Indian Railways : ఆ రైలులో ప్రయాణానికి టికెట్ అక్కర్లేదు.. మీరు ఎప్పుడైనా వెళ్లవచ్చు..75ఏళ్లుగా ఫ్రీ సర్వీస్
Indian Railways : టికెట్ లేకుండా రైలులో ప్రయాణించడం చట్ట ప్రకారం నేరం. కానీ, భారతీయ రైల్వేలో ఒక ప్రత్యేకమైన రైలు ఉంది. అందులో ప్రయాణించడానికి మీకు టికెట్ అవసరం లేదు. ఎందుకంటే ఆ రైలులో ప్రయాణం పూర్తిగా ఉచితం. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఆ రైలు ఎక్కడ ఉంది, దాని విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
75 ఏళ్లుగా కొనసాగుతున్న ఉచిత సేవ
భారతీయ రైల్వేలో ప్రయాణం చాలామందికి ఇష్టమైనది. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం వెళ్లవచ్చు. అయితే, కొన్ని సందర్భాల్లో టికెట్ లేకుండా ప్రయాణిస్తే జరిమానా చెల్లించాల్సి వస్తుంది.. లేకపోతే జైలుకు కూడా వెళ్లాల్సి ఉంటుంది. కానీ, భారతీయ రైల్వేలో 75 ఏళ్లుగా ఉచితంగా ప్రయాణించే ఒక అద్భుతమైన రైలు ఉంది.

భారతదేశంలో ఒక ప్రత్యేక రైలు
ఆ రైలు పేరు భాక్రా-నంగల్ రైలు. ఇది పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల మధ్య నడుస్తుంది. ఈ రైలులో ప్రయాణించడానికి మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది 13 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఈ రైలులో ప్రయాణించడానికి ప్రతిరోజూ వందల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలోని భాక్రా నంగల్ డ్యామ్ అందాలను చూడటానికి ఈ రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు.
ఇది కూడా చదవండి : UAE: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు
అందమైన ప్రకృతి మధ్య ప్రయాణం
ఈ రైలు సట్లెజ్ నది, శివాలిక్ కొండల మధ్య ప్రయాణిస్తుంది. ఇక్కడి ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. అందుకే చాలా సినిమాలు కూడా ఇక్కడ షూటింగ్ జరుపుకుంటాయి. ఈ రైలు మార్గంలో మూడు సొరంగాలు (టన్నెల్స్), ఆరు స్టేషన్లు ఉన్నాయి. ఈ రైలులోని బోగీలు చెక్కతో తయారు చేయబడ్డాయి. మొదటగా ఇది మూడు బోగీలతో 1948లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఈ రైలులో ప్రయాణం పూర్తిగా ఉచితం.
ఇది కూడా చదవండి : ప్రపంచ యుద్ధం వస్తే ఈ 10 దేశాలు చాలా సేఫ్
నిర్మాణ కార్మికుల కోసం మొదలైన సేవ
ఈ రైలు మొదట ఆవిరి ఇంజిన్తో నడిచేది. ఆ తర్వాత 1953లో డీజిల్ ఇంజిన్లను అమర్చారు. ఈ రైలును భాక్రా బోర్డ్ నిర్వహిస్తుంది. వాస్తవానికి, ఈ రైలును మొదటగా భాక్రా నంగల్ డ్యామ్ నిర్మాణ సమయంలో, కార్మికులు, ఉద్యోగుల కోసం, అలాగే నిర్మాణ సామాగ్రిని తరలించడానికి ఉపయోగించారు. డ్యామ్ నిర్మాణం పూర్తైన తర్వాత, ఈ రైలు సేవను పర్యాటకుల కోసం ఉచితంగా కొనసాగించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ ఉచిత సేవ వల్ల రోజుకు సుమారు 800 మంది ప్రయాణిస్తున్నారు. ఈ రైలు భారతీయ రైల్వే చరిత్రలోనే ఒక ప్రత్యేకమైన, అరుదైన ఉదాహరణగా నిలిచిపోయింది.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.