కుంభ మేళాలో తొలిసారి అండర్ వాటర్ డ్రోన్..ఎలా పని చేస్తుందంటే… | Water Drone In Maha Kumbh Mela 2025

షేర్ చేయండి

మహాకుంభ మేళాలో రక్షణ విషయంలో పోలీసు యంత్రాంగం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. మహాకుంభమేళా ( Maha Kumbh Mela 2025 ) జరిగే ప్రయాగ్ రాజ్‌లో అండర్ వాటర్ డ్రోన్లను ప్రవేశపెట్టింది యూపీ పోలీసు శాఖ. ఈ డ్రోన్లు నీటిలోపల ఉన్న వస్తువులను గుర్తించగలవు. ప్రాదేశిక్ ఆర్మడ్ కాంస్టాబులరీ, వాటర్ పోలీసు సంయుక్తంగా ఈ డ్రోన్లను నిర్వహించనున్నారు.

Prayanikudu WhatsApp2
ప్రతిరోజు వాట్స్ అప్ ద్వారా ట్రావెల్ కంటెంట్ తెలుగులో పొందాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి | If You Want to Get Travel & Tourism Updates On Your WhatsApp Click Here

ప్రయాగ్ రాజ్ ( Prayagraj ) ఈస్ట్ జోన్ పీఏసీ ఐజీ రాజీవ్ నరైన్ మిశ్రా ఈ అండర్ వాటర్ డ్రోన్ టెస్టింగ్ విజయవంతంగా పూర్తి అయింది అని ఒక వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. “ఈ కుంభమేళా ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించే విధంగా ఆధునాతన సాంకేతికతను వినియోగిస్తున్నాము.ఈ అండర్ వాటర్ డ్రోన్ వల్ల నీటిలోపల ఉన్న వ్యక్తులను, వస్తువులను గుర్తించగలం. ఏమైనా అవసరం అనిపిస్తే వెంటనే స్పందించే అవకాశం ఉంటుంది” అని నరైన్ మిశ్రా తెలిపారు.

మహా కుంభ మేళాలో కీలక తేదీలు | Maha Kumbh Mela 2025 Dates

మహాకుంభ మేళాలో పాల్గొనాలి అనేది ప్రతీ హిందువు కల. 2025 జనవరి 13వ తేదీన పౌష్ స్నానంతో ప్రారంభం కానున్న మహాకుంభ మేళా ఫిబ్రవరి 26 మహాశివరాత్రి వరకు కొనసాగనుంది.

మహాకుంభ మేళా 2025 ముఖ్యమైన తేదీలు | Maha Kumbh Mela 2025 Key Dates
  • 2025 జనవరి 13 : పౌష్ పూర్ణిమ
  • 2025 జనవరి 14 : మకర సంక్రాంతి ( తొలి రాజ స్నానం- First Shahi Snan)
  • 2025 జనవరి 29 : మౌని అమావాస్య ( రెండవ రాజస్నానం- second shahi snan )
  • 2025 ఫిబ్రవరి 03 : వసంత పంచమి ( మూడవ రాజస్నానం- Third shahi snan )
  • 2025 ఫిబ్రవరి 12 : మాఘ పౌర్ణమి
  • 2025 ఫిబ్రవరి 26 : మహా శివరాత్రి ( చివరి స్నానం -Final Snan )

మహాకుంభ మేళాకు సర్వం సిద్ధం 2025


Arrangements for Maha Kumbh 2025 : యూపీ ప్రభుత్వం మహాకుంభ మేళా 2025 ను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది . భారతీయ సంస్కృతిని, ఆచారాలను, వైవిధ్యతను చాటే విధంగా మహా కుంభ మేళాను నిర్వహించనుంది ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ( Uttar Pradesh ) . ప్రయాగ్‌రాజ్‌లో 20 చిన్న స్టేజులు ఏర్పాటు చేసి 45 రోజుల పాటు అందులో పర్యాటకులు, భక్తులు, స్థానికుల కోసం వివిధ రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ నృత్య ప్రదర్శనలు నిర్వహించనున్నారు.

గమనిక: ఈ వెబ్‌సైట్లో ప్రకటనలు కూడా ఉంటాయి. ముఖ్యంగా గూగుల్ యాడ్స్ ద్వారా ఈ ప్రకటనలు మీకు కనిపిస్తాయి. ఈ ప్రకటనలే మాకు ఆధారం. ఇందులో కొన్ని ప్రకటనలపై మీరు క్లిక్ చేస్తే మాకు ఆదాయం వస్తుంది.

మహాకుంభమేళ కథనాలు

Watch More Vlogs On : Prayanikudu

ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
Maha Kumbh Mela Prayanikudu Special Stories

మహా కుంభ మేళా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!