Small Countries : మీకు టైమ్ తక్కువగా ఉందా? ఈ చిన్న దేశాల్లో కొన్ని గంటల్లోనే అన్నీ చూసేయొచ్చు
Small Countries : ప్రపంచంలో కొన్ని దేశాలు ఇంత చిన్నవిగా ఉంటాయి. వాటిని కేవలం ఒక్క రోజులో అంటే 24 గంటల్లో సులభంగా చూసేయవచ్చు. ఇవి విస్తీర్ణంలో చిన్నవైనప్పటికీ, ఈ దేశాల్లో చూడటానికి చాలా ప్రత్యేకమైన ప్రదేశాలు ఉన్నాయి. తక్కువ సమయంలో కూడా సులభంగా చూడగలిగే 5 చిన్న, ప్రత్యేకమైన దేశాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
వాటికన్ సిటీ
ప్రపంచంలోనే అతి చిన్న దేశం వాటికన్ సిటీ. ఇది విస్తీర్ణంలోనే కాదు, జనాభాలో కూడా చాలా చిన్నది. ఈ దేశం ఇటలీ రాజధాని రోమ్ మధ్యలో ఉంటుంది. ఇది కాథలిక్ క్రైస్తవ మతానికి ప్రధాన కేంద్రం. ఇక్కడ చూడాల్సినవి:
సెయింట్ పీటర్స్ బసిలికా : ప్రపంచంలోనే అతిపెద్ద చర్చి ఇది. మైఖేలాంజెలో, బెర్నినీ వంటి కళాకారుల అద్భుతమైన శిల్పాలు, కళాకృతులు ఇక్కడ ఉన్నాయి.
వాటికన్ మ్యూజియమ్స్ : ఈ మ్యూజియమ్‌లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన సిస్టీన్ చాపెల్ ఉంది. ఇక్కడ మైఖేలాంజెలో వేసిన అద్భుతమైన చిత్రాలను చూడవచ్చు.

వాటికన్ గార్డెన్స్ : వీటికన్ గార్డెన్స్ అందమైన తోటలు, శిల్పాలను కలిగి ఉంటాయి. వీటిలో ప్రవేశానికి ప్రత్యేక అనుమతి అవసరం. ఈ దేశాన్ని మీరు 24 గంటల్లో సులభంగా చుట్టేయవచ్చు.
మొనాకో
మొనాకో యూరప్‌లో ఫ్రెంచ్ రివేరాలో ఉన్న ఒక చిన్న దేశం. ఇది ప్రపంచంలో రెండవ అతి చిన్న దేశం. ఈ దేశం దాని రాయల్టీ, లగ్జరీ మరియు కాసినోలకు ప్రసిద్ధి. ఇక్కడ చూడాల్సినవి:
మొనాకో ప్రిన్స్ ప్యాలెస్ : ఈ ప్యాలెస్ మొనాకో రాజ కుటుంబం నివసించే ప్రాంతం. ఇక్కడ ప్రతిరోజూ జరిగే ‘గార్డ్ ఛేంజింగ్’ కార్యక్రమం పర్యాటకులను ఆకర్షిస్తుంది.
మోంటె కార్లో క్యాసినో : ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన, విలాసవంతమైన క్యాసినోలలో ఇది ఒకటి. అద్భుతమైన ఆర్కిటెక్చర్ తో పర్యాటకులను ఆకట్టుకుంటుంది.
ఓషియనోగ్రాఫిక్ మ్యూజియం : ఈ మ్యూజియం సముద్ర జీవనంపై ఆసక్తి ఉన్నవారికి స్వర్గధామం. ఇక్కడ షార్క్ లగూన్, తాబేళ్ల ద్వీపం వంటివి చూడొచ్చు. మీరు ఈ దేశాన్ని 24 గంటల్లో సులభంగా చుట్టేయవచ్చు.
నౌరూ
నౌరూ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక చిన్న ద్వీప దేశం. ఇది ప్రపంచంలో మూడవ అతి చిన్న దేశం. ఇది ప్రశాంతమైన, అందమైన ద్వీపం. ఇక్కడ మీరు నడుచుకుంటూ లేదా సైకిల్ తొక్కుతూ సుమారు 5-6 గంటల్లో మొత్తం ద్వీపాన్ని చుట్టేయవచ్చు. ఇక్కడ చూడాల్సినవి:
బౌన్స్ ఎయిర్ : ఇది ద్వీపం మధ్యలో ఉన్న అందమైన ఉప్పునీటి సరస్సు. పచ్చని చెట్లు, ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ ఉంటుంది.
ఇది కూడా చదవండి : ప్రపంచ యుద్ధం వస్తే ఈ 10 దేశాలు చాలా సేఫ్
అనీబర్ బే : ఈ ప్రశాంతమైన బేలో తెలుపు ఇసుక బీచ్‌లు, స్పష్టమైన నీరు ఉంటాయి.
లిచెన్‌స్టెయిన్
లిచెన్‌స్టెయిన్ స్విట్జర్లాండ్, ఆస్ట్రియా మధ్య ఉన్న ఒక చిన్న, అందమైన దేశం. ఈ దేశం దాని సహజ అందాలు, చారిత్రక భవనాలు, సంస్కృతికి ప్రసిద్ధి. ఇక్కడ చూడాల్సినవి
వాడుజ్ కాజిల్ : ఇది లిచెన్‌స్టెయిన్ రాజకుటుంబం నివసించే ప్యాలెస్. ఈ కాజిల్ పైకి వెళ్లి చూస్తే అక్కడి అందాలు అద్భుతంగా ఉంటాయి.
లిచెన్‌స్టెయిన్ మ్యూజియం ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ : ఆధునిక, సమకాలీన కళాకృతులు ఉన్న అందమైన బ్లాక్ క్యూబ్ ఆర్కిటెక్చర్ ఇది.
స్కెచీ పార్క్ : ఇక్కడ అందమైన స్కెచీ పార్క్ కూడా ఉంది. ఈ దేశాన్ని మీరు తక్కువ సమయంలో సులభంగా చుట్టేయవచ్చు.
ఇది కూడా చదవండి : Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
శాన్ మారినో
శాన్ మారినో ప్రపంచంలో ఐదవ అతి చిన్న దేశం. ఇది ఇటలీతో చుట్టుముట్టబడి ఉంది. ఈ దేశం ముఖ్యంగా దాని పాత కోటలు, చరిత్రకు ప్రసిద్ధి. ఇక్కడ చూడాల్సినవి
మోంటే టిటానో : ఈ కొండపై ఉండే మూడు టవర్స్ శాన్ మారినో దేశానికి గుర్తు. ఇక్కడ నుండి చూస్తే పచ్చని కొండలు, అందమైన గ్రామాలు కనబడుతాయి.
గైటా టవర్ : ఇది అత్యంత పురాతనమైన, ప్రసిద్ధమైన టవర్. ఇక్కడి నుండి పక్షుల వ్యూ చాలా బాగుంటుంది.
లిబర్టీ స్క్వేర్ : ఈ స్క్వేర్ మధ్యలో ఒక అందమైన విగ్రహం ఉంటుంది. ఇక్కడ స్థానిక సంస్కృతిని చూస్తూ కాఫీ తాగుతూ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చాలా ప్రదేశాలు ఉచితంగా లేదా చాలా తక్కువ రుసుముతో ప్రవేశం కల్పిస్తాయి.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.