మూడుముళ్లు, ఏడు అడుగులు వేసి ఒక్కటయ్యే జంటలు తమ సరికొత్త జీవితం అందంగా మొదలవ్వాలని కోరుకుంటారు. ప్రపంచం మొత్తానికి దూరమై ఒకరికొకరు చేరువయ్యే చోటు కోసం వెతుకుతుంటారు. మీరు కూడా అలాంటి చోటు కోసం వెతుకుతుంటే నార్త్, సౌత్ కాకుండా మీరు నార్త్ ఈస్ట్ స్టేట్స్ ట్రై చేయండి. మీకోసం ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్ హనీమూన్ డెస్టినేషన్స్ ( Honeymoon Destinations ) కొన్ని సజెస్ట్ చేస్తున్నాను. ఒకసారి చెక్ చేసి అందులో మంచి ఆప్షన్ ఏదో ఎంచుకోండి..
మనాలి ( Manali ) , షిమ్లా, ఊటి కొడైకనాల్ వంటి పాపులర్ డెస్టినేషన్స్ కాకుండా ఈ కొత్త ప్రాంతాలు ట్రై చేయండి.
గ్యాంగ్‌టక్ | Gangtok

ఈశాన్య రాష్ట్రంలో టాప్ హనీమూన్ డెస్టినేషన్స్‌లో ఒకటి గ్యాంగ్‌టక్. సిక్కిం (Sikkim ) రాజధాని అయిన గ్యాంగ్‌టక్‌లో ప్రేమ పక్షులు సంతోషంగా హాయిగా, సౌకర్యవంతంగా స్వీట్ మెమోరీస్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడి మార్కెట్లు, ప్రశాంతమైన మోనాస్టరీలు( Monasteries in Gangtok ) , సాహసభరితమైన ట్రెక్, అందమైన గ్లేషియర్స్ మిమ్మల్ని తప్పకుండా ఇంప్రెస్ చేస్తాయి.
పెల్లింగ్ | Pelling

సిక్కింలోని గ్యాల్షింగ్ జిల్లాలో ఉంటుంది పెల్లింగ్ అనే హిల్ ష్టేషన్ . ఇది చాలా తక్కువ మందికి తెలుసు . చాలా తక్కువ మంది టూరిస్టులు వస్తుంటారు. అందుకే దీన్ని మీ సొంత స్వర్గంలా ఫీల్ అవ్వొచ్చు హనీమూన్ టైమ్‌లో. ఇక్కడి ఖెచియోపాల్లి సరస్సు ( Khecheopalri Lake ), చెంగే జలపాతం మీకు బాగా నచ్చుతుంది.
డార్జిలింగ్ | Darjeeling

డార్జిలింగ్‌లో సగం డాల్లింగ్ పదం దాగుంది. నిజంగానే ఇది హిల్ స్టేషన్లలో డార్లింగ్ లాంటిది. అందుకే ఇక్కడికి చాలా మంది హనీమూన్ కోసం వస్తుంటారు. పశ్చిమ బెంగాల్లోని ఈ హిల్ స్టేషన్‌లో ( Hill Stations ) క్రౌడ్ అండ్ కాంపిటీషన్ కాస్త ఎక్కువే. కానీ వర్త వర్మా వర్తు. ఇక్కడి టీ ఎస్టేట్స్ ( Darjeeling Tea Estates ) చూడటానికి చాలా మంది వస్తుంటారు. ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి ఇప్పటిటికీ డార్జిలింగ్ ఇంత పాపులర్ డెస్టినేషన్ అవ్వడానికి.

తవాంగ్ | Tawang, Arunachal Pradesh

అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ అనే పట్టణం చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ దేశంలోనే అతిపెద్ద తవాంగ్ మోనాస్టరీ ( Tawang Monastery ) ఉంటుంది. ఈ మోనాస్టరీ నుంచి తవాంగ్ పట్టణం స్వర్గంలా కనిపిస్తుంది. ఇక్కడికి వెళ్తే మీరు డ్రాగన్ రెస్టారెంట్‌లో ఫుడ్ ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది.

టిబెట్‌ను చైనా ఆక్రమించే సమయంలో దలైలామా తవాంగ్ మార్గంలోనే భారత్ చేరుకున్నారు. ఇక్కడ అతిపెద్ద బౌద్ధ విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహం వెనక అన్నదానం చేస్తారు. దాని పక్కనే ఒక రెస్టారెంట్‌లో టీ తాగి నేను రెంటుకు తీసుకున్న బైకుపై భూమ్లా పాస్ ( Bumla Pass ) అనే బార్డర్ వెళ్లాను. మన ఆర్మీ క్యాంటీన్లో సూప్, నూడిల్స్ ఎంజాయ్ చేసి ఒక రెయిన్ కోర్ట్ అండ్ హ్యాండ్ గ్లవ్స్ కొన్నాను. ఇక్కడ జడల బర్రె అంటే యాక్ కనిపిస్తుంది. మోనాస్టరీలో వీటి పాలతో చేసిన నెయ్యితోనే దీపాలు వెలిగిస్తారు.
షిల్లాంగ్ | Shillong , Honeymoon Destinations

మేఘాలయ క్యాపిటల్ షిల్లాంగ్. దీనిని స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు. షిల్లాంగ్ సిటీలో సండే సండే మార్కెట్ పెడతారు. మంచి కలెక్షన్ ఉంటుంది. ఇక్కడి ఉమ్యామ్ సరస్సు ( Umiam Lake ) దగ్గర కూడా మీరు కాటేజీ తీసుకునే ప్లాన్ చేయవచ్చు. బైక్ రెంటుకు తీసుకుని ఈస్ట్ ఖాసీ హిల్స్ ( East Khasi Hills ) వైపు వెళ్లి మేఘాలయ ( Meghalaya ) అందాలను చెక్ చేయొచ్చు.
నాకు లాంగ్ డ్రైవ్ అంటే షిల్లాంగ్ నుంచి స్మిత్ ( Shillong To Smith On Bike ) అనే ప్రాంతానికి వెళ్లడమే గుర్తొస్తుంది. కొత్త జంట ఈ లాంగ్‌డ్రైవ్‌ను బాగా ఎంజాయ్ చేస్తారు. అయితే మీతో పాటు క్యాష్, ఫుడ్ తీసుకెళ్లండి. బండ్లో ఫుల్ ట్యాంక్ కొట్టించండి. ఎందుకంటే ఇక్కడ మధ్యలో షాపులు, బంకులు, ఏటీఎంలు ఉండవు. మళ్లీ షిల్లాంగ్ లేదా స్మిత్ ప్రాంత వైపు వస్తే కానీ మీకు సదుపాయాలు దొరకవు. ఇదంతా పర్సనల్ అనుభవంతో చెబుతున్నాను.
జూకో వ్యాలి | Dzukou Valley, Honeymoon Destinations

ముందు ఈ ప్రాంతాన్ని, రాసేటప్పుడు డీ రాస్తారు. కానీ పలికేట్పుడు డీ సైలెంట్ అయిపోతుంది. జూకో వ్యాలీ అని పిలుస్తారు. మణిపూర్ ( Manipur ), నాగలాండ్ బార్డర్లో ఉన్న ఈ వ్యాలి మన వంజంగిలాగే ( Vanjangi ) అందంగా ఉంటుంది.
నాగాలాంగ్ ( Nagaland ) రాజధాని కోహిమా నుంచి జుకో వ్యాలి కేవలం 25 కిమీ దూరంలో ఉంటుంది. అంటే మెహిదీపట్నం నుంచి చిల్కూరు అంత దూరం అనుకోండి. 2462 మీటర్ల ఎత్తులో ఉండే ఈ వ్యాలీ చాలా అందంగా ఉంటుంది. ఇక్కడి పర్వతాలు వైవిధ్యంగా ఉంటాయి. ముడత పర్వతాలు అంటారు చూడండి అలాగ. ఇలాంటి పర్వతాలను నేను షిల్లాంగ్ నుంచి వారాషీ వాటర్ ( Wahrashi Falls ) ఫాల్స్ వెళ్లే సమయంలో కూడా చూశాను.
జిరో వ్యాలీ | Ziro Valley, Honeymoon Destinations

అరుణాచల్ ప్రదేశ్‌లో ఉన్న అందమైన లోయ జీరో వ్యాలి. దీనిని పలికేటప్పుడు జీరో ( Ziro ) అని పలుకుతాం కానీ ఇది జీరో ( Zero ) కాదు. ఇక్కడ ఉండే ఒక తెగకు సంబంధించిన పేరు ఇది. భారత్ చైనా అంతర్జాతీయ బార్డర్‌కు చేరువలో ఉండే జీరో వ్యాలీ చాలా అందంగా ఉంటుంది. ఇక్కడి బౌగోళిక స్వరూపం, వరి చేన్లు, కల్చర్ ఇవన్నీ మీకు బాగా నచ్చుతాయి. కాంపిటీషన్ చాలా తక్కువ. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి జీరో మ్యూజిక్ ( Ziro Music Festival ) ఫెస్టివల్ జరుగుతుంది. దేశ విదేశాల నుంచి మ్యూజిషియన్స్, సింగర్స్ వస్తుంటారు.
మజులి | Majuli
నిజం చెప్పండి ఈ పేరు మీరు ఎప్పుడైనా విన్నారా ? లేదు కదా. నార్త్ ఈస్ట్‌లో ఇలాంటి పేర్లు ఇంకా చాలానే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే జనం ఈశాన్య రాష్ట్రాల ( North East States Tourism ) వైపు చూస్తున్నారు. ఇక మజులీ విషయానికి వస్తే ఇది అస్సాంలోని జోర్హాట్ అనే ప్రాంతం నుంచి 20 కిమీ దూరంలో ఉంటుంది.

అస్సాం లేదా అసోం ( Assam ) అనేది ఈశాన్య రాష్ట్రాలకు బాక్సాఫిస్ లాంటిది. నార్త్ ఈస్ట్ స్టేట్స్‌కు ఇక్కడి నుంచి మీరు వెళ్లాల్సి ఉంటుంది. మజులి చాలా అందంగా ప్రశాంతంగా ఉంటుంది. అయితే పొరపాటున ఎండాకాలం వెళ్లకండి. తరువాత నన్ను బ్లేమ్ చేయకండి.
కాలింపాంగ్ | Kalimpong, Kanchenjunga View

పశ్చిమ బెంగాల్లో ( West Bengal ) ఉన్న అద్బుతమైన ప్రాంతాల్లో కాలింపాంగ్ కూడా ఒకటి. దీని అందం డార్జిలింగ్, గ్యాంగ్‌టాక్‌లకు తక్కువేం కాదు. ఇక్కడ చాలా ఇల్లు బ్రిటిష్ కాలంలో నిర్మించినవే. దీంతో ఇక్కడి వీధుల్లో లుక్ మీకు కొత్తగా అనిపించవచ్చు. దీంతో పాటు ఇక్కడి నుంచి మీరు కాంచెన్ జంగా ( Kanchenjunga ) పర్వతాన్ని వీక్షించవచ్చు. ప్రపంచంలోనే మూడవ అత్యంత ఎత్తైన పర్వతం ఇది. దీని ఎత్తు 8586 మీటర్లు ఉంటుంది.
ఇందులో మీకు నచ్చిన హనీమూన్ డెస్టినేషన్ ( Honeymoon Destinations ) ఏంటో కామెంట్ చేసి చెప్పండి.
ప్రపంచం చాలా అందమైనది. అయితే ఈ అందమైన ప్రపంచాన్ని చూడాలి అనుకుంటే మాత్రం మీకు మంచి జీవిత భాగస్వామి కావాలి. అలాంటి భాగస్వామితో ఈ ప్రపంచాన్ని చూడాలి అంటే మీకో మంచి ట్రావెల్ గైడ్ కావాలి. ఆ పాత్రను నేను పోషిస్తాను. వివిధ ప్రాంతాల ( Travel Destination ) గురించి మీకు తరచూ అప్డేట్ చేస్తూ ఉంటాను. దీని కోసం మీరు చేయాల్సిందల్లా ప్రయాణికుడు పోస్ట్ చేసే స్టోరీస్‌ను ఈ బ్లాగుతో పాటు యూట్యూబ్‌లో కూడా చూడటమే. చూస్తారు కదూ ?!
గమనిక: ఈ వెబ్‌సైట్లో ప్రకటనలు కూడా ఉంటాయి. ముఖ్యంగా గూగుల్ యాడ్స్ ద్వారా ఈ ప్రకటనలు మీకు కనిపిస్తాయి. ఈ ప్రకటనలే మాకు ఆధారం. ఇందులో కొన్ని ప్రకటనలపై మీరు క్లిక్ చేస్తే మాకు ఆదాయం వస్తుంది.
Watch More Vlogs On : Prayanikudu
- Pandharpur: 7 గంటల్లో 7 ఆలయాల దర్శనం
- Hemkund Sahib Trek : హిమాలయాల్లో బ్రహ్మకమలం దర్శనం
- Kamakhya Temple: కామాఖ్య దేవీ కథ
- Tuljapur : శివాజీ నడిచిన దారిలో తుల్జా భవానీ మాత దర్శనం
- Shillong : అందగత్తెల రాజధాని షిల్లాంగ్
ఈ Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
ప్రపంచ యాత్ర గైడ్
- అంటార్కిటికా : 70 శాతం మంచినీరు ఇక్కడే ఉంది…రాత్రి సూరీడు…పగలు చీకటి
- Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు
- Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
- Milaf Cola : ఖర్జూరంతో సాఫ్ట్ డ్రింక్ లాంచ్ చేసిన సౌదీ అరేబియా
- Egypt Travel Guide: ఈజిప్ట్..ఇక్కడ డబ్బు కట్టి సమాధులను చూస్తారు.. 15 Facts
- ప్రపంచ యుద్ధం వస్తే ఈ 10 దేశాలు చాలా సేఫ్
- Thailand 2024 : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?
- Azerbaijan అజర్ బైజాన్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? 10 టిప్స్!
- UAE: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు
- సౌదీ అరేబియాకి ఎవరైనా వెళ్లవచ్చా ? వెళ్తే ఏం చూడవచ్చు?
- Indian License : భారతీయ లైసెన్స్ ఈ 15 దేశాల్లో కూడా చెల్లుతుంది
- Oymyakon : ప్రపంచంలోనే అత్యంత చల్లని గ్రామం