Train Ticket : ట్రైన్ టికెట్ ఇంట్లో వాళ్లకి ఇచ్చారా? జాగ్రత్త.. జైలుకెళ్లడం పక్కా.. రైల్వే రూల్స్ బ్రేక్ చేస్తే అంతే సంగతులు
Train Ticket : ట్రైన్ టికెట్ బుక్ చేసిన తర్వాత, అనుకోని కారణాల వల్ల మీరు ప్రయాణం చేయలేకపోతే మీ కుటుంబంలో వేరే వాళ్లకు ఆ టికెట్ ఇచ్చి పంపించొచ్చా? ఈ సందేహం చాలామందికి ఉంటుంది. కానీ రైల్వే నిబంధనల ప్రకారం.. టికెట్‌పై ఉన్న వ్యక్తి మాత్రమే ప్రయాణించాలి. ఒకవేళ ఇతరులు ప్రయాణిస్తే ఏమవుతుంది? దీనికి ఉన్న రైల్వే నియమాలు ఏంటి? తెలుసుకోవాలంటే ఈ వార్తను పూర్తిగా చదవండి.
రైల్వే రూల్స్ ఏం చెబుతున్నాయి?
రైల్వే చట్టం చాలా స్పష్టంగా ఉంది. టికెట్‌పై ఎవరి పేరు ఉంటే వారే ప్రయాణించాలి. ఒకవేళ టికెట్‌పై ఉన్న వ్యక్తికి బదులుగా ఇంకొకరు ప్రయాణిస్తే, వారిని టికెట్ లేని ప్రయాణికుడిగా పరిగణిస్తారు. భారత రైల్వే చట్టం 1989 ప్రకారం, ఇతరుల టికెట్‌పై ప్రయాణించడం చట్టరీత్యా నేరం. ఈ నేరానికి జరిమానా లేదా జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. జరిమానా మొత్తం రైలు క్లాస్ మరియు ప్రయాణించే దూరం ఆధారంగా నిర్ణయించబడుతుంది. అంతేకాకుండా, టికెట్ కొనుగోలుదారుపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు.
ఇది కూడా చదవండి : Peaceful Countries: ప్రపంచంలోని టాప్ 10 శాంతియుత దేశాలు

కుటుంబ సభ్యులకు టికెట్ ఎలా బదిలీ చేయాలి?
మీ ట్రైన్ టికెట్‌ను మీ కుటుంబ సభ్యుల (తల్లి, తండ్రి, సోదరుడు, సోదరి, కొడుకు, కూతురు, భార్య, భర్త) పేరుకు బదిలీ చేయాలనుకుంటే, ఒక మార్గం ఉంది. రైలు బయలుదేరడానికి కనీసం 24 గంటల ముందు మీరు రైల్వే రిజర్వేషన్ కౌంటర్‌కు వెళ్లాలి. అక్కడ మీ ఒరిజినల్ టికెట్, మీ ఐడీ కార్డు, సంబంధిత కుటుంబ సభ్యులతో మీకున్న సంబంధాన్ని నిరూపించే పత్రాలను (ఉదాహరణకు, ఆధార్ కార్డు, పాన్ కార్డు) సమర్పించాలి. ఆ తర్వాత రైల్వే అధికారులు మీ టికెట్‌ను మీ కుటుంబ సభ్యుల పేరుకు బదిలీ చేస్తారు. ఒకవేళ మీరు ఈ ప్రక్రియను పాటించకుండా టికెట్‌ను ఇతరులకు ఇస్తే, ఆ టికెట్ రద్దు అయినట్లే పరిగణించబడుతుంది.
ఇది కూడా చదవండి : Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు
ప్రయాణికులకు రైల్వే సూచనలు
- మీ టికెట్‌ను ఎవరికీ ఇవ్వవద్దు.
- ఒకవేళ మీరు ప్రయాణించలేకపోతే, టికెట్‌ను రద్దు చేయడం లేదా రైల్వే అధికారులను సంప్రదించి ప్రయాణ తేదీని మార్చడం మంచిది.
- ఈ నియమాలు పాటించడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు. లేదంటే, రైల్వే శాఖ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
టీటీఈ (TTE), ఆర్పీఎఫ్ (RPF) బాధ్యతలు
ట్రైన్లో ప్రయాణించే ప్రతి ఒక్కరి టికెట్‌ను టీటీఈ తనిఖీ చేస్తారు. ఇతరుల టికెట్‌పై ప్రయాణిస్తున్న వారిని గుర్తించి, వారికి జరిమానా విధిస్తారు. అవసరమైతే, చివరి స్టేషన్లో ఆర్పీఎఫ్ సిబ్బందికి ఫిర్యాదు చేసి, తదుపరి చర్యల కోసం సూచనలు అందిస్తారు.
వేరే వారి టికెట్‌పై ప్రయాణించడం అనేది అనవసరమైన రిస్క్. అత్యవసర పరిస్థితుల్లో టికెట్‌ను ఇతరులకు ఇచ్చే బదులు, దాన్ని రద్దు చేయడం లేదా రీషెడ్యూల్ చేయడం ఉత్తమం. ఇది మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు కూడా భద్రతను ఇస్తుంది.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.