థాయ్‌లాండ్‌లో నా అన్వేషణ అన్వేష్ ఆటగాళ్ల సంబరాలు | Naa Anveshana In Thailand

షేర్ చేయండి

నాా అన్వేషణ అన్వేష్ ( Naa Anveshana ) థాయ్‌లాండ్‌లో ఉన్న తెలుగు వారు, వ్లాగర్స్, అక్కడి పర్యాటకులతో కలిసి కాసేపు మాట్లాడాడు. అయితే ఈ సారి దీన్ని ఆటగాళ్ల థీమ్‌తో నడిపించాడు అన్వేష్

నా అన్వేషణ అన్వేష్ థాయ్‌లాండ్‌లో ఆటగాళ్ల సంబరాలు నిర్వహించాడు. ఇలాంటిదే ఒకటి 2023 లో కూడా నిర్వహించాడు. సంబరాలు అంటే సంబరాలు కూడా కాదు. ఒక మీటప్. థాయ్‌లాండ్‌లో ఉన్న తెలుగు వారు, తెలుగు ట్రావెల్ వ్లాగర్లు ( Telugu Travel Vloggers ) అక్కడి పర్యాటకులతో కలిసి అన్వేష్ కాసేపు మాట్లాడాడు. అయితే ఈ సారి దీన్ని ఆటగాళ్ల థీమ్‌తో నడిపించాడు అన్వేష్. ఇందులో చాలా మంది తెలుగు వ్లాగర్లు అన్వేష్‌తో కలిసి సందడి చేశారు.

Prayanikudu WhatsApp2
| ప్రతిరోజు వాట్స్ అప్ ద్వారా ట్రావెల్ కంటెంట్ తెలుగులో పొందాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి
ఆటగాళ్లు అర్థం.. అపార్థం… | Meaning Of Atagaallu / Aatagaallu

ఆటగాళ్లు అనే పదం ఇంగ్లీష్‌లో స్పోర్ట్స్‌‌మెన్ అంటే క్రీడాకారుడు అనే పదానికి దగ్గరిగా ఉంటుంది. దీన్ని డబుల్ మీనింగ్‌లో కొంత మంది క్లోజ్డ్ సర్కిల్లో మాట్లాడుకునే వారు. కానీ ప్లే బాయ్ అనే వర్షన్‌లో అన్వేష్ ఈ పదాన్ని పాపులర్ చేశాడు. ఆటగాళ్లు, ఆటగాడు ఇలా తన ఊత పదంగా మార్చుకున్నాడు అన్వేష్. ఈ పదంతో, అన్వేష్‌తో చాలా మంది కనెక్ట్ అయ్యారు.

కీరాదోస క్విజ్ | Naa Anveshana Quiz

Naa Anveshana Met Fans In Thailand
కీరా ఖ్విజ్ | Photo Source : Naa Anveshana YouTube

థాయ్‌లాండ్‌లో ( Thailand ) తెలుగు యూత్‌ను కలిసిన అన్వేష్ ముందు వారికి ఒక ఖీరా దోస ఇచ్చి ఇదేంటి అని అడగడం మొదలు పెట్టాడు. చాలా మంది ఖీరా వల్ల ఉన్న ఉపయోగాలు చేప్పారు. తరువాత పెద్దలు మాత్రమే చూడగలిగే కంటెంట్ మొదలవుతుంది. ఈ ఎపిసోడ్ పిల్లలతో కలిసి చూసేందుకు చాలా మంది ఇష్టపడకపోవచ్చు. కానీ ఈ ఆలోచనా విధానాన్ని మార్చడానికే ఈ ఎపిసోడ్ చేశాడేమో. మీరేం అంటారు ?

పెళ్లి గురించి | Naa Anveshana About Marriage

Naa Anveshana Met Fans In Thailand
పెళ్లి గురించి అభిప్రాయం కోరిన అన్వేష్ | Photo Source : Naa Anveshana YouTube

వీడియోలో తన పెళ్లి గురించి కూడా ప్రస్తావించాడు అన్వేష్. తను పెళ్లి చేసుకోవాలో లేదో అక్కడ ఉన్న వారి అభిప్రాయం కోరాడు. ఇందులో కొంతమంది చేసుకోమన్నారు.

Naa Anveshana Met Fans In Thailand 4
పెళ్లి గురించి భిన్నాభిప్రాయాలు | Photo Source : Naa Anveshana YouTube

మరికొంత మంది వద్దు అన్నారు. కానీ అన్వేష్ మాత్రం పెళ్లి అనేది చాలా అవసరం అని, తను త్వరలో చేసుకుంటా అన్నాడు.

తల్లిదండ్రులను కలిసిన అన్వేష్ | Anvesh Met His Parents In Thailand

Naa Anveshana Met His Parents In Thailand Airport

సుమారు నాలుగేళ్ల నుంచి ప్రపంచ యాత్ర చేస్తున్న అన్వేష్ ఇటీవలే తన తల్లిదండ్రులను థాయ్‌లాండ్‌లో కలిశాడు. దానికి సంబంధించిన పలు పోస్టులు కూడా పెట్టాడు. ప్రపంచ యాత్ర ముగిసే వరకు భారత దేశం రాను అని ఫిక్స్ అయ్యాడేమో అన్వేష్…అందుకే అక్కడ కలిశాడు.

గమనిక: ఈ వెబ్‌సైట్లో ప్రకటనలు కూడా ఉంటాయి. ముఖ్యంగా గూగుల్ యాడ్స్ ద్వారా ఈ ప్రకటనలు మీకు కనిపిస్తాయి. ఈ ప్రకటనలే మాకు ఆధారం. ఇందులో కొన్ని ప్రకటనలపై మీరు క్లిక్ చేస్తే మాకు ఆదాయం వస్తుంది.

Watch More Vlogs On : Prayanikudu

ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

Most Popular Stories

ప్రపంచ యాత్ర గైడ్

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!