Summer Ooty : చిత్తూరులోని సమ్మర్ ఊటీ.. హార్స్లీ హిల్స్‌కు వెళ్తే ప్రకృతి అందాలు మీ మనసును దోచేస్తాయి
Summer Ooty :చిత్తూరు జిల్లా (Chittoor district) ఆలయాలకు మాత్రమే కాకుండా, అనేక ఇతర పర్యాటక ప్రదేశాలకు (Tourist destinations) కూడా నిలయం. ఎత్తైన కొండలు ఉన్న ప్రాంతం చిత్తూరు జిల్లా. ఇక్కడ కనువిందు చేసే అనేక జలపాతాలు (Waterfalls) ఉన్నాయి. మదనపల్లె (Madanapalle) దగ్గర సమ్మర్ ఊటీ(Summer Ooty) అని పిలవబడే ఓ అందమైన ప్రదేశం ఉందని చాలా మందికి తెలియదు. బ్రిటిష్ కలెక్టర్లు కూడా వేసవిలో ఇక్కడ విశ్రాంతి తీసుకునేవారని చరిత్ర చెబుతోంది. ఆ ప్రాంతమే హార్స్లీ హిల్స్ (Horsley Hills). అసలు ఈ ప్రాంతానికి ఈ పేరు ఎలా వచ్చింది? ఇంతకుముందు ఈ ప్రాంతం పేరు ఏమిటో చూద్దాం.
హార్స్లీ హిల్స్ పూర్వ చరిత్ర
బ్రిటిష్ పాలనకు ముందు మల్లమ్మ (Mallamma) అనే ఒక భక్తురాలు ఈ కొండపై క్రమం తప్పకుండా తపస్సు చేసేవారట. ఈ అడవిలో మల్లమ్మ తపస్సు చేస్తున్నప్పుడు ఒక ఏనుగు (Elephant) కూడా ఆమెకు సహాయం చేసిందని చెబుతారు. ఆ ఏనుగు మల్లమ్మకు ఆహారంగా పండ్లు తెచ్చి, ఇతర అడవి జంతువుల నుండి ఆమెను రక్షించేదని ప్రతీతి. దీని కారణంగా ఈ ప్రాంతం ఏనుగు మల్లమ్మ కొండగా (Enugu Mallamma Konda) ప్రసిద్ధి చెందింది. ఈ కొండపై ఏనుగు మల్లమ్మ దేవాలయం(Enugu Mallamma Temple) కూడా ఉంది.

వృక్ష సంపద, మహావృక్ష పురస్కార్
ఒక ఎత్తైన కొండపై దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. 1859లో నాటిన నీలగిరి చెట్టు ఈ ప్రాంతంలో బాగా పెరిగి పర్యాటకులకు (Tourists) గొప్ప ఆకర్షణగా నిలుస్తోంది. మరో ప్రత్యేకత ఏమిటంటే, కేంద్ర అటవీ, పర్యావరణ విభాగాలుఈ చెట్టుకు 1995లో మహావృక్ష పురస్కార్ (Mahavriksha Puraskar) అవార్డును ప్రదానం చేశాయి. ఇది ఈ ప్రాంతం గొప్ప వృక్ష సంపదకు నిదర్శనం.
హార్స్లీ హిల్స్‌కు ఆ పేరు ఎలా వచ్చింది?
బ్రిటిష్ అధికారి డబ్ల్యూ.డి. హార్స్లీ (W.D. Horsley) మదనపల్లెకు సబ్-కలెక్టర్‌గా నియమితులయ్యారు. ఆయన సమీపంలోని ఒక ఎత్తైన కొండపై పిక్నిక్కు వెళ్లేవారు. అక్కడి పచ్చదనం, చల్లదనం ఆయనను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత, 1863 – 1867 మధ్య హార్స్లీ కడప జిల్లా (Kadapa District) అడ్మినిస్ట్రేటర్‌గా నియమితులయ్యారు.

ఇది కూడా చదవండి : ప్రపంచ యుద్ధం వస్తే ఈ 10 దేశాలు చాలా సేఫ్
హార్స్లీ నిర్మించిన వేసవి విడిది
1863లో, హార్స్లీ ఇక్కడ వేసవి విడిదిగా ఒక బంగ్లాను నిర్మించారు. అప్పటి నుండి, ఈ కొండ ప్రాంతం హార్స్లీ హిల్స్ గా ప్రసిద్ధి చెందింది. హార్స్లీ నిర్మించిన భవనాన్ని ఫారెస్ట్ బంగ్లా అని పిలుస్తారు. తర్వాత, ఇక్కడ మరో కార్యాలయం కూడా నిర్మించబడింది. నేటికీ ఆ భవనాలను పర్యాటకుల కోసం రిసార్ట్‌లుగా ఉపయోగిస్తున్నారు. ఇవి చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయి.
ప్రకృతి అందాల నిలయం హార్స్లీ హిల్స్
హార్స్లీ హిల్స్ ప్రకృతి అందాల నుండి పుట్టిన ఇల్లు లాంటిది. ఒక చిన్న జూలాజికల్ పార్క్, మొసళ్ళ పార్క్, అటవీ ప్రాంగణంలో ఫిష్ ఎగ్జిబిషన్ పర్యాటకులను ఆకర్షిస్తాయి. పిల్లలు ఆటలు ఆడుకోవడానికి ఏర్పాట్లు ఉన్నాయి. వేసవి రాత్రులలో గదిలో ఎయిర్ అవసరం ఉండదు. దానికంటే మెరుగైన సహజసిద్ధమైన ఏసీ మనకు లభిస్తుంది.
ఇది కూడా చదవండి : Bhutan : భూటాన్ ఎలా వెళ్లాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
స్వచ్ఛమైన గాలి, సందర్శకులు
చందనం చెట్లు (Sandalwood trees), శీకా చెట్లు, యూకలిప్టస్ చెట్ల గుండా వీచే స్వచ్ఛమైన గాలి లోతుగా ఊపిరి పీల్చుకోవాలనిపిస్తుంది. అందుకే ఏడాది పొడవునా పర్యాటకులు హార్స్లీ హిల్స్‌కు వస్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా తమిళనాడు (Tamil Nadu), కర్ణాటక (Karnataka) నుండి కూడా పర్యాటకులు ఇక్కడికి వచ్చి వేసవి వినోదాన్ని ఆస్వాదిస్తారు.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
