Maha Kumbh Mela 2025 Rules : కుంభ మేళాలో ఈ 8 పనులు అస్సలు చేయకండి

షేర్ చేయండి
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్మాత్మిక మేళా ఏంటి అని ఎవరినైనా అడిగితే వెంటనే మహా కుంభమేళా ( Maha Kumbh Mela 2025 ) అని చెబుతారు. ఈసారి ప్రయాగ్‌రాజ్‌తో ( Prayagraj ) పాటు మరో మూడు ప్రాంతాల్లో జరగనుంది మహాకుంభ మేళా.

మహా కుంభ మేళాకు సుమారు 45 కోట్ల మంది భక్తులు మహా కుంభ మేళాకు వచ్చే అవకాశం ఉంది. దీనిని బట్టి అక్కడ ఎంత రద్దీగా ఉండనుందో అర్థం చేసుకోవచ్చు. కుంభ మేళాలో ఏం చేయాలి ? ఏం చేయడకూడదు అనేది తెలుసుకుంటే ఈ ఆధ్మాత్మిక ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. 

Prayanikudu
| వాట్స్ అప్‌లో ఆసక్తికరమైన ట్రావెల్ కంటెంట్ పొందడానికి ఇక్కడ క్లిక్ చేసి గ్రూపులో చేరగలరు

  చేయాల్సినవి | The Do’s In Maha Kumbh Mela 2025

మహాకుంభ మేళాను వైభవంగా నిర్వహించేందుకు అధికారులు కొన్ని సూచనలు జారీ చేశారు. ఈ సూచనలు పాటిస్తే మీ ప్రయాణానంతో పాటు,  ఈ పవిత్ర స్నానాన్ని ప్రశాంతంగా ఆచరించి మీ స్వస్థలానికి చేరుకోవచ్చు.

ఈ  సూచనలు పాటించండి

సరైన ప్లానింగ్ | Planning For Maha Kumbh Mela : మీ ప్రయాణానికి ముందు మహాకుంభ మేళా అధికారిక వెబ్‌సైట్ చెక్ చేయండి. సూచనల మేరకు మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోండి.  తాత్కాలిక విడిదిని బుక్ చేసుకోండి. అక్కడి ప్రధానమైన ఘట్టాల తేదీలను బట్టి మీ యాత్రను ప్లాన్ చేసుకోండి.  

తక్కువ సామాన్లు : మీతో పాటు తక్కువ సామాన్లు తీసుకెళ్లేలా ప్లాన్ చేయండి. అవసరమైన వస్తువులు మాత్రమే తీసుకెళ్లండి. అందులో మీ వైద్య అవసరాలను బట్టి కావాల్సిన ఫస్ట్ ఎయిడ్ కిట్, వైద్యుల సూచనల మేరకు అవసరమైన మెడిసిన్స్ తీసుకెళ్లండి.

ఇది కూడా చదవండి : ప్రయాగ్‌రాజ్‌లో తప్పకుండా చూడాల్సిన 22 సందర్శనీయ ప్రదేశాలు
maha kumbh mela trains
| ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల నుంచి భక్తులు కుంభ మేళాకు తరలి రానున్నారు
  • విషయాలు తెలుసుకోండి : మీరు ఉండబోయే ప్రాంతం గురించి ముందే తెలుసుకోండి. అక్కడ స్థానికంగా ఉండే అసుపత్రులు, భోజనశాలలు, అత్యవసర సేవలు వంటి వివరాలు సేకరించండి. అత్యవసర పరిస్థితిలో వినియోగించాల్సిన నెంబర్లు నోట్ చేసుకోండి.
  • స్థానిక నియమాలు పాటించండి : పవిత్ర స్నానం కోసం అధికారులు ఏర్పాటు చేసిన ఘాట్లు లేదా స్నానం చేసే ప్రాంతాలకు మాత్రమే వెళ్లండి. పరిశుభ్రతను పాటించండి. టాయిలెట్స్, యూరినల్స్ కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థను వినియోగించండి.
  • వ్యర్థాల నిర్వహణ : వాడిన వస్తువులను పడేయాడానికి అడుగడుగునా మీకు చెత్త డబ్బాలు కనిపిస్తాయి. వాటిలోనే చెత్త పడేయండి. 
  • పార్కింగ్ : పార్కింగ్ కోసం కేటాయించిన ప్రాంతాల్లోనే మీ వాహనాలను నిలపండి. ట్రాఫిక్ నియమాలను పాటించండి. దీని వల్ల ఇతర భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది.
  • అనుమానాస్పద వస్తువులు : మహా కుంభ మేళా జరిగే ప్రాంతాల్లో మీకు అనుమానాస్పద వస్తువులు, లేదా ఎవరైనా వదిలేసిన గుర్తు తెలియని వస్తువులు కనిపిస్తే స్తానిక అధికారులకు లేదా పోలీసు సిబ్బందికి సమాచారం అందించండి.
  • సహకారం : స్థానిక అధికారులు, నిర్వాహకులు,  మేళా సిబ్బంది సూచనలు పాటించండి. మేళా నిర్వహణకు వారికి సహకరించండి. దీని వల్ల మేళా ప్రశాతంగా సాగుతుంది.
  • వస్తువులు జాగ్రత్త : మీ వస్తువుల పట్ల జాగ్రత్తలు పాటించండి. ఏమైన కనిపించకపోతే స్థానికంగా ఉన్న లాస్ట్ అండ్ ఫౌండ్ సెంటర్ల ( Lost and Found Centre Kumbh Mela ) సేవలను వినియోగించుకోండి.
  • బఫర్ టైమ్ : మీరు చేయాల్సిన పనులను ప్లాన్ చేసే సమయంలో కొంత ఖాళీ సమయాన్ని వదలండి. ఉదాహరణకు ఒక గుడికి వెళ్లిరావడానికి మీరు రెండు గంటల సమయం పడుతుంది అనుకుంటే మరో 30 నిమిషాలు లేదా గంటను బఫర్ టైమ్‌గా భావించండి.  ఎందుకంటే కొన్నిసార్లు మనం అనుకున్న సమయంలో పనులు జరగక పోవచ్చు. ఆలస్యం అవ్వవచ్చు.

మహాకుంభ మేళాలో చేయకూడనివి | Don’t Of Maha Kumbh Mela 2025

Maha Kumbh 2025
| కుంభ మేళాలో భక్తుల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

కోట్లాది మంది భక్తులు వచ్చే మేళాలో కేవలం మన స్వార్థం లేదా అవసరాల గురించి మాత్రమే ఆలోచించలేము కదా. మేళా నిర్వహణ కోసం కొన్ని పనులు చేయకపోవడం ఇతరులకు సౌకర్యాన్ని ఇస్తుంది. మీ ప్రయాణం ఆర్థికంగా, హార్దికంగా , ఆధ్మాత్మికంగా చక్కగా సాగాలి అంటే చేయకూడని కొన్ని పనులు ఇవే..

  • విలువైన వస్తువులు వద్దు : మీతో పాటు విలువైన ఆభరణాలు, వస్తువులు, అవసరానికి మించిన ఆహార పదార్థాలు, లెక్కకు మంచిన దుస్తువులు తీసుకెళ్లకండి. తక్కువ వస్తువులతో ప్రయాణించండి.
  • తెలియని వారితో జాగ్రత్త : ప్రయాణాల్లో కొత్త ప్రదేశాలను చూస్తాం.  చాలా మంది కొత్తవాళ్లు పరిచయం అవుతారు. ఇలాంటి ప్రదేశాలలో, అలాంటి వ్యక్తుల విషయంలో కాస్త అలెర్ట్‌గా ఉండండి.
  • వివాదాలు వద్దు : మహాకుంభ మేళా ( Maha Kumbh Mela ) అనేది ఒక అద్భుతమైన ఆధ్మాత్మిక ప్రయాణం. ఈ ప్రయాణం సాఫీగా సాగేలా మెలగాల్సి ఉంటుంది. ఎవరితోెనూ అనవసరమైన వాదనలు చేయకండి. లేనిపోని వివాదాల జోలికి వెళ్లకండి.
ఇది కూడా చదవండి : కాశీ నగరం విశేషాలు…కాశీలో దర్శిచుకోవాల్సిన ఆలయాలు..కాశీ చరిత్ర, కాశీ ట్రావెల్ గైడ్

నీటి సరిహద్దులను గౌరవించండి : మీరు కుంభ మేళాకు వెళ్తే అక్కడ స్నానం చేసేందుకు నిర్ణీత ప్రాంతాలు కనిపిస్తాయి. మీరు ఆ జోన్‌లోనే పవిత్ర స్నానాలు చేయాల్సి ఉంటుంది. అవి దాటి వెళ్లడానికి అనుమతి లేదు. ఎందుకంటే అక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

  • గంగా నది పవిత్రతను కాపాడండి : హిందువుల అతి పవిత్ర నదుల్లో గంగా నది అతి ప్రధానమైనది. ఇందులో పవిత్ర స్నానం ఆచరిస్తే మోక్షాన్ని పొందుతాం అని భక్తులు నమ్ముతారు. మోక్షాన్ని ప్రసాదించే ఈ నది పవిత్రను కాపాడే బాధ్యత కూడా భక్తులదే కదా.నదిలో పూజా సామగ్రి పడేయరాదు. నదిలో కవర్లు, ఇతర సామాన్లు వేయరాదు. 
  • అనారోగ్యంగా ఉంటే : ఒక వేళ మీకు ఏదైనా అనారోగ్యం ఉన్నా, ఏదైనా అంటువ్యాధి లక్షణాలు కనిపించినా జనాలు ఎక్కవగా ఉన్న ప్రాంతాలకు వెళ్లకండి.
  •  ప్లాస్టిక్ వాడకండి : భూమాతను, నది పవిత్రతను కాపాడేందుకు ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించండి. మేళా జరిగే ప్రాంతంలో, నగరంలో ప్లాస్టిక్ వస్తువులను వినియోగించకండి.
  • టాయిలెట్స్ వినియోగించండి : మేళా జరిగే ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచేందుకు కాపాడేందుకు మీ వంతు సహాకారం అందించండి. మేళాలో ఉన్న టాయిలెట్స్‌‌ను వినియోగించండి.

ముగింపు 

మహాకుంభ మేళా అనేది ఒక పండగ మాత్రమే కాదు, కోట్లాది మందిని ఒకే చోటికి తీసుకువచ్చే కలిపే అద్భుతమైన ఆధ్మాత్మిక వేదిక. ఈ మేళా కోట్లాది మంది భక్తుల విశ్వాసాలు, ఆచారాలు, సంప్రదాయలకు ప్రతీక. వాటిని భంగం  కలిగించకుండా ఆధ్మాత్మిక అనుభూతి పొందేలా ప్లాన్ చేసుకోండి. 

పైన వివరించిన సూచనలు అధికారులు జారీ చేసినవి. వీటిని నేను మీకు అర్థం అయ్యేలా వివరించే ప్రయత్నించాను. వీటిని పాటించి మహా కుంభ మేళా అనుభవాన్ని జీవితాంతం గుర్తుండేలా మలచుకోండి. ఎందుకంటే ఈ మేళా కేవలం సాధారణ కాదు. ఇది భారతీయుల ఆధ్మాత్మికత వైభవానికి, భారతీయతకు ఒక ప్రతీక కూడా.

గమనిక : ఈ వెబ్‌సైట్‌లో కొన్ని ప్రకటనలు కనిపిస్తాయి. వీటిని గూగుల్ యాడ్ అనే సంస్థ అందిస్తుంది. ఈ ప్రకటనలపై మీరు క్లిక్ చేయడం వల్ల మాకు ఆదాయం వస్తుంది. 

Trending Video On : Prayanikudu Youtube Channel

ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

మరిన్ని కుంభమేళ కథనాలు

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!