న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ : హైదరాబాద్ పోలీసుల 7 రూల్స్ ఇవే | Traffic Rules For Hyderabad New Year 2025 Celebrations

షేర్ చేయండి

కొత్త సంవత్సరాన్ని ( New Year 2025 ) స్వాగతించేందుకు సిద్ధం అవుతున్న హైదరాబాద్ ప్రజలు కోసం, లా అండ్ ఆర్డర్ మెయింటేన్ చేయడానికి పోలీసులు కొన్ని గైడ్‌లైన్స్ జారీ చేశారు. అవి ఇవే.

కొత్త సంవత్సరాన్నిస్వాగతం పలికేందుకు ప్రజలు చాలా ఉత్సాహంగా వేచి చూస్తుంటారు. న్యూ ఇయర్‌ను సెలబ్రేట్ చేసుకోవడానికి చాలా మంది వీధుల్లోకి, ప్రధాన మార్కెట్‌లోకి వస్తుంటారు. మీరు కూడా ఈ లిస్టులో ఉంటే ఈ ట్రాఫిక్ రూల్స్ ( Traffic Rules ) గురించి తెలుసుకోండి. లేదంటే చట్టపరమైన చిక్కుల్లో పడతారు.

Prayanikudu WhatsApp2
| ప్రతిరోజు వాట్స్ అప్ ద్వారా ట్రావెల్ కంటెంట్ తెలుగులో పొందాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి

కొత్త సంవత్సరం వేడుకలు ( New Year 2025 ) వేడుకలు సెలబ్రేట్ చేసే వారి కోసం, లా అండ్ ఆర్డర్ మెయింటేన్ చేయడానికి పోలీసులు కొన్ని గైడ్‌లైన్స్ జారీ చేశారు. అవి ఇవే.

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ రూల్స్ | Traffic Rules For Hyderabad New Year 2025

1. తాగి బండి నడపొద్దు : డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారిపై పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోనున్నారు. మద్యం మత్తులో ఉండి బండి నడిపితే రూ.10,000 జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది.

2. చెక్ పాయింట్స్ : న్యూ ఇయర్ సందర్భంగా పోలీసులు చెక్ పాయింట్స్‌ను ఏర్పాటు చేస్తారు. ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తారు. అంటే బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ . ఒక వేళ మీరు మద్యం తీసుకుంటే మాత్రం క్యాబ్ లేదా ఆటోలో మీ గమ్యస్థానానికి చేరుకోండి. ఇప్పుడే కాదు మందు తాగి బండిని ఎప్పుడూ నడపకండి. ఎందుకంటే వెనక సీట్లో యముడు కూర్చునే అవకాశం ఉంది.

3. ట్రాఫిక్ నిర్వహణ : న్యూ ఇయర్ సెలబ్రేట్ ( Hyderabad New Year Celebrations ) చేసే ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ ఉండే అవకాశం ఉంది. అందుకే అధికారులు కొన్ని రూల్స్‌తో పాటు ట్రాఫిక్‌ను వేరే మార్గంలోకి డైవర్ట్ చేసే అవకాశం ఉంది. అందుకే ఎప్పటికప్పుడు పోలీసు శాఖ నుంచి అప్‌డేట్స్ తెలుసుకోండి.

new year 2025
కొత్త సంత్సరం సేఫ్‌గా ప్రారంభించండి

4. సీట్‌ బెల్టు, హెల్మెట్ వాడండి : కారు నడిపితే సీటు బెల్టు, బైక్ నడిపితే హెల్మెట్ తప్పనిసరి. లేదంటే ఫైన్ పడుతుంది.

5. పార్కింగ్ నియమాలు : హైదరాబాద్ పోలీసులు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసే వారి కోసం కొన్ని పార్కింగ్ కేంద్రాలను సూచించారు. అక్కడే మీ బండిని పార్క్ చేయండి. వేడుకల సమయంలో అక్రమ పార్కింగ్ చేస్తే మీ బండిని ట్రాఫిక్ పోలీసులు ఠానాకు తరలిస్తారు లేదా ఫైన్ వేస్తారు.

6. పిల్లలు జాగ్రత్త : కారులో వెళ్లే సమయంలో పిల్లలకు కూడా సీటు బెల్టు వేయడం తప్పనిసరి. ఇది వారిని సురక్షితంగా ఉంచుతుంది.

7. పాదచారుల రక్షణ : రోడ్డును దాటాల్సి వస్తే చూసి దాటండి. అలాగే ఎవరైనా రోడ్డు దాటుతుంటే చూసి బండిని నడపండి.

పోలిస్ అధికారులు ( Hyderabad Traffic Police ) జారీ చేసిన ఈ రూల్స్ అనేవి అందరి మంచి కోసమే అని గుర్తుంచుకోండి. కొత్త సంవత్సరం ( New Year 2025 ) అందరం సెలబ్రేషన్స్ గురించే ఆలోచిస్తాం. అందుకే పోలీసులు మన సేఫ్టీ గురించి ఆలోచిస్తూ ఈ మార్గదర్శకాలు జారీ చేశారు. వీటిని పాటించి వారికి కూడా హ్యాప్పీ న్యూ ఇయర్ ( Happy New Yea 2025 ) చెబుతూ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించండి.

గమనిక: ఈ వెబ్‌సైట్లో ప్రకటనలు కూడా ఉంటాయి. ముఖ్యంగా గూగుల్ యాడ్స్ ద్వారా ఈ ప్రకటనలు మీకు కనిపిస్తాయి. ఈ ప్రకటనలే మాకు ఆధారం. ఇందులో కొన్ని ప్రకటనలపై మీరు క్లిక్ చేస్తే మాకు ఆదాయం వస్తుంది.

Watch More Vlogs On : Prayanikudu

ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

Most Popular Stories

ప్రపంచ యాత్ర గైడ్

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!