Tirumala Vaikunta Ekadasi 2025 : వైకుంఠ ఏకాదశిపై తితిదే కీలక నిర్ణయాలు..పూర్తి వివరాలు, షెడ్యూల్…
Tirumala, Tirupati, Andhra Pradesh : 2025 జనవరిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏర్పాట్లు, టికెట్లు, దర్శనాలపై తితిదే కీలక నిర్ణయాలు తీసుకుంది. పది రోజులు పాటు భక్తులు తిరుమలలో శ్రీవారిని దర్శంచుకుని వైకుంఠ ద్వార దర్శనం ( Tirumala Vaikunta Ekadashi 2025) కూడా చేస్తారు. సంక్రాంతి సీజన్ కూడా ఉండటంతో తిరుమలలో భక్తుల రద్దీ అనేది సాధారణంగా కన్నా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తోంది తితిదే.