శ్రీ పైడితల్లి అమ్మవారు..యుద్ధాలు వద్దు, శాంతే ముఖ్యం అన్న దేవత కథ | Sri Paidithalli Ammavaru
Sri Paidithalli Ammavaru : ఉత్తరాంధ్ర ప్రజలకు కొంగుబంగారంగా, విజయనగరం గ్రామదేవతగా పూజలందుకుంటుంది శ్రీ పైడితల్లి అమ్మవారు. ఆమె చరిత్ర కేవలం ఒక దేవత కథ మాత్రమే కాదు 1757 నాటి బొబ్బిలి యుద్ధంతో ముడిపడిన ఒక విషాద గాథ.
అమ్మవారు నిజానికి విజయనగరం (Vizianagaram) సంస్థానపు రాజు పూసపాటి పెద విజయరామరాజు చెల్లెలు. ఆమె అసలు పేరు పైడిమాంబ. రాజకుటుంబంలో పుట్టినా, పైడిమాంబ చిన్నప్పటి నుంచే తీవ్రమైన దుర్గాదేవి భక్తురాలు, ఆధ్యాత్మిక భావాలు ఎక్కువగా ఉండేవి. ఆమెకు యుద్ధాలంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు.
ముఖ్యాంశాలు
బొబ్బిలి యుద్ధం, అన్న మరణం | Sri Paidithalli Ammavaru
తన అన్న విజయరామరాజు, బొబ్బిలి రాజుపై (Bobbili Raju) యుద్ధానికి సిద్ధమవడం చూసి పైడిమాంబ ఎంతో బాధపడింది. ఈ యుద్ధాన్ని ఆపేందుకు ఆమె చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. 1757లో, ఫ్రెంచ్ జనరల్ బుస్సీ సహాయంతో విజయనగరం రాజు బొబ్బిలిపై యుద్ధం ప్రకటించారు.
- ఈ యుద్ధం తెలుగు చరిత్రలో (Telugu History) ఒక విషాద ఘట్టంగా మిగిలింది.
- యుద్ధం జరుగుతున్న సమయంలో, బొబ్బిలి కోట దాదాపు ధ్వంసమై, రాజు పెద విజయరామరాజు శత్రువుల చేతిలో మరణించిన వార్త పైడిమాంబకు (Paidimamba) తెలిసింది.
- ఇది కూడా చదవండి : Sabarimala Facts : శమరిమలై ఆలయం గురించి 10 ఆసక్తికరమైన విషయాలు

దైవంలో ఐక్యం, అంతిమ సందేశం
అన్న మరణవార్త విన్న వెంటనే పైడిమాంబ తీవ్రమైన మనోవేదనకు గురై, నిస్సత్తువతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఈ మానసిక ఒత్తిడితోనే ఆమె ఈ లోకాన్ని విడిచిపెట్టడానికి సిద్ధమైందని భక్తుల నమ్మకం.
- ఆమె దైవంలో ఐక్యమయ్యే ముందు, తన ముఖ్య అనుచరుడైన పతివాడ అప్పలనాయుడుకి ఒక చివరి సందేశాన్ని ఇచ్చింది.
- తన ప్రతిమ పెద్ద చెరువు పశ్చిమ భాగంలో దొరుకుతుందని, దాన్ని ప్రతిష్ఠించి, నిత్యం పూజలు, ఉత్సవాలు చేయాలని కోరి, అక్కడే దైవంలో ఐక్యమైంది.
ఇది కూడా చదవండి : Bizarre Christmas : ప్రపంచంలోని 10 వింత క్రిస్మస్ ఆచారాలు, ప్రదేశాలు
ప్రతిమ లభ్యం, ఆలయ నిర్మాణం
Sri Paidithalli Ammavaru : పైడిమాంబ దైవంలో ఐక్యమైన తర్వాత, విజయదశమి మరుసటి మంగళవారం నాడు, పతివాడ అప్పలనాయుడుకి అమ్మవారు కలలో కనిపించి, తాను చెరువులో ఉన్నానని చెప్పారని ప్రతీతి. కలలో కనిపించిన విధంగానే అప్పలనాయుడు పెద్ద చెరువులో వెతకగా, అమ్మవారి ప్రతిమ లభించింది. భక్తులు వెంటనే ఆ విగ్రహాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠించి, శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు.
- అప్పటినుండి ఆమె విజయనగరానికి గ్రామదేవతగా పూజలందుకుంటున్నారు.
- ఆమె అనుచరుడైన పతివాడ అప్పలనాయుడు కుటుంబీకులే ఇప్పటికీ ఆలయానికి వంశపారంపర్య పూజారులుగా కొనసాగుతున్నారు.
ఇది కూడా చదవండి : అంటార్కిటికా : 70 శాతం మంచినీరు ఇక్కడే ఉంది…రాత్రి సూరీడు…పగలు చీకటి
సిరిమాను ఉత్సవం | Sirimanu Ustavam
ప్రతి సంవత్సరం విజయదశమి (Vijaya Dashami) తర్వాత వచ్చే మొదటి మంగళవారం నాడు, పైడితల్లి అమ్మవారికి సిరిమాను ఉత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ ఉత్సవానికి రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. అమ్మవారి సిరిమాను రథంపై ఊరేగింపు, భక్తుల కోలాహలం ఈ ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణ.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
