వాటికన్ సిటి చాలా మంది డ్రీమ్ డెస్టినేషన్. అతి ప్రాచీన నగరం రోమ్ ( Rome ) మధ్యలో ఉన్న ఈ దేశ చరిత్ర, ఆర్ట్, నిర్మాణ శైలి, సంప్రదాయం ఇవన్నీ కూడా ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. ఈ పోస్టులో వాటికన్ సిటీ ( Vatican City ) ఎలా వెళ్లాలి, ఏం చూడాలి, ఎక్కడ ఉండాలి, ఏం తినాలి , అక్కడికి వెళ్లాలి అంటే ఎలాంటి వీసా ఉండాలి ఇలాంటి ప్రశ్నలకు మీకు సమాధానం దొరుకుతుంది.
వాటికన్ సిటీ అనేది క్రైస్తవ మతస్థులకు ఆధ్మాత్మిక కేంద్రమే కాదు, రోమన్ క్యాథలిక్ చర్చ్ అడ్మినిస్ట్రేటివ్ సెంటర్ కూడా. ఈ సిటీ గురించి కొన్ని క్విక్ ఫ్యాక్ట్స్.
ముఖ్యాంశాలు
వాటికన్ సిటీ గురించి… Basic Facts About Vatican City
- దేశం పేరు : వాటికన్ సిటీ ( హోలీ సీ )
- విస్తీర్ణం : 44 హెక్టార్లు ( 0.17 స్క్వేర్ మీటర్లు )
- జనాభా: 800 మంది
- భాషలు : ఇటాలియన్, లాటిన్ ( అధికారిక భాష) , ఫ్రెంచ్, స్పానిష్, ఇంగ్లిష్
- కరెన్సీ : యూరో (€)
- టైమ్ జోన్ : సెంట్రల్ యూరోపియన్ టైమ్ ( UTC+1, UTC+2 )
వాటికన్ సిటీ గురించి బేసిక్ పాయింట్స్ తెలుసుకున్నారు కదా…ఇప్పుడు ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గురుద్వార Hemkund Sahib ట్రావెల్ గైడ్ , 10 Tips and Facts
ఆసక్తికరమైన విషయాలు | Interesting Facts About Vatican City
- వాటికన్ సిటీ అనేది ఒక సిటీనా లేక దేశమా ? | Is Vatican City A Country ? : వాటికన్ సిటీ పేరుకే సిటీ కాని ఇది ఒక దేశం. పైగా ఇది ఇటలీలోని రోమ్ నగరం మధ్యలో ఉండే చిన్న దేశం. చాలా విచిత్రంగా ఉంది కదా.
- మరో విషయం తెలుసా ? ఈ దేశం విస్తీర్ణం అర కిలో మీటర్ కూడా ఉండదు.
- పోప్‌తో కలిపి వాటికన్ సిటీ జనాభా ( Vatican City Population ) 800 మంది మాత్రమే.
- ఇది ప్రపంచంలోనే అతి చిన్న దేశం.
- వాటికన్ సిటీ క్యాథలిక్ చర్చు అడ్మినిస్ట్రేషన్‌కు కేంద్రం. దీనిని పోప్ నాయకత్వం వహిస్తారు.
- వాటికన్ సిటీలో సెయింట్ బాసిలికా చర్చి ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద చర్చిలలో ఒకటి.
- వాటికన్ సిటీకి సైన్యం లేదు. 16వ శతాబ్దం నుంచి స్విస్ గార్డులే ఈ నగరానికి, పోప్‌కు రక్షణ ఇస్తున్నారు.
- వాటికన్ సిటీ సొంతంగా నాణేలను జారీ చేస్తుంది.
- ఇక్కడికి వచ్చే ప్రయాణికులు ఇక్కడ నివసించలేదు. వారు చూసి వెళ్లిపోవచ్చు అంతే.
వాటికన్ సిటీ చరిత్ర | Vatican City History
వాటికన్ సిటీ చరిత్ర తెలుసుకోవాలి అనుకుంటే ముందు మనం 4వ శతాబ్దానికి చెందిన కాంస్టెంటైన్ చక్రవర్తి సమయానికి వెళ్లాలి. ఇక్కడ ఏసుక్రీస్తు 12 మంది శిష్యులలో( Jesus Christ Apostles ) ఒకరు అయిన సెయింట్ పీటర్ సమాధి ఉంటుంది. దీనిని సెయింట్ పీటర్ బాసిలికా ( St. Peter Basilica ) అని కూడా అంటారు. ఈ బాసిలికా చుట్టూ వాటికన్ సిటీ ఏర్పడింది.
వాటికన్ సిటీ శతాబ్దాలుగా అద్భుతమైన కళలకు, సంప్రదాయానికి వేదికగా నిలిచింది. 1929 లో ది లాటెరన్ ట్రీటీ వాటికన్ సిటీని అధికారికంగా స్వతంత్య్ర రాజ్యంగా గుర్తించింది.
వాటిక్ సిటీ ఎప్పుడు వెళ్లాలి ? | Best Time To Visit Vatican City
వాటికన్ సిటీకి సంవత్సరం పొడవునా పర్యాటకుల తాకిడి ఉంటుంది. అయితే ఏప్రిల్ నుంచి జూన్ సమయంలో ఇక్కడికి వెళ్లడం బెస్ట్ . ఎందుకంటే ఈ సమయంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. దీంతో పాటు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్యలో కూడా వెళ్లవచ్చు. ఈ సమయాల్లో వెళ్తే మీరు రద్దీ నుంచి తప్పించుకోవచ్చు.
అయితే మీరు టూరిస్టుగా కాకుండా ఆధ్యాత్మిక అనుభూతి కోసం వెళ్లాలి అనుకుంటే మాత్రం డిసెంబర్ నెలలో వెళ్తే బెస్ట్. క్రిస్మస్ ( Christmas In Vatican City ) సందర్భంగా వాటికన్ సిటీ సరికొత్తగా, అందంగా కనిపిస్తుంది. ఇక్కి డెకరేషన్, లైట్లు ఇవన్నీ కలిపి ఒక మ్యాజికలర్ వరల్డ్‌లో ఉన్న అనుభూతిని కలిగిస్తాయి.
ఇది కూడా చదవండి : Valley Of Flowers : వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఎలా వెళ్లాలి? ఎప్పుడు వెళ్లాలి ?
( మిగితాది నెక్ట్స్ పేజీలో )