Goa : గోవాకు వెళ్లే పర్యాటకులు తగ్గుతున్నారా ? 3 కారణాలు చెప్పిన ట్రావెలర్

నలుగురు ఫ్రెండ్స్ కలిసినప్పుడు అందులో ఒకతను అనే మాట “ మామా మనం నెక్ట్స్ మంథ్ Goa కు వెళ్దామా ? “ అని .

ఇది మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా చాలా సార్లు వినే ఉంటారు. నిజానికి 90వ దశకం నుంచి గోవా అనేది యూత్ ఫేవరిట్ టూరిస్ట్ డెస్టినేషన్.

చేతిలో చిల్డ్ డ్రింక్ పక్కన ఇష్టమైన వ్యక్తి లేదా తోడుగా వచ్చిన ఫ్రెండ్స్ అండ్ ఎదురుగా మిరిమిట్లు గొలిపే బీచ్. ఇవన్నీ గోవాను ఒక ఫ్యాంటసీ డెస్టినేషన్‌గా మార్చాయి.

ఎంతగా అంటే గోవాకు టూరిజం క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా టైటిల్ కూడా ఇచ్చేశారు.

కానీ ఈ పర్యాటక రాజధాని పని అయిపోయింది అంటూ ఈ మధ్య సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.

Also Read : Thailand 2024 : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?

గోవా టూరిజం పతనంపై అంటూ నెటిజెన్లు చర్చలు చేస్తున్నారు. ఈ సందర్భంగా Goa పై ఒక ట్రావెలర్ వీడియో బాగా వైరల్ అవుతోంది. గోవా టూరిజం గ్రాఫ్ తగ్గడానికి మూడు కారణాలు అంటూ తన ఎక్స్  ఖాతాలో వీడియో షేర్ చేశాడు. 

ఇందులో విశాల్ చెప్పిన మూడుకారణాలు ఇవే.

అతని మాటల్లోనే | “ భారతదేశ పర్యటక రాజధాని గోవా చాలా ఇబ్బంది పడుతోంది. టూరిజం పడిపోయింది. ముఖ్యంగా విదేశీ పర్యాటకుల సంఖ్య పడిపోతోంది. ఎందుకు ఇలా జరుగుతోంది ? మూడు కారణాలు ఉన్నాయి

  1. ఖరీదైన వ్యవహారంగా గోవా

గోవాలో పర్యాటకుల రాక తగ్గడానికి కారణం అన్నీ కాస్ట్‌లీ అవడం. విమానం నుంచి హోటల్స్, టాక్సీల నుంచి అన్నీ ఖరీదైన వ్యవహారంగా మారాయి. దాంతో చాలా మంది సౌత్ ఈస్ట్ నేషన్స్ వెళ్తున్నారు.

  1. బీచుల్లో అపరిశుభ్రత 

రెండవ కారణం గోవా బీచుల్లో అపరిశుభ్రంగా మారడం. అక్కడ చెత్త పేరుకుపోవడం. దీంతో పాటు బీచు పరిసరాల్లో అక్రమ కట్టడాలు పెరగడం. మూడవ కారణం వీధికుక్కల సంఖ్య బాగా పెరిగిపోవడం. ప్రతి చోటా వీధి  కుక్కలు కనిపిస్తున్నాయి.

  1. సర్వీస్ క్వాలిటీ

ఆతిథ్య పరిశ్రమలో సర్వీస్ అనేది అతి ముఖ్యం. చక్కని సేవల కోసమే చాలా మంది గోవాకు వస్తుంటారు. అయితే గోవాలో ఇప్పుడు సర్వీస్ క్వాలిటీ బాగా పడిపోయింది. 

గోవాాలోని హోటల్స్‌లో వారు ఇచ్చే సర్వీస్ చూసుకుంటే ఇలాంటి హోటల్ ముంబైలో ఉంటే అది మూడు నెలలకు మించి నడవదు.

Also Read | Manali : మనాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి ? ఎక్కడ ఉండాలి ? ఏం చూడాలి?

నిజానికి గోవాలో మీరు ఎక్కువ కష్డపడకుండా ధనవంతులు అవుతారు. ఇప్పుడు అదే అసలు సమస్యగా మారింది. గోవా ఎంత కాస్ట్‌లీ గా మారింది అంటే పర్యాటకులు తాము చెల్లించిన డబ్బుకు అసలు విలువ కావాలి అని డిమాండ్ చేస్తున్నారు. అండ్ గోవా ఫేయిల్ అవుతోంది” అంటూ తన వీడియో వివరించాడు విశాల్ భార్గవ.

Watch

  విశాల్ భరధ్వాజ్ చేసిన ట్వీట్‌కు కొంత మంది నెటిజెన్లు స్పందించారు

“ మీరు ఎంచుకున్న కోణం వింతగా ఉంది. యూకే, రష్యా వల్ల ఫారిన్ టూరిస్టులు తగ్గారు ( అక్కడి నుంచే చాలా మంది వచ్చేవారు ), ఫ్లైట్లు, క్యాబులు ఇవన్నీ ఖరీదైనవిగా మారడానికి కారణాలు స్థానికంగా డిమాండ్ బాగా పెరగడం. మీరు చెప్పిన కారణాలేవీ సరైనవి కావు” 

అని ఉత్కర్ష్ పూలీ అనే ఎక్స్ యూజర్ కామెంట్ చేశారు.

గోవా విమాన టికెట్ల ధరల గురించి కూడా విశాల్ ప్రస్తావించాడు కాబట్టి దీనినై ఒక యూజర్ తన అభిప్రాయం తెలిపాడు. అతను..

20 ఏళ్ల క్రితం ఢిల్లీ నుంచి గోవా వెళ్లడానికి విమాన టికెట్ ధర రూ. 25000 కాగా నేడు అది రూ. 6000 తగ్గింది అని కామెంట్ చేశాడు 

పెరుగుతోంది అన్న మినిస్టర్

గోవా టూరిజంపై వస్తున్న వార్తలపై గోవా టూరిజం శాఖ కొంత కాలం క్రితమే స్పందించింది. గోవాకు వచ్చే విదేశీ టూరిస్టుల సంఖ్య చాలా పెరిగింది అని తెలిపింది. 2023 లో 4,50,000 మంది విదేశీయులు గోవాకు రాగా అదే 2023 లో 8 మిలియన్ల మంది భారతీయులు గోవాను సందర్షించారు అని తెలిపింది. 

గోవా టూరిజంపై చర్చలు నడుస్తున్న సమయంలోనే గోవా టూరిజం మినిస్టర్ రోహన్ కౌంటే ఒక ట్వీట్ చేశారు. అంతర్జాతీయ టూరిస్టుల సంఖ్య పెరుగుతోంది అని పోస్ట్ చేశారు. పోలాండ్ నుంచి చార్టెడ్ ఫ్లైట్‌లో టూరిస్టులు వచ్చారు అని ట్వీట్ చేశారు.

మీరు ఈ మధ్య గోవా వెళ్లారా ? మీకు ఏమనిపిస్తోంది ? కామెంట్ చేయండి

ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!