తాజ్ మహల్ సందర్శనకు వెళ్తున్న పర్యటకులకు శుభవార్త. ఒక వారం రోజుల పాటు తాజ్ మహల్‌ను ( Taj Mahal ) ఫ్రీగా చూసేయొచ్చు.
వరల్డ్ హెరిటేజ్ వీక్ 2024 లో భాగంగా ఆగ్రాలోని ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంరక్షణలో ఉన్న తాజ్ మహల్‌ను ఉచితంగా సందర్శించవచ్చు.
నవంబర్ 19వ నుంచి పర్యటకులకు వారం పాటు ఫ్రీగా తాజ్ మహల్ విజిట్ చేసే అవకాశం కల్పిస్తున్నారు
సాధారణ సమయంలో తాజ్ మహల్ చూడాలంటే సందర్శకుల నుంచి రూ.250 వసూలు చేస్తారు. కానీ నవంబర్ 19 నుంచి 25 వరకు ఈ ఫీజు కట్టే అవసరం లేదు. అయితే ప్రధాన డోమ్ చూడాలంటే మాత్రం రూ.200 కట్టాల్సిందే.
Read Also: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు
Taj Mahal లో ప్రత్యేక కార్యక్రమాలు
దీంతో పాటు తాజ్ మహల్ పరిసరాల్లో పలు రకాల ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టనున్నారు.

ఆగ్రాలో ఉన్న మరెన్నో చారిత్రాత్మక కట్టడాల గురించి కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ హెరిటేజ్ వీక్‌లో ( World Heritage Week 2024) దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఫోటో ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో రామాయణానికి సంబంధించిన ఫోటోలను ప్రేక్షకులకు చూపించనున్నారు.
గుప్తుల కాలం నుంచి నేటి వరకు అందుబాటులో ఉన్న కళాఖండాలను కూడా చూపించనున్నారు అని ఆర్కియాలజిస్టు డాక్టర్ రాజ్‌కుమార్ పటేల్ తెలిపారు.
Read Also : వంజంగి ఎలా వెళ్లాలి ? ఎలా సిద్ధం అవ్వాలి ? 10 టిప్స్ !
భారతదేశంలో ఉన్న వారసత్వ కట్టడాల గురించి అవగాహన కల్పించేందుకు ప్రతీ ఏడాది నవంబర్ 19 నుంచి 25 మధ్య వారం రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.