Honeymoon Destinations 2025 Guide : హనీమూన్‌కు ప్లాన్ చేస్తున్నారా? ప్రపంచంలోనే టాప్ 5 రొమాంటిక్ ప్రదేశాలు ఇవే
Honeymoon Destinations 2025 Guide : పెళ్లి తర్వాత తమ జీవిత భాగస్వామితో కలిసి హనీమూన్ ప్లాన్ చేసుకోవడం చాలా మంది చేస్తుంటారు. అయితే, ప్రపంచంలో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉండటం వల్ల, ఎక్కడికి వెళ్లాలి అనే విషయంలో చాలా మందికి గందరగోళం ఉంటుంది. అందుకే, మీ హనీమూన్‌ను మరింత మధురంగా మార్చే, ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన, రొమాంటిక్ ప్రదేశాల గురించి తెలుసుకుందాం.
ముఖ్యాంశాలు
వెనిస్ (ఇటలీ) | Venice, Italy
ప్రపంచంలో రొమాన్స్‌కు పేరుగాంచిన నగరాల్లో ఇటలీలోని వెనిస్ ముఖ్యమైనది. ఇది కెనాల్స్ సిటీగా (Canals City) ప్రసిద్ధి చెందింది. వెనిస్ నగరం కళ, శిల్పకళ, ప్రేమ అద్భుతమైన కలయిక. ఇక్కడ మీ జీవిత భాగస్వామితో కలిసి గాండోలా రైడ్ చేయడం, సెయింట్ మార్క్ బాసిలికా, పాత వీధుల్లో తిరగడం ఒక మరపురాని అనుభూతిని ఇస్తుంది. హనీమూన్ కోసం ఇది అద్భుతమైన ఛాయిస్.
- ఇది కూడా చదవండి : Honeymoon Spots Near Hyderabad : హైదరాబాద్‌కు దగ్గర్లో ఉన్న హనీమూన్ డెస్టినేషన్స్ ఇవే

శాంటోరిని (గ్రీస్) (Santorini, Greece)
నీలి రంగు గోపురాలు, తెలుపు రంగు భవనాలతో కళ్లముందు కనబడే శాంటోరిని (గ్రీస్), రొమాన్స్, అందాల కలబోత. ఇక్కడ సూర్యాస్తమయం (Sunset in Greece) చూడటానికి రెండు కళ్లు సరిపోవు. వివాహం తర్వాత హనీమూన్‌కు వెళ్లడానికి ఇది చాలా మంచి ఛాయిస్. మీ జీవిత భాగస్వామితో సరదాగా గడపడానికి ఇక్కడ చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి.
ఇది కూడా చదవండి : గ్రీకు వీరుడు పుట్టిన దేశం…పర్యాటకులకు స్వర్గధామం
క్యోటో (జపాన్) | Kyoto, Japan | Honeymoon Destinations 2025 Guide
చరిత్ర, సంస్కృతికి నిలయమైన జపాన్‌లోని క్యోటో, పురాతన సంప్రదాయాలు, ఆధునిక అందాలను మిళితం చేస్తుంది. ఇక్కడ వందల ఏళ్ల నాటి దేవాలయాలు, అద్భుతమైన వెదురు తోటలు (Bamboo Groves), గేషా ప్రదర్శనలు ఈ నగరానికి ప్రత్యేకతను తెస్తాయి.
ఇది కూడా చదవండి : వావ్, జపాన్ మరీ అంత క్లీన్‌గా ఉంటుందా ?
మీ హనీమూన్ (Honeymoon In Kyoto) ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. జీవితంలో ఒక్కసారైనా తప్పక చూడవలసిన ప్రదేశం ఇది.
గ్రాండ్ కాన్యన్ (అమెరికా) & పటగోనియా (దక్షిణ అమెరికా)
Grand Canyon (America) : కొలరాడో నది చెక్కిన ఈ గ్రాండ్ కాన్యన్ భౌగోళిక అద్భుతం. ఈ ప్రాంతాన్ని చూడగానే సందర్శకులు ఆశ్చర్యపోతారు. ఇక్కడ నడుస్తూ లేదా హెలికాప్టర్ టూర్ చేస్తూ అద్భుతమైన దృశ్యాలను ఆస్వాదించవచ్చు. ప్రకృతి ప్రేమికులకు హనీమూన్ కోసం ఇది బెస్ట్.
ఇది కూడా చదవండి : అమెరికాలో అత్యంత ప్రమాదకరమైన 18 నగరాలు…
పటగోనియా (అర్జెంటీనా-చిలీ) | Patagonia , Argentina
ఎత్తైన పర్వత శిఖరాలు, హిమానీనదాలు (Glaciers), సరస్సులతో నిండిన పటగోనియా, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను అందిస్తుంది. ఇక్కడ మీ భాగస్వామితో రొమాంటిక్ సమయాన్ని గడపవచ్చు. ఫోటోషూట్ల కోసం కూడా ఇది గొప్ప ఎంపిక.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
