 తిరుమల- ఇక్కడ ఆయన నిలబడి భక్తులకు దర్శనం ఇస్తాడు
📍 బద్రీనాథ్- ఇది ఆయన ధ్యానం చేసిన ప్రదేశం
వైష్ణవ సంప్రదాయంలో ఈ మూడు ధామాల దర్శనాన్ని
భూలోకం నుండి పరబ్రహ్మాని చేరే మార్గం అంటారు.

నేను శ్రీరంగం తరువాత తిరుమల వెళ్లాను తరువాత హిమాలయాల్లో ఉన్న బద్రినాథ్ వెళ్లాను.”
బద్రినాథుడి (Badrinath Temple Guide) దర్శనం కోసం శారీరకంగా, మానసికంగా సిద్ధం అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి చలి, ఎత్తైన పర్వతాలు, అలకనందా నదీ ప్రవాహం…రిషికేష్ (rishikesh travel guide ) నుంచి బద్రినాథ్ వెళ్లే దారిలో ఎదురయ్యే ఇబ్బందులు, దారి పొడవునా పొంచి ఉండే ప్రమాదాలు ఇవన్నీ ప్రతీ భక్తుడికి ఒక పరీక్షలాంటివే.
ఇవన్నీ భరించి బద్రినాథుడిని దర్శించుకున్న క్షణం…
దేవుడి శ్వాస మన మనసును తాకుతుంది అనిపిస్తుంది.
Watch : బద్రినాథుడి ఆలయాన్ని మీరు కూడా దర్శించుకోండి
“ఇది కేవలం ఒక గుడి మాత్రమే కాదు…
ఆది శంకరుడు పునరుద్ధరించిన మోక్షద్వారం.
అందుకే కొంత మంది భక్తులు
శ్రీరంగం ఆరంభం అయితే తిరుమల ఒక మార్గం అని బద్రినాథ్ గమ్యం అని చెబుతారు.
ప్రయాణికుడిని ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవడం మర్చిపోకండి
రెండు నదుల మధ్య ఉన్న ద్వీపంలో…
“కావేరీ, కొల్లిడం అనే రెండు నదుల మధ్య ఉన్న చిన్న ద్వీపంలో వెలసిన ఆధ్యాత్మిక ప్రపంచమే శ్రీరంగం.”
మొత్తం 21 గోపురాలు ఉన్న ఈ ఆలయానిది వేల సంవత్సరాల ఘనమైన చరిత్ర.
63 హెక్టార్ల విస్తీర్ణం ఉన్న శ్రీరంగం ఆలయం…
ప్రపంచంలోనే పెద్ద యాక్టివ్ టెంపుల్.
“మీకు ఒక సందేహం కలగవచ్చు …ప్రపంచంలో అతి పెద్ద ఆలయం అనేది ఆంగ్కోర్ వాట్ కదా అని…మీరు అనుకున్నది కూడా కరెక్టే. ఈ ఆలయం కంబోడియాలో (Cambodia) ఉంది.కానీ ఆంగ్కోర్ వాట్ ఆలయంలో (Angkor wat) అక్కడ నిత్య పూజలు జరగవు.

శ్రీరంగంలో మాత్రం…వేల సంవత్సరాలుగా స్వామి వారికి నిత్య పూజలు జరుగుతున్నాయి.”
ఆసక్తికరమైన విషయాలు | Interesting Facts
- యూనెస్కో ప్రపంచ వారసత్వ సంపద చోటు సంపాదించుకున్న శ్రీరంగం
- ఆలయ ప్రాంగణంలో 156 వైష్ణవ మందిరాలు లేదా ఉపాలయాాలు ఉన్నాయట
అందుకే దీనిని సాధారణ దేవాలయంగా కాకుండా ఒక దైవిక నగరంగా పిలుస్తారు.
శ్రీరంగం స్థల పురాణం | History and Story of Srirangam
“పురాణాల ప్రకారం ఈ ఆలయంలోని శ్రీరంగ విమానం (Srirangam Viamanam) రామాయణం కాలం కన్నా ముందుదని అంటారు…”
త్రేతాయుగంలో బ్రహ్మ నుంచి ఇక్ష్వాక రాజవంశీయులకు చేరి…
తరువాత శ్రీరాముడు (Lord Rama) తన పట్టాభిషేకం అనంతరం ఈ విమానాన్ని…
విభీషణుడికి ఇచ్చాడు.

“శ్రీరంగ విమానంతో లంకకు (Sri Lanka) వెళ్తున్న విభీషణుడు…
కావేరీ నదీ ఒడ్డున పూజ కోసం ఆగాడు.
విగ్రహాన్ని నేలపై ఉంచిన క్షణం…
అది భూమిలో స్థిరమైపోయింది.”
దానిని కదిలించే ప్రయత్నం విభీషణుడు ( Vibhishan) చేస్తుండగానే శ్రీరంగనాథుడు (Sri Ranganatha Swamy ) ప్రత్యక్షమై…
“ఇది నా స్థలం…ఇక నుంచి నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడి నుంచి లంకను రక్షిస్తాను అని అన్నాడట.
ఇప్పటికీ విభీషణుడు రాత్రి సమయంలో శ్రీరంగంలో రంగనాథుడికి పూజలు చేస్తాడని కొంత మంది స్థానికులు చెబుతుంటారు.
వేల ఏళ్ల చరిత్ర | The Legend of Srirangam Temple
5000 ఏళ్ల చరిత్ర కలిగి ఉన్న ఈ దేవాలయం…
చోళులు, పాండ్యులు, హోయసల, విజయనగర, నాయక్ రాజుల కాలంలో అభివృద్ధి చెందింది.”
14వ శతాబ్దంలో ముస్లిం పాలకుల దాడుల్లో ఆలయానికి నష్టం జరగగా… తరువాత 15వ శతాబ్దంలో పునర్మించారట. ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం అదేనంటారు.
నిర్మాణం వైశిష్టత | Architecture & Layout
“శ్రీరంగంలో ప్రతీ రోజు నిత్య పూజలు, ఏడాది పొడవునా ఉత్సవాలు జరుగుతాయి.

ఈ ఆలయంలో
ప్రతి గోపురం ఓ గ్రంథంలా ..
ప్రతి రాతి శిల్పం ఒక కథనంగా..
వినేవారుంటే శ్రీరంగంలోని గాలి, గోడలు, గుడి గంటలు ఎన్నో విషయాలు చెప్పకనే చెబుతాయి.
‘ఇక్కడ దేవుడు ఉన్నాడు.
కనులతో కాకుండా, హృదయంతో చూడాలి.’”
శ్రీరంగంకు దగ్గర్లోనే శివ భక్తులకు అత్యంత ఇష్టమైన ఆలయాలలో ఒకటైన జంబుకేశ్వర ఆలయం (Arulmigu Sri Jambukeswarar Temple, Trichy)(ఉంది…
ఇది ఐదు పంచభూతాల మందిరాల్లో ఒకటి…
ఇక్కడ భక్తులు జలలింగాన్ని (Jala Lingam) దర్శించుకుని తరిస్తారు. ఈ ఆలయంపై కూడా స్టోరీ చేశాను. తప్పకుండా చూడండి. వీడియో కూడా మీ కోసం అటాచ్ చేస్తున్నాను.
దర్శనం సమయం, సూచనలు | Darshan Tips and Timings
“ఆలయంలోపల…
ఐదు పడగల అదిశేషుడి మహతల్పంపై సేదదీరుతూ ఉన్న శ్రీపతిని దర్శించొచ్చు.”
“దర్శనం విషయానికి వస్తే…
కాస్త సమయం పడుతుంది.
కానీ…
ఆ వెయింటింగ్ కూడా ఒక స్పిరిచువల్ ఎక్స్పీరియెన్సే కదా. మీరు ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలి అనుకుంటే సాధారణ రోజుల్లో ఉదయం 6 నుంచి 8 మధ్యో సాయత్రం 7 తరువాత దర్శనం కోసం ప్రయత్నించండి. రద్దీ తక్కువగా ఉంటుంది.
ఇక్కడ వారాంతాల్లో, ఏకాదశి, కొన్ని ప్రత్యేక పర్వదినాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది.
ప్రసాదం కాదు అమృతం | Prasadam & Market
శ్రీరంగం ఆలయంలో ప్రసాదం అనేది దేవుడి ఆశీర్వాదమే అని చెప్పవచ్చు. దర్శనం తరువాత మండపాల్లో లభించే ప్రసాదం మనసును, కడుపునూ రెండింటినీ నింపుతుంది.
ఆలయం నుంచి బయటికి రాగానే బాగా హడావిడిగా సందడిగా ఉన్న మార్కెట్ కనిపిస్తుంది. ఇక్కడ కాసేపు విండో షాపింగ్ చేసుకోవచ్చు. ఏమైనా కావాలనిపిస్తే కొనేసి ప్రశాతంగా ఆలయ వీధుల్లో సంచరించవచ్చు. దైవిక నగరంలో ఎంత సమయం వెచ్చిస్తే అంత ప్రశాంతత లభిస్తుంది అని నాకు అర్థం అయింది. మీక్కూడా అదే ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది.
ఎలా చేరుకోవాలి ? | HOW TO REACH & STAY

శ్రీరంగానికి వెళ్లడం చాలా సులభం. (Trains To Srirangam ) మీరు రైలులో వస్తే త్రిచీ రైల్వే స్టేషన్ నుంచి ఆలయం కేవలం… 10 నిమిషాల దూరంలోనే ఉంటుంది.
ఫ్లైట్‌లో రావాలనుకుంటే (Flights To Srirangam)
Trichy Airport నుంచి —
25 నుంచి 30 నిమిషాల్లో శ్రీరంగానికి చేరుకోవచ్చు.
రోడ్డు ప్రయాణం అయితే…(Srirangam by Road)
చెన్నై, మదురై, పుదుచ్చేరి దిశ నుంచి
బస్సులు చాలా రెగ్యులర్‌గా వస్తుంటాయి.
ఎక్కడ ఉండాలి | Places To Stay In Srigangam)
మీరు ఆలయం దగ్గర్లోనే ఎన్నో హోటల్స్ అందుబాటులో ఉంటాయి. కొన్ని హోటల్స్ బాల్కనీలోంచి ఆలయ గోపురాలు కూడా కనిపిస్తాయి. రూ.800 నుంచి రూ.5000 వేలు అంతకు మీ బడ్జెట్ అండ్ ప్లానింగ్‌ను బట్టి హోటల్స్ ఎంచుకోవచ్చు.
ఎప్పుడు వెళ్తే బెస్ట్ | Best Time & Devotional Significance
“శ్రీరంగం ఆలయానికి వెళ్లాలి అనుకుంటే మీరు డిసెంబర్ నెలలో అంటే — వైకుంఠ ఏకాదశి (Vaikunta Ekadasi In Srirangam) సమయంలో వెళ్లండి. ఇది కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు…పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక అనుభవం కూడా. ఇది నేను అనే మాట కాదు..మీరు కూడా అదే అంటారు.
తమిళనాడు ఆలయాల రూట్ మ్యాప్ | Travel Circuit Suggestion
మీరు తమిళనాడు ఆలయాలు దర్శించుకుంటే…
ఈ రూట్ follow చేయండి —
మదురై → పలని → తంజావూరు → జంబుకేశ్వర → శ్రీరంగం → తిరువణ్నామలై → తిరుమల”
“ఈ ఆలయాలన్నీ మనశ్శాంతి వైపు నడిపించే మార్గాలు.”
నేను కూడా ఇదే రూట్ ప్లాన్ ఫాలో చేసి పైన ఉన్న ఆలయాలను దర్శించుకున్నాను. వాటికి సంబంధించిన అన్ని వీడియోల ప్రయాణికుడు ఛానెల్లో పోస్ట్ చేశాను. తమిళనాడు ప్లే లిస్టును కూడా మీరు చెక్ చేయవచ్చు. దయచేసి ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి.
శ్రీరంగం ఎందుకంత ప్రత్యేకం అంటే | What Makes Srirangam Special
“శ్రీరంగం వస్తే…
మనలోని ప్రశ్నలకు సమాధానం లభిస్తుందంటారు.
ఇక్కడ నుంచి వెళ్లాక…
ప్రశ్నలు ఉండవు.”
“ఇక్కడికి…
దేవుడిని వరాలు అడగడానికి కాదు.
మనలోని బాధలను దేవుడి పాదాల వద్ద వదిలి…
ప్రశాంతంగా తిరిగి వెళ్లడానికే.”
“ఎందుకంటే…
కొన్ని ప్రదేశాలు…
మనము ఎమీ కోరకపోయినా…
మనకు కావలసినదాన్ని ఇస్తాయి.” శ్రీరంగం కూడా అందులో ఒకటి.
“జీవితమే ఒక ప్రయాణం అయితే…
ఈ ప్రయాణికుడికి ప్రయాణాలే జీవితం.”
ఈ పోస్టు నచ్చిత సాటి భక్తులకు, ప్రయాణికులకు షేర్ చేయండి.“ అలాగే Next — నేను ఏ దేవాలయానికి వెళ్లాలో కూడా
కింద కామెంట్ చేయండి.
మరిన్ని వివరాల కోసం ఆలయ అధికారిక వెబ్సైట్ విజిట్ చేయండి
Watch : శ్రీరంగం ఆలయంపై నేను చేసిన స్టోరీ ప్రయాణికుడు యూట్యూబ్ ఛానెల్లో చూడండి
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
