Swiss Alps Summer : ఎండాకాలం కూడా విరిసే మంచు పరిమళం
Swiss Alps Summer : ఎండాకాలంలో సూర్యుడి తేజస్సుతో పాటు ఎదురుగా కనిపించే పర్వతాల మీద మంచు ప్రకాశం కనిపిస్తే అదే Swiss Alps. సమ్మర్ యూరప్ అందాలను వీక్షించాలి అనుకునే వారికి ఈ ఆర్టికల్ ఒక బ్యూటిఫుల్ ఛాయిస్.
ఐరోపాలో ఉన్న Switzerland లో ఎండాకాలం కూడా తన మంచు ఆకర్షణతో పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఆకాశం నీలంగా, గడ్డి పర్వతాల మీద పచ్చగా, దూరంగా మంచుపై వెలిగే చంద్రప్రభలా కనిపిస్తుంది. ఎండలో కూడా చల్లని గాలి మనసును మేల్కొలుపుతుంది.
పర్వతాల మధ్య సూర్యోదయం | Sunrise in Swiss Alps
స్విస్ ఆల్ప్స్లో ప్రతీ సూర్యోదయం ఒక గీతంలా మొదలవుతుంది. చర్చి గంటలు దూరంగా వినిపిస్తాయి. పర్వతాల నుంచి దిగే సూర్యోదయం నీలి ఆకాశాన్ని మెల్లిగా బంగారు రంగులో మెరిపిస్తుంది. Zermatt లాంటి అందమైన గ్రామ వీధుల్లో నడుస్తుంటే, చుట్టూ వుడెన్ హౌసెస్, వరండాల్లో సందడి చేసే పువ్వులు, వెనకాలే Matterhorn లాంటి శిఖరం చూస్తుంటే జీవితం ఎంత అందమైనదో అనిపిస్తుంది.

సరోవరాల సౌందర్యం | Beautiful Lakes
స్విస్‌లో సరోవరాలు ఎండాకాలంలో ప్రత్యేక సౌందర్యాన్ని పొందుతాయి. Lake Geneva తీరం దగ్గర మధ్యాహ్నం నిశ్శబ్దంగా ఉంటుంది. నీళ్లు నీలం రంగులో మెరుస్తూ, పర్వతాల ప్రతిబింబాలను తమలో కలిపేసుకుంటాయి. Interlaken అనే ప్రదేశంలో రెండు సరోవరాల మధ్య నిలిచిన ఊరు, గడ్డి మీద కూర్చొని ఆకాశాన్ని చూస్తూ సమయాన్ని గడపాలని అనిపిస్తుంది.
- ఇది కూడా చదవండి : Peaceful Countries: ప్రపంచంలోని టాప్ 10 శాంతియుత దేశాలు
సందర్శనీయ స్థలాలు | Top Visiting Places
ఈ ప్రాంతంలో జెర్మాట్ నుంచి మేటర్‌హార్న్ దర్శనం అనేది ఒక నిశ్చలమైన క్షణంలా అనిపిస్తుంది. ఇంటర్లేకన్లో సరోవరాల మధ్య సాయంత్రం గడపడం ఒక అందమైన పెయింటింగ్‌లో మనం భాగమైన అనుభూతిని ఇస్తుంది. అలాగే Jungfrau ఉండే ప్రదేశంలో మంచు రేఖలు ఎండాకాలంలో కూడా తెలుపు వర్ణంతో జిగేలుమనిపిస్తాయి.
Lucerne వీధిలో Kapellbrücke బ్రిడ్జిపై నడిచే సమయంలో ప్రాచీన కథల్లో కథానాయకులమయ్యాం అనిపిస్తుంది. లేక్ జెనీవా తీరంలో సాయంత్రం ఆకాశం నీలం నుంచి గులాబీ రంగులోకి మారడం ఒక లైఫ్‌టైమ్ మెమరీగా నిలుస్తుంది.
ఎలా వెళ్లాలి? | How To Reach
హైదరాబాద్ నుంచి Zurich వరకు విమాన ప్రయాణం చేసి యూరోప్ హృదయం లాంటి స్విట్జర్లాండ్ చేరుకోవచ్చు. జూరిచ్ నుంచి రైలులో ప్రయాణిస్తూ పర్వతాల అందాలను వీక్షించవచ్చు. ఈ యాత్రలో కనిపించే సీనరీలు యూరోప్ అంటే ఏంటో చూపిస్తాయి.
- ఇది కూడా చదవండి : Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
ఎక్కడ ఉండాలి? | Accommodation
స్విస్ గ్రామాల్లో వుడెన్ చాలెట్స్‌లో బస చేయడం ఒక ప్రత్యేక అనుభవం. బాల్కనీ నుంచి కనిపించే పర్వత శ్రేణులను చూస్తూ ప్రతీ ఉదయాన్ని ఆస్వాదించవచ్చు. చిన్న గెస్ట్ హౌజుల్లో కూడా ఆత్మీయ అనుభవాన్ని పొందవచ్చు.

ఏం చూడాలి? | Places to Visit
పర్వతాల వద్ద నడిచే వాక్స్, సరస్సుల తీరంలో నిశ్శబ్దంగా కూర్చొని పుస్తకాలు చదవడం, కేబుల్ కార్లలో శిఖరాగ్రానికి చేరడం… ఇలా అనేక మరుపురాని ప్రదేశాలను చూస్తూ జీవితాంతం గుర్తుండే మెమోరీస్ సృష్టించుకోవచ్చు.
ఏం తినాలి? | Food To Eat
స్విస్‌లో బ్రెడ్, చీజ్ పరిమళం, చాక్లెట్ మధురిమలు చల్లని గాలిలో మరింత రుచిగా అనిపిస్తాయి. చిన్న కేఫేలో కాఫీ సిప్ చేస్తూ బయట మంచు శిఖరాలను చూడడం — ఇవన్నీ ఎంజాయ్ చేయడానికి ఫుడ్ లవర్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ నేచర్‌ను ఆస్వాదించే మనసు ఉంటే చాలు.
చేయాల్సిన పనులు | 5 Things To Do
సూర్యోదయం సమయంలో మార్నింగ్ వాక్ చేయడం, సరస్సుల తీరంలో నడుస్తూ సాయంత్రాన్ని ఎంజాయ్ చేయడం, కేబుల్ కార్లో ప్రయాణించడం, స్థానిక గ్రామాల్లో నిశ్శబ్దంగా సంచరించడం, అక్కడి వెరైటీ ఫుడ్‌ను ఆస్వాదించడం — ఇలా మీరు ఎన్నో యాక్టివిటీస్ ప్లాన్ చేసుకోవచ్చు.
- ఇది కూడా చదవండి : Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు
మంచు మనసుకు
ఎండాకాలం అంటే వేడి అని మాత్రమే అనుకుంటాం. కానీ స్విస్ ఆల్ప్స్లో సమ్మర్ అంటే ఒక ఎవర్గ్రీన్ కూల్ మెమోరీని సొంతం చేసుకునే సమయం. ఇక్కడ సూర్యుడూ నేచర్‌ను ఎంజాయ్ చేస్తూ కూల్‌గా కనిపిస్తాడు. అందుకే యూరోప్ ఒక ఎవర్గ్రీన్ ట్రావెల్ డెస్టినేషన్‌గా నిలిచింది.
- MG Kishore
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
