Tawang Travel Guide : హిమాలయాల మధ్య ధ్యానం లాంటి ప్రదేశం తవాంగ్
Tawang Travel Guide : కొన్ని ప్రదేశాలు కనిపించి మాయం అవుతాయి. మరికొన్ని ప్రదేశాలు మనసులో నిలిచిపోతాయి. తవాంగ్ అలాంటి ప్రదేశమే. ఈ ఆర్టికల్‌లో తవాంగ్ విశేషాలు, ఎలా వెళ్లాలి ? ఎక్కడ ఉండాలి ? ఏం చేయాలి ? ఏం తినాలి, ట్రావెల్ టిప్స్ అందిస్తున్నారు ప్రయాణికుడు.
అరుణాచల్ ప్రదేశ్‌లో (Arunachal Pradesh) ఉన్న తవాంగ్ ఒక హిల్ స్టేషన్ కాదు. అది మనసుకు ప్రశాంతతను ఇచ్చే డెస్టినేషన్. పర్వతాల మధ్యలో, మేఘాల నడుమ, బౌద్ధ మత సారాన్ని గ్రహిస్తూ సాగే జర్నీ అది.
పర్వతాల మధ్య జీవన ధార | Life in Tawang

తవాంగ్‌లో పొద్దున్నే లైట్ చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. మేఘాలు పర్వతాల మధ్య మెల్లిగా కదులుతూ, భూమిని తాకుతున్నట్టుగా అనిపిస్తాయి. గాలులు నిశ్శబ్దంగా వీస్తూ ప్రయాణికులను టచ్ చేస్తాయి. ఇక్కడి వాతావరణంలో సాధారణంగా ఊపిరి తీసుకోవడం కూడా ఒక ధ్యానంలా అనిపిస్తుంది.
ఇక్కడి నేచర్ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ మాత్రమే కాదు… అదే మెయిన్ ఫ్రేమ్.
అతిపెద్ద మోనాస్టరీ | Biggest Monastery India
భారతదేశంలోనే అతిపెద్ద మోనాస్టరీ తవాంగ్‌లోనే (Video : Tawang Monastery) ఉంది. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మోనాస్టరీ కూడా ఇదే.

ఈ మోనాస్టరీలో ఉదయం, సాయంత్రం బౌద్ధ సన్యాసుల ప్రార్థనలు, యాక్ నెయ్యితో వెలిగే దీపాలు, సన్యాసులు నడిచే మార్గాలు, మోనాస్టరీ లోపల చిత్రకళలు… ఇవన్నీ మనల్ని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తాయి.

మహిళా సన్యాసుల మఠాలు
తవాంగ్‌లో కొన్ని బౌద్ధ మఠాలను కేవలం మహిళా సన్యాసులు మాత్రమే నిర్వహిస్తారు. దలైలామా పుట్టినరోజు సందర్భంగా నేను తవాంగ్ వెళ్లాను. ఒక మహిళా మఠానికి వెళ్లినప్పుడు, అక్కడ వారు ఇచ్చిన యాక్ మిల్క్‌తో చేసిన టీని తాగాను.

- Video : దలైలామా పుట్టిన రోజు ఎలా చేసుకుంటారో చూడం
- బయటి ప్రపంచం నుంచి దూరంగా ఉన్నా… నాలాంటి ప్రయాణికులు వచ్చినప్పుడు నిష్కల్మషమైన చిరునవ్వుతో పలకరించే విధానం ఇంకెక్కడా కనిపించదు.

సందర్శనీయ స్థలాలు | Places To Visit In Tawang
తవాంగ్‌లో అన్ని దిశల్లో సందర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. తవాంగ్ మోనాస్టరీ నుంచి అన్నీస్ నన్నరీ అనే మహిళల మఠం, లోకల్ మార్కెట్లు, ఇక్కడి చిన్న చిన్న కేఫ్‌లు, విండ్ హార్స్ అని పిలిచే రంగురంగుల పతాకాలు— ఇవన్నీ ఎవర్గ్రీన్ మెమరీలుగా మిగిలిపోతాయి.

ఇక టౌన్ నుంచి బయటికి వస్తే మాధురీ లేక్ చుట్టూ ఉన్న ప్రశాంతత, భారత్–చైనా బార్డర్ వద్ద ఉన్న బూమ్లా పాస్ ప్రయాణం, మధ్య మధ్యలో కనిపించే ఎన్నో లేక్స్— ఇవన్నీ మర్చిపోవడం దాదాపు అసాధ్యం.
- చైనా బార్డర్ ఉన్న బూమ్లా పాస్ (Video : Bumla Pass) వెళ్లాలంటే మీకు ఇన్నర్ లైన్ పర్మిట్‌తో పాటు…
- లోకల్ అధికారుల నుంచి అనుమతి కూడా అవసరం అవుతుంది.
- మీరు ఇక్కడ బైక్ రెంట్‌కు తీసుకుని కూడా ప్రయాణించవచ్చు.
- ఆర్మీ క్యాంపుల వద్ద ఫోటోగ్రఫీ చేయడం నిషేధం అని గుర్తుంచుకోండి.
ఎలా వెళ్లాలి? | How To Reach Tawang
తవాంగ్‌కు వెళ్లే మార్గం కూడా తవాంగ్ ఎక్స్‌పీరియెన్స్‌లో భాగమే. గమ్యం కన్నా ప్రయాణాన్ని ఎంజాయ్ చేయాలని నేర్పే జర్నీ ఇది.
గౌహతి నుంచి తవాంగ్ వెళ్లే దారిలో పర్వతాల మధ్య మెలికలు తిరిగే రహదారులు, మధ్యలో చేతికి అందేంత దూరంలో ఉన్న మేఘాలు, బ్రహ్మపుత్ర లోయ, దిరాంగ్ వ్యాలీ, వాటిని తడిపేస్తూ ముందుకు వెళ్తున్న బ్రహ్మపుత్ర నది ఇవన్నీ మనసును దోచేస్తాయి.

నేను అసోంలోని గౌహతి నుంచి తవాంగ్ వెళ్లాను. మీరు ఎలా ప్లాన్ చేస్తున్నారో కామెంట్ చేయండి.
ఎక్కడ ఉండాలి? | Stay Options
తవాంగ్‌లో హోమ్‌స్టేలు, లోకల్ హౌసులు, మోనాస్టరీ చుట్టూ ఉన్న చిన్న చిన్న లాడ్జీలు— అన్నీ కూడా ఈ టౌన్ థీమ్‌లో పర్యాటకులకు స్వాగతం పలుకుతాయి.
హిల్ వ్యూ ఉన్న రూమ్‌లోంచి ఉదయం సూర్యోదయం చూసిన తరువాత అరుణాచల్ ప్రదేశ్‌ను “The Land of the Rising Son (india)” అని ఎందుకు అంటారో అర్థం అవుతుంది. ఎందుకంటే భానుడి తొలికిరణం ఇక్కడే పడుతుంది.
ఏం తినాలి? | Food In Tawang
అరుణాచల్ ప్రదేశ్‌లో ఎంటర్ అయినప్పటి నుంచి మెనూలో మార్పు కనిపిస్తుంది. ఇక్కడ తూపా (Thukpa), చౌమీన్, మోమోస్, అపాంగ్ (Apong), చూరా సబ్జీతో పాటు అనేక రకాల కొత్త రుచులను ఆస్వాదించవచ్చు.
- నేను నా హోమ్‌స్టే వారికే ఉదయం బ్రేక్‌ఫాస్ట్, రాత్రి డిన్నర్ ఏర్పాటు చేయమని చెప్పాను.
- దాంతో మధ్యాహ్నం సమయంలోనే ఫుడ్ ఎక్స్పెరిమెంట్స్ చేయగలిగాను.
- మీరు డ్రాగన్ రెస్టారెంట్లో (Dragon Restaurant Tawant) ఫుడ్ ట్రై చేయొచ్చు.
- ఇక్కడ అన్ని రకాల నార్త్ ఈస్ట్ వెరైటీలు లభిస్తాయి.
ఇక్కడ ప్రతి ఇంటి ముందు టన్నుల కొద్దీ బంగాళాదుంపలు కనిపిస్తాయి. వాటిని కూరల్లో వినియోగించడంతో పాటు జస్ట్ ఉడకబెట్టి ఉప్పు, మసాలా వేసుకుని తినేస్తారు. ఈ అలవాటు నాకు కాస్త కొత్తగా అనిపించింది.
ఇక్కడ చేయాల్సిన 5 పనులు | Activities in Tawang
తవాంగ్‌కు బయల్దేరినప్పుడు మీకు ఊపిరి పీల్చుకోవడంలో కాస్త ఇబ్బంది అనిపిస్తే… సేలా పాస్ వచ్చిందని అర్థం.
- ఇక్కడ ప్రాణవాయువు కొరత ఉంటే జీవితం ఎలా ఉంటుందో ఎక్స్‌పీరియెన్స్ చేయొచ్చు. నేను ఇక్కడ లైటర్ వెలిగించే ప్రయత్నం చేశాను. కానీ అది వెలగలేదు. ఎందుకంటే అగ్గిపుల్ల వెలగాలంటే ఆక్సిజన్ కావాలి.
అది మీరు ఈ వీడియోలో చూడొచ్చు…ప్రయాణికుడు బ్రాండ్‌లో మొట్టమొదటి వీడియో కూడా ఇదే …
2. తవాంగ్‌లో వార్ మెమోరియల్, పీ.టి.సో లేక్, ఉర్గేలింగ్ మోనాస్టరీ విజిట్ చేయండి.
3. తవాంగ్ వెళ్లే దారిలో మీకు ఎన్నో యాక్స్ కనిపిస్తాయి. వాటిని ఫోటోలు తీయవచ్చు.

4. ఇక్కడ అతిపెద్ద బుద్ధుడి విగ్రహం ఉంటుంది. అక్కడికి వెళ్తే శిలాపలకలపై ఉన్న చక్కని సూక్తులు చదవండి. విగ్రహం పక్కనే ఒక మహిళ ఉచిత భోజనం అందిస్తుంది. కావాలంటే ట్రై చేసి, డొనేషన్ చేయాలనుకుంటే చేయొచ్చు.
ఈ వీడియోలో ఆ విగ్రహాన్ని చూడొచ్చు.

- 5. బౌద్ధమతంలో కీలక ప్రదేశం కాబట్టి ఇక్కడ జీవహింసకు తావు ఉండదు. కాబట్టి మీరు చీకటి పడ్డాక బయటికి వెళ్తే ఒక డజను కుక్కలు కనిపిస్తే షాక్ అవ్వకండి. అలాగని ఈ కొండ కుక్కలను తేలికగా తీసుకోకండి. ఏం చేయాలన్నా… చీకటి పడేలోపే చేయండి.
- 6. BRO (బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్) రాసే కొటేషన్లు దారి పొడవునా చాలా కనిపిస్తాయి. ప్రతి కొటేషన్ ఒక ఆణిముత్యమే.
- 7. తవాంగ్ మోనాస్టరీలో మీరు బౌద్ధ సన్యాసులను జీవితం గురించి ఏమైనా ప్రశ్నలు అడగాలనుకుంటే అడగొచ్చు.
నేను బౌద్ధ సన్యాసితో ఏం మాట్లాడానో ఈ వీడియోలో చూడండి.
ఎప్పుడు వెళ్లాలి?
పర్యటనకు సరైన సమయం తవాంగ్ సీజన్‌ను బట్టి మారుతుంది. మంచు చూడాలనుకుంటే చలికాలంలో వెళ్లొచ్చు. తవాంగ్‌ను ప్రశాంతంగా చూడాలంటే చలికాలానికి ముందు వెళ్లడం మంచిది. అయితే వర్షాకాలం ప్లాన్ చేయకండి.

తవాంగ్ నుంచి బయటికి వస్తుంటే సన్నని ధారలుగా మొదలై ఉగ్రరూపం దాల్చిన బ్రహ్మపుత్ర నదిని చూస్తూ ప్రయాణించవచ్చు. మధ్యలో బోమ్డిలా అనే ప్రదేశాన్ని ఒకటి రెండు రోజులు ప్లాన్ చేయొచ్చు.
మొత్తానికి నార్త్ ఈస్ట్ ఎంత అందంగా ఉంటుందో కళ్లతో చూస్తేనే తెలుస్తుంది. ఒక్కసారి వెళ్తే ఈ ప్రయాణం మైండ్‌లో స్టోర్ అయి, గుండెలో రిపీట్ మోడ్‌లో ప్లే అవుతూనే ఉంటుంది.
— ఎం.జి. కిశోర్, www.Prayanikudu.com
తవాంగ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, గౌహతిపై Prayanikudu యూట్యూబ్‌లో వ్లాగ్స్ చేశారు ప్రయాణికుడు. అవి మీరు ఇక్కడ లింక్ క్లిక్ చేసి చూడవచ్చు.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
