Budget Travel : భారతీయ రూపాయికి ఎక్కువ విలువ.. ఈ 6 దేశాలకు తక్కువ ఖర్చుతో ఇంటర్నేషనల్ ట్రిప్ ప్లాన్ చేయండి
Budget Travel : ఇంటర్నేషనల్ ట్రిప్ ప్లాన్ చేయాలంటే ముందుగా మనసులో మెదిలే ఆలోచన బడ్జెట్ ఎంత అవుతుంది? చాలా దేశాలకు వెళ్లాలంటే మన భారతీయ రూపాయి (Indian Rupee) విలువ తక్కువగా ఉంటుంది. కానీ, కొన్ని దేశాలు ఉన్నాయి.. అక్కడ మీ రూపాయికి చాలా ఎక్కువ విలువ ఉంటుంది. అంటే, మీరు తక్కువ ఖర్చుతో అద్భుతమైన విదేశీ పర్యటనను ప్లాన్ చేయవచ్చు. ఆగ్నేయాసియా నుంచి దక్షిణ అమెరికా వరకు, మీ బడ్జెట్ గురించి పెద్దగా ఆలోచించకుండా చక్కటి అనుభూతిని పొందగలిగే అటువంటి 6 అద్భుతమైన దేశాల వివరాలు, అక్కడ రూపాయి విలువ ఎంత ఉందో ఇప్పుడు చూద్దాం.
శ్రీలంక (Sri Lanka)
మన పొరుగున ఉన్న ద్వీప దేశం శ్రీలంక, మన రూపాయికి మంచి విలువ ఇచ్చే ప్రాంతాలలో ఒకటి. రూపాయి దాదాపు 3.8 శ్రీలంక రూపాయలకు సమానం. పచ్చని తేయాకు తోటలు, బంగారు బీచ్‌లు, పురాతన కట్టడాలు ఇక్కడ ప్రధాన ఆకర్షణలు. తక్కువ ఖర్చుతోనే లగ్జరీ రిసార్ట్‌లను, రుచికరమైన స్థానిక ఆహారాన్ని ఆస్వాదించవచ్చు. ప్రపంచంలోని అత్యంత అందమైన రైలు ప్రయాణాలలో ఒకటైన కాండీ నుంచి ఎల్లా వరకు యాత్రను తప్పకుండా చేయాలి.

నేపాల్ (Nepal)
హిమాలయాల ఒడిలో ఉన్న నేపాల్, ట్రెక్కింగ్ ప్రియులకు అద్భుతమైన ఎంపిక. రూపాయి దాదాపు 1.6 నేపాలీ రూపాయలకు సమానం. పర్వతారోహణ, అడ్వెంచర్ యాక్టివిటీస్‌కు నేపాల్ ప్రసిద్ధి. ఇక్కడ వసతి, ఆహారం, స్థానిక కేఫ్‌లలో మోమోలు చాలా తక్కువ ధరకే లభిస్తాయి. సాహస ప్రియులు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్ చేయవచ్చు. ప్రశాంతతను కోరుకునే వారు పోఖారా సరస్సులపై పారాగ్లైడింగ్ చేయవచ్చు.
ఇండోనేషియా (Indonesia)
ప్రపంచ ప్రసిద్ధి చెందిన బాలిని కలిగి ఉన్న ఇండోనేషియా, తక్కువ ఖర్చుతో విలాసవంతమైన ట్రిప్‌ను అందిస్తుంది. రూపాయి విలువ దాదాపు 190 ఇండోనేషియా రూపాయిలకు సమానం. ఈ దేశంలో 17,000 కంటే ఎక్కువ ద్వీపాలు ఉన్నాయి. ప్రతి ద్వీపానికి దానిదైన ప్రత్యేక సంస్కృతి ఉంటుంది. స్థానిక ఆహారం నుంచి రవాణా వరకు ప్రతిదీ చాలా చౌకగా ఉంటుంది. బోరోబుదూర్ (Borobudur), ప్రంబనన్ (Prambanan) వంటి పురాతన దేవాలయాలను సందర్శించవచ్చు. సాంస్కృతిక కేంద్రం అయిన ఉబుద్‌లోని వరి పొలాలు, ఆర్ట్ కేఫ్‌లు ప్రధాన ఆకర్షణ.

కంబోడియా (Cambodia)
చారిత్రక సంస్కృతిని, అద్భుతమైన బీచ్‌లను కోరుకునే వారికి కంబోడియా సరైన ఎంపిక. ఒక భారతీయ రూపాయి విలువ దాదాపు 49 కంబోడియన్ రీల్లకు సమానం. ఈ దేశం ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కట్టడం అంగ్కోర్ వాట్ (Angkor Wat) ఆలయాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ బీచ్‌లు, రద్దీగా ఉండే మార్కెట్లు కూడా పర్యాటకులను ఆకర్షిస్తాయి. అంగ్కోర్ వాట్ పైన సూర్యోదయాన్ని వీక్షించడం అస్సలు మిస్ చేయకూడదు. ఇక్కడ వసతి, ఆహారం చాలా చౌకగా లభిస్తాయి.
ఇది కూడా చదవండి : Egypt Travel Guide: ఈజిప్ట్..ఇక్కడ డబ్బు కట్టి సమాధులను చూస్తారు.. 15 Facts
ఉజ్బెకిస్తాన్ (Uzbekistan)
మధ్య ఆసియా సంస్కృతిని, గొప్ప చరిత్రను ఇష్టపడే బడ్జెట్ ప్రయాణికులకు ఉజ్బెకిస్తాన్ సరైన ప్రాంతం. రూపాయి దాదాపు 145 ఉజ్బెకిస్తానీ సోమ్లకు సమానం. నీలిరంగు టైల్స్‌తో కూడిన మసీదులు, అద్భుతమైన నిర్మాణాలు, రద్దీగా ఉండే మార్కెట్లు ఇక్కడ ప్రధాన ఆకర్షణ. తక్కువ ఖర్చుతో మధ్య ఆసియా సంస్కృతిని అనుభవించవచ్చు. చరిత్రను అన్వేషించడానికి సమర్కండ్ (Samarkand), బుఖారా (Bukhara) నగరాలు ప్రసిద్ధి చెందాయి.
ఇది కూడా చదవండి : Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు
వియత్నాం (Vietnam)
వియత్నాం, ఇండియన్ టూరిస్ట్‌లకు అత్యంత బడ్జెట్-ఫ్రెండ్లీ దేశాలలో ఒకటిగా నిలుస్తోంది. రూపాయి దాదాపు 296 వియత్నామీస్ డాంగ్‌కు సమానం. సాపాలోని వరి పొలాలు, హోయ్ అన్ (Hoi An) లోని లాంతర్ల వెలుగులతో నిండిన వీధులు, హనోయ్ (Hanoi) నగరం ఉల్లాసభరితమైన శక్తిని పర్యాటకులు ఆస్వాదించవచ్చు. ఇక్కడ ఫుడ్, వసతి చాలా తక్కువ ఖర్చుతో దొరుకుతాయి. ఉదాహరణకు ఒక రాత్రికి రూ.2,000 ధరకే మంచి హోటల్ స్టే లభిస్తుంది. హా లాంగ్ బే (Ha Long Bay) మీదుగా ప్రయాణించడం లేదా హో చి మిన్ సిటీ సమీపంలోని కు చి సొరంగాలను (Cu Chi Tunnels) సందర్శించడం ఒక మరపురాని అనుభవం.

టూర్ ప్లాన్ చేస్తున్నారా ? తక్కువ ధరలో మెరుగైన ప్యాకేజీ కావాలంటే వాట్సాప్‌లో సంప్రదించండి. హైదరాబాద్ నుంచి హిమాలయాల వరకు…కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు పలు ఆప్షన్స్ అందిస్తాము.

💬 Chat on WhatsApp

తెలుగు పాఠకుల కోసం గమనిక: ఈ బ్లాగ్ కేవలం కోసం మాత్రమే. ట్రావెల్ ప్యాకేజీలు , వివరాలు భాగస్వామి సంస్థల ద్వారా అందించబడతాయి.

Disclaimer: This article is for informational purposes only. Prayanikudu.com shares verified travel updates and trip ideas collected from trusted sources and travel partners. We do not operate or sell any packages directly, nor are we responsible for bookings, prices, or any changes made by travel operators. All bookings, payments, and communication happen directly between travelers and the respective tour companies or agents. Readers are advised to verify all details before confirming any trip.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
