అపర కైలాసం, కొరిన వారి కొంగుబంగారం ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం (Indrakeeladri). ఈ ఆలయానికి వేసవి కాలంలో దర్శనానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి కే రామచంద్ర మోహన్ తెలిపారు.
ముఖ్యాంశాలు
అపర కైలాసం, కొరిన వారి కొంగుబంగారం ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ( Sri Durga Malleswara Swamy Temple). మహిమాన్వితమైన ఈ ఆలయానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వస్తుంటారు. ఇలా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించే విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకుంటోందిది దేవస్థానం.
అందులో భాగంగానే తాజాగా వేసవి కాలంలో దర్శనానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి కే రామచంద్ర మోహన్ తెలిపారు.
- ఇది కూడా చదవండి : ఇక్కడ మారేడు దళం నీటిలో వేస్తే , కాశి గంగలో తేలుతుందంట | Kadali Kapoteswara Swamy Temple
ఆ ప్రత్యేక ఏర్పాట్ల వివరాలు ఇవే | Indrakeeladri

Summer Arrangements At Indrakeeladri : ఎండాకాలం భక్తులకు ఇబ్బంది కలకుండా ఉండే విధంగా రాజగోపురం ప్రాంగణం, ప్రాకార మండటం వంటి ప్రధాన ప్రాంతాలతో పాటు భక్తులు వేచి ఉండే ప్రదేశాల్లో చలువ పందిర్లు వేయిస్తున్నారు.
- భక్తులు నడిచే దారిలో వారికి ఎండ వల్ల ఇబ్బంది కలగకుండా ఉండేదుకు వైట్ కూలింగ్ పెయింట్ వేయిస్తున్నారు.
- వేసవి కాలంలో చల్లని నీరు అందించే విధంగా చలివేంద్రాలను ఇది వరకే ఏర్పాటు చేయించారు.
- దీంతో పాటు వేసవి తాపాన్ని తట్టుకునే శక్తిని ఇచ్చే మజ్జిగను కూడా ఉగాది (Ugadi 2025) నుంచి ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు తెలిపారు ఆలయ అధికారులు.
చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు…

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి చైత్రమాస కళ్యాణ మహోత్సవాలకు (Indrakeeladri Brahmotsavalu) ఏర్పాటు వేగంగా జరుగుతున్నాయి. 2025 ఏప్రిల్ 8వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.
- ఈ బ్రహ్మోత్సవ సమయంలో అమ్మవారిని, స్వామివారి ఉత్సవ మూర్తులను రోజుకో వాహనంపై నగరోత్సవం నిర్వహించనున్నారు.
- 2025 ఏప్రిల్ 11వ తేదీన జరిగే కళ్యాణం రోజున రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ప్రముఖ కవులతో “రాయబారం” నిర్వహించనున్నారు.
- ఏప్రిల్ 14 నుంచి 16 వ తేదీ వరకు ద్వాదశ ప్రదక్షిణలు, పవళింపు సేవలు వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఆర్జిత సేవలు | Indrakeeladri Arjitha Seva
- శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దివ్య లీలా కళ్యాణోత్సవంలో ఆర్జిత సేవలో పాల్గొనాలి అనుకునే భక్తులు (దంపతులు) రూ.1,116 ను చెల్లించి ఇందులో భాగం అవ్వవచ్చు.
- భక్తులకు శేష వస్త్రం, రవిత, అమ్మవారి శ్రీ చర్రపీఠం, ఒక లడ్డూ, దంపతులకు ముఖ మండప దర్శనం ( కళ్యాణానికి ముందు) చేేయిస్తారు.
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.