TTD Vada : ఇక రాత్రి భోజనంలో కూడా వడ ప్రసాదం పంపిణి
TTD Vada : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భక్తులకు అందించే భోజన విషయంతో టిటిడి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. వారికి నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించే దిశలో మరో కీలక నిర్ణయం తీసుకుంది .
ప్రస్తుతం మధ్యాహ్న భోజన సమయంలో అందిస్తున్న వడలను ఇకపై రాత్రి భోజన సమయంలో కూడా అందించనున్నారు.

👆 తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో (Tarigonda Vengamamba Anna Prasada Kendram) ఈ కొత్త సేవలను తితిదే చైర్మన్ బీఆర్ నాయుడు ప్రారంభించారు. స్వామివారికి, అమ్మవార్ల చిత్రపటానికి పూజలు నిర్వహించిన అనంతరం వడ ప్రసాదాన్ని పంపిణి మొదలు పెట్టారు.

👆 పూజ అనంతరం భక్తులకు వడలను స్వయంగా వడ్డించిన తితిదే (Tirupati Tirumala Devasthanams) చైర్మన్.

👆 ఈ సమయంలో భక్తుతో మాట్లాడి వారి అభిప్రాయం కూడా తెలుసుకున్నారు.
- ఇది కూడా చదవండి : వాట్సాప్లో టీటీడీ సేవల ఫిర్యాదు…క్యూఆర్ కోడ్ లాంచ్ చేసిన దేవస్థానం | TTD WhatsApp Feedback

👆వడలను రుచి చూసిన భక్తుల ముఖాల్లో సంతృప్తి, సంతోషం కనిపించింది.

👆 భక్తుల కోసం ప్రతీ రోజు 70,000 నుంచి 75,000 వరకు వడలను TTD Vada Preparation) తయారు చేస్తున్నారు. ఇందులో శెనగపప్పు, పశ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, కరివేపాకు వేసి రుచికరంగా సిద్ధం చేస్తున్నారు.

👆 ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 వరకు కూడా ఈ వడలను అన్న ప్రసాదంతో పాటు భక్తులకు పంపిణీ చేయనున్నారు.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.