China Train Video : చైనాకు సంబంధించిన మరో కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు ఒక హిందీ ట్రావెల్ వ్లాగర్ ఈ వ్లాగ్‌లో అతను చూపించిన సీన్స్ చూస్తే చైనాలో ఈ కోణం కూడా ఉందా అనిపిస్తుంది. ఈ వీడియోలో ట్రైన్లో ప్రయాణించే కొంత మంది ప్రయాణికులు ఫ్లోరుపై పడుకోవడం, టాయిలెట్ పక్కనే కూర్చోవడం మీరు చూడవచ్చు.
అయితే చైనాకు సంబంధించిన మరో కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు ఒక హిందీ ట్రావెల్ వ్లాగర్ ( Hindi Travel Vlogger ). ఈ వ్లాగ్‌లో అతను చూపించిన సీన్స్ చూస్తే చైనాలో ఈ కోణం కూడా ఉందా అనిపిస్తుంది. ఈ వీడియోలో కొంత మంది ప్రయాణికులు ట్రైన్ ఫ్లోరుపై పడుకోవడం, టాయిలెట్ పక్కనే కూర్చోవడం మీరు చూడవచ్చు.
Table Of Contents
ఈ మధ్య చాలా మంది భారతీయ ట్రావెల్ వ్లాగర్లు…మరీ ముఖ్యంగా తెలుగు వ్లాగర్లు చైనా వెళ్లి అక్కడ వీడియోలు చేస్తున్నారు. అక్కడి డెవలెప్మెంట్ను చూపిస్తున్నారు. చైనాలో భారీ భవనాలు, మౌళిక సదుపాయాల గురించి చక్కని వీడియోలు అందించారు చాలా మంది తెలుగు ట్రావెల్ వ్లాగర్స్ ( Telugu Travel Vloggers ). అవి చూసి చాలా మంది చైనా మనకన్నా చాలా ముందుంది అని కామెంట్ చేస్తున్నారు.
గంటకు 450 కిమీ | CR 450 AF
చైనాలో బుల్లెట్ ట్రైన్లు నడుస్తాయి. వాయువేగంతో దూసుకెళ్తాయి. సీఆర్ 450 అనే ( Fastest Train in China ) ట్రైన్ అయితే గంటకు 450 కిమీ వేగంతో వెళ్తుంది. ఇవన్నీ విలాసవంతమై ట్రైన్లు. మరి ఆర్డినరీ, డొమెస్టిక్ ట్రైన్లు ఎలా ఉంటాయి ? వాటిలో ప్రయాణిస్తే ఎలా ఉంటుందో చూపించాడు ఒక ఇండియన్ వ్లాగర్. ఈ ట్రైన్ చూస్తుంటే మన ట్రైన్లో జనరల్ బోగిలు గుర్తొస్తున్నాయి అని నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు.
చైనాలో జనలర్ ట్రైన్ పరిస్థితి | Chinese Domestic Train
ఆన్ రోడ్ ఇండియన్ అనే పేరుతో ట్రావెల్ వ్లాగులు చేసే ఒక వ్యక్తి చైనాలోని ఒక డొమెస్టిక్ ట్రైను ప్రయాణాన్ని భారతీయులతో షేర్ చేసుకున్నాడు. 15 గంటల తన ప్రయాణంలో కొన్ని బిట్స్ చూపిస్తూ ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇందులో ప్రయాణికులు ( China Train Video ) తమ బ్యాగులను సీటు కింద పెట్టడం వంటి అనేక విషయాలను మీరు గమనించవచ్చు.
ఈ వీడియోలో వ్లాగర్ మన దేశంలో శతాబ్ది రైలులో ( Shatabdi Train ) టికెట్ కోసం ఎంత చెల్లిస్తామో అంతే చెల్లించి టికెట్ తీసుకుని ప్రయాణించాడు. కొంత మంది చైనీస్ ప్రయాణికులు సీట్ల మధ్యలో, రైలు ఫ్లోరుపై పడుకోవడాన్ని కూడా చూపించాడు. సీట్లు దొరక్క కొంత మంది టాయిలెట్ పక్కన కూర్చోవడం కూడా చూపించాడు. సీట్లు సరిపోకపోతే ప్రయాణికులు కింద కూర్చొంటారు కానీ గొడవపడటం చూడలేదు అని తెలిపాడు అతను.
నెటిజెన్ల రియాక్షన్ | Netizens On Viral Chinese Train Video

ఈ వీడియో చూసిన నెటిజెన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అందులో కొన్ని కామెంట్స్ చదవండి
- ఆ ట్రైన్లు క్లీన్‌గా ఉన్నాయి.
- అక్కడ పాన్ మసాలా గుట్కా తినే ఛప్రీ ( పోకిరీలు ) లేరు
- రెండు దేశాల్లో ( భారత్ , చైనా) జనాభా చాలా ఎక్కువ. కానీ అక్కడ ప్రజల ప్రవర్తన చూడండి. ప్రభుత్వ ఆస్తి ఎలా వినియోగించుకోవాలో వారికి అవగాహన ఉంది.
- ఈ ట్రైన్ చాలా క్లీన్‌గా కనిపిస్తోంది. వారిలో బిచ్చగాళ్లు లేరు అని అనిపిస్తోంది.
- ఈ వ్లాగర్ ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటాడు.
- ఇది కూడా చదవండి : ఈట్రైనుకు టికెట్ లేదు, టీసీ లేడు: 75 ఏళ్ల నుంచి ఫ్రీ సేవలు
నెటిజెన్లు ఆ ట్రైన్లో ( China Trains ) ప్రయాణికులు పద్ధతిగానే ఉన్నారు కదా అన్నట్టుగా కామెంట్ చేస్తున్నారు. జనాభా ఎక్కువ ఉన్న దేశాల్లో మౌళిక సదుపాయాల కల్పించడం అనేది ఒక ఛాలెంజింగ్ విషయం. కానీ ఉన్న వసతులను సరైన పద్ధతిలో వాడుకోవడం అనేది దేశాన్ని బట్టి మారుతుంది అనే విధంగా నెటిజెన్లు స్పందించారు. ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలపండి.
ఈ Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి