ప్రతీ సంవత్సరం మహా శివరాత్రి అనంతరం (Bhagwan Balayogeswarula Teertham) అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మడివరంలో భగవాన్ బాలయోగీశ్వరుల తీర్థం) జరుగుతుంది. ఈ తీర్థానికి దూరదూరం నుంచి భక్తులు తరలి వస్తుంటారు. ఈ సందర్భంగా ఈ తీర్థం విశేషాలు …
మహా శివరాత్రి అనంతరం ఏపిలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మడివరంలో భగవాన్ బాలయోగీశ్వరుల తీర్థం జరుగుతుంది. ఈ తీర్థానికి దూరదూరం నుంచి భక్తులు తరలివస్తుంటారు.
ముఖ్యాంశాలు
భగవాన్ బాలయోగీశ్వరుల తీర్థం గురించి

ముమ్మడివరంలో (Mummidivaram) ఉన్న భగవాన్ బాలయోగీశ్వరుల తీర్థానికి మన దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. మహా శివరాత్రి మరుసటి రోజు భారీ సంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడ తపస్సు చేసిన మునీశ్వరులకు, వేద పండితులకు వందనం సమర్పిస్తారు.
పుణ్యాత్ముల వారసత్వం

భగవాన్ బాలయోగీశ్వరులు సుమారు 40 ఏళ్ల పాటు ఈ ప్రాంతంలో కఠోరమైన దీక్ష, తపస్సులు చేశారు. ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం (Spiritual Journey) అనేది చాలా మందికి ప్రేరణగా నిలుస్తోంది. మహాశివరాత్రి (Maha Shivaratri) సమయంలో ఆయన భక్తులకు దర్శనం ఇచ్చేవారు.
పవిత్ర క్షేత్రంగా…

భగవాన్ బాలయోగీశ్వరుల తీర్థానికి తెలుగు రాష్ట్రాల (Telugu States) నుంచే కాకుండా భారత దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. ప్రతీ ఏడాది మహా శివరాత్రి తరువాత ఇక్కడ భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు.
నేటికీ కొనసాగుతున్న తీర్థం

భగవాన్ బాలయోగీశ్వరులు కైవల్య సిద్ధి (Kaivalya Siddhi) పొందిన తరువాత కూడా భక్తులు దూర దూరం నుంచి తరలివస్తున్నారు. వారి సమాధులను దర్శించుకుంటున్నారు.
భగవాన్ పెదబాలయోగీశ్వరులు ప్రస్థానం | Journey of Bhagwan Pedabalayogiswara

జ్ఞానోదయం (enlightenment) కోసం భగవాన్ పెదబాలయోగీశ్వరులు 1946 జూన్ 22వ తేదీన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించారు. 1985 జులై 19వ తేదీన ఆయన కైవల్య సిద్ధిని పొందారు. ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం ఎంతో మందిని చైతన్యపరిచింది. అందుకే ఆయనకు ఎంతో మంది విద్యార్థులు, అనుయాయులు ఏర్పడ్దారు.
చిన బాలయోగీశ్వరుల ప్రస్థానం | Life Story Of Chinna Balayogiswara

చిన బాలయోగీశ్వరులు తన ఆధ్మాత్మి ప్రస్థానాన్ని 1950 మార్చి 26వ తేదీన ప్రారంభించారు. 1991 అక్టోబర్ 28వ కైవల్య సిద్ధి పొందారు. ఆయన ఆధ్యాత్మిక జీవితం ఎంతో మందికి ప్రేరణగా నిలిచింది. సత్యాన్వేషకులకు ఆయన మార్గదర్శి అయ్యారు. ఆయన బోధనల వల్ల జీవితాలను మార్చుకున్న, ప్రేరణ పొందిన భక్తులు తీర్థానికి తరలి వస్తుంటారు.
తీర్థం ఏర్పాటు | Organizing the Pilgrimage

మహా శివరాత్రి సందర్భంగా భగవాన్ బాలయోగీశ్వరుల తీర్థానికి వచ్చే భక్తుల కోసం తపో ఆశ్రమ కమిటీ (Tapo Ashram Committee) , కుటుంబ సభ్యులు కలిసి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. చుట్టూ ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా భక్తుల కోసం తగిన ఏర్పాట్లు చేస్తారు.
ఆధ్యాత్మిక కిరణం | Bhagwan Balayogeswarula Teertham

భగవాన్ బాలయోగీశ్వరుల తీర్థం (Bhagwan Balayogeswarula teertham) అనేది అనేక మంది భక్తులకు ఆధ్యాత్మిక చైతన్యానికి ఒక వేదిగా నిలిచింది. భక్తులు వివిధ ప్రాంతాలు, జిల్లాలు, రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి తమ మొక్కలు చెల్లించుకుంటారు.
మీరు భగవాన్ బాలయోగీశ్వరుల తీర్థం వెళ్లి ఉంటే అక్కడి అనుభవాన్ని మాతో పంచుకోండి. ఏమైనా ఆసక్తికరమైన విషయాలు ఉంటే కామెంట్ చేయండి.
– తాత కాశి విశ్వనాథ్, ఉభయగోదావరి జిల్లా ప్రతినిధి
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.