Vatican City : 15 నిమిషాల్లో ఈ దేశం మొత్తం తిరిగొచ్చు, జనాభా కన్నా పర్యాటకులే ఎక్కువ
హైదరాబాద్ నుంచి వాటికన్ సిటీ ప్రయాణం
How To Travel Vatican City From Hyderabad : వాటికన్ సిటీకి సొంత ఎయిర్‌పోర్టు లేదు. ఎందుకంటే ఒక మీడియం సైజ్ కమర్షియల్ ఎయిర్‌పోర్టుకు కనీసం 400 నుంచి 2000 హెక్లార్ల స్థలం కావాలి. వాటికన్ సిటీ విస్తీర్ణమే 44 హెక్లార్టు. కాబట్టి ఏ రకంగా చూసినా విమానాశ్రయం సాధ్యం కాదు. అయితే మనం వెళ్లాలనుకుంటే మనల్ని ఎవరు ఆపుతారు చెప్పండి. ఇతర మార్గాలు చూద్దాం రండి.
- హైదరాబాద్ నుంచి విమానంలో : ముందుగా మీరు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ( Rajiv Gandhi International Airport ) నుంచి ఇటలీలోని రోమ్ నగరంలో ఉన్న లియోనార్డో డా వించి అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇక్కడికి కూడా డైరక్టుగా వెళ్లలేరు.

ముందుగా మీరు దోహా, దుబాయ్ లేదా జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ చేరుకుని అక్కడి నుంచి రోమ్ చేరుకోవచ్చు. ఈ పోస్టు పబ్లిష్ చేసే సమయానికి ఛీపెస్ట్ ఫ్లైట్ వచ్చేసి మస్కత్కు ( Muscat ) చెందిన సలామ్ ఎయిర్ ఉంది. ఇక్కడికి మీరు మూడున్నర గంటల్లో చేరుకోవచ్చు.
అక్కడ మీరు 9 గంటలు వేచి ఉండాల్సి ఉంటుంది. తరువాత మస్కత్ నుంచి రోమ్‌లోని ఫుమిచినో ( Fiumicino ) కు విమానంలో వెళ్లాలి. ఇది సుమారు 7 గంటల ప్రయాణం. మొత్తానికి 9+3.30+7.30 =20 గంటల ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
- రోమ్ నుంచి వాటికన్ సిటీ | Rome To Vatican City Trip : రోమ్‌లోని ఫుమిచినో నుంచి మీరు లియోనార్డో ఎక్స్‌ప్రెస్ ట్రైన్లో టెర్మినీ స్టేషన్ చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి మెట్రో లేదా ట్యాక్సీలో వాటికన్ సిటీ చేరుకోవచ్చు.
ఎలాంటి వీసా కావాలి ?
Visa Requirement for Vatican City Tour: వాటికన్ సిటీకి వెళ్లాలి అంటే మీ వద్ద షెంజెన్ వీసా ( Schengen Visa ) ఉండాలి. ఈ వీసా ఉంటేనే మీరు వాటికన్ సిటీలోకి అడుగుపెట్టగలరు. దీనిని హైదరాబాద్‌లోని ఇటాలియన్ కాన్యులేట్లో మీరు అప్లై చేసుకోచ్చు.

వాటికన్ సిటీలో ఏం చూడాలి ? | Places To visit In Vatican City
1.సెయింట్ పీటర్స్ బాసిలికా : St. Peter’s Basilica : ప్రపంచంలోనే అతి పెద్ద చర్చిలలో ఇది కూడా ఒకటి. ఇది ఒక ఆర్కిటెక్చురల్ అద్భుతం అని చెప్పవచ్చు. ఇక్కడి నుంచి మొత్తం దేశాన్ని చూడొచ్చు.
2.వాటికన్ మ్యూజియం: Vatican Museum : ప్రపంచంలో ఎక్కడా లేనన్నిఆర్ట్ కలెక్షన్ ఇక్కడ మీరు చూడవచ్చు. ఇక్కడ మీరు రాఫేల్ రూమ్స్, సిస్టిన్ ఛాపెల్ ఇలా ఎన్నో చూడవచ్చు. ఈ మ్యూజియం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు
- ఈ మ్యూజియానికి మొత్తం 2700 తాళాలు ఉంటాయి.
- ఈ తాళాలను 10 మంది మెయింటేన్ చేస్తారు. వీరిని కీ కీపర్స్ ( Vatican Key Keepers ) అంటారు.
- ఇందులో ఐదు మంది మ్యూజియంకు తాళాలు వేస్తారు. మరో ఐదు మంది తాళాలు తీస్తారు.
- తాళాలు వేయడానికి 90 నిమిషాలు, తీయడానికి 90 నిమిషాల సమయం పడుతుంది.
- ఈ మ్యూజియం చూసేందుకు గంటల తరబడి నిలబడాల్సి ఉంటుంది. అందుకే అడ్వాన్స్గానే టికెట్లు కొంటే బెటర్.
- ఇది కూడా చదవండి :: Christmas in Kerala : క్రిస్మస్ హాలిడేస్‌లో కేరళలో చూడాల్సిన ప్రదేశాలు
3.సిస్టైన్ ఛాపెల్ | Sistine Chapel : సిస్టైన్ చాపెల్ అనేది వాటికన్ య్యూజియంలో భాగం అయినప్పటికీ దిని గురించి మళ్లీ ప్రత్యేకంగా చెప్పాల్సిందే అనిపించింది. ఎందుకంటే ఇక్కడ మైకలాంజిరో ( Michelangelo ) డిజైన్ చేసిన అద్భుతమైన సీలింగ్ ఉంటుంది. ఇది ఎంత అందంగా చూడండి

4.వాటికన్ గార్డెన్స్ | Vatican Gardens : వాటికన్ సిటీ గార్డెన్స్ చూడాలంటే మీరు టూరిస్టు గైడు ద్వారా ముందే బుక్ చేసుకోవాలి..ఇది సగం వాటికన్ సిటీని కవర్ చేస్తుంది. ఇక్కడ మీకు రకరకాల మొక్కలతో పాటు అద్భుతమైన శిల్పాలు కనిపిస్తాయి.
5.సెయింట్ పీటర్స్ స్వ్కేర్ | St. Peter’s Square
ఇది సెయింట్ పీటర్స్ స్క్వేర్ ముందు ఉన్న అద్భుతమైన భవనాల సమూహం. దీనిని 16వ శతాబ్దానికి చెందిన అద్భుతమైన శిల్పకారుడు గియాన్ లోరెన్సో బెర్నినీ ( Gian Lorenzo Bernini ) డిజైన్ చేశాడు. మంచి ఫోటలు తీసే స్పాట్ ఇది. ఇక్కడ సన్‌రైజ్ అండ్ సన్‌సెట్ చాలా అందంగా ఉంటాయి.
వాటికన్ సిటీలో చేయాల్సిన పనులు | Things To Do In Vatican City
- పపాల్ ఆడియెన్స్ | Papal Audience : మీరు బుధవారం రోజు వాటికన్ సిటీకి వెళ్లేలా ప్లాన్ చేయండి. ఎందుకంటే ఈ రోజు పోప్ సాధారణ ప్రజల మధ్యలోకి వస్తారు. అయితే మీరు ముందే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

- అపోస్టాలిక్ ప్యాలెస్ | Apostolic Palace : ఇది పోప్ ( Pope ) అధికారిక నివాసం. ఇందులో వాటికన్ మ్యూజియమ్స్, వాటికన్ గార్డెన్స్ ఉంటాయి.
- టిెబర్ నది | Tiber River : వాటికన్‌కు సమీపంలో ఉన్న టిబర్ నది నుంచి మీరు వాటికన్ సిటీని, చారిత్రాత్మక రోమ్ నగరాన్ని చూడవచ్చు
ఏం తినాలి ?
What to Eat In Vatican City: వాటికన్ సిటీకి సొంత ఫ్లేవర్ ఫుడ్ లేదు. అయితే మీరు ఇక్కడ ఇటాలియన్ ఫుడ్ ఎంజాయ్ చేయవచ్చు. ఇందులో కొన్ని మీరు కొన్ని తప్పకుండా ట్రై చేయండి.
- పాస్తా అలా కెర్బోనారా | Pasta alla Carbonara : ఇది రోమన్ క్లాసిక్ డిష్. ఇందులో స్పగెటీ, ఎగ్స్, చీజ్, పెప్పర్‌తో పాటు పాన్‌సెట్టా ఉంటుంది. ఇది మీకు టిబేరియన్ ఐలాండ్ వద్ద లభిస్తుంది.
- సుప్లీ | Suppli: ఫ్రైడ్ రైస్ బాల్స్‌లో మోజెరెల్లా ఫిల్ చేసి సర్వ్ చేస్తారు. రోమ్‌లో ( Food In Rome ) చాలా పాపులర్ డిష్ ఇది.
- పిజ్జా అల్ టగాలియో | Pizza al Tagalio : ఒక పెద్ద పిజ్జాను తినలేని వారికి ముక్కలు ముక్కలుగా వివిధ రకాల పిజ్జాలు అందిస్తారు. ఫాస్ట్ ఫుడ్ లాంటిదే ఇది.
- గెలాటో | Gelato : ఇది ఒకరకమైన ఐస్‌క్రీమ్. దీనిని దాదాపు ప్రతీ చోట చూస్తారు.
- టిరామిసు | Tiramisu : ఇది ఒక కాఫీ ఫ్లేవర్డ్ డెజర్ట్. చాలా రెస్టారెంట్స్‌లో ఇది లభిస్తుంది.
- ఇది కూడా చదవండి : ఈ రాష్ట్రంలో ఒక్క రైల్వే స్టేషన్ కూడా లేదు..ఏ రాష్ట్రమో తెలుసా?
( మిగితాది నెక్ట్స్ పేజీలో )