Dhoolpet Patang Market : తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పతంగుల మార్కెట్ ఇదే !

షేర్ చేయండి

ధూల్‌పేట్ అంటే చాలా మందికి ముందు భారీ వినాయకుడి విగ్రహాలు గుర్తుకు వస్తాయి. అయితే ఇక్కడ వినాయకుడి విగ్రహాలతో పాటు గాలిపటాలను కూడా తయారు చేసి అమ్ముతారు. వీటిని కొనడానికి దూర దూరం నుంచి పతంగుల ప్రేమికులు వస్తుంటారు. సంక్రాంతి సందర్భంగా ధూల్‌పేట్ పతంగుల మార్కెట్ ( Dhoolpet Patang Market ) విశేషాలు మీ కోసం.

ధూల్ పేట్ అంటే చాలా మందికి వినాయకుడి విగ్రహాలు మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ ఇక్కడ పతంగుల మార్కెట్ కూడా ఉంటుంది
ధూల్‌పేట్‌లో గాలిపటాలను కొనడానికి హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి కైట్ లవర్స్‌ ఇక్కడికి వస్తుంటారు
ప్రతీ సంవత్సరం దుర్గాష్టమి తరువాత పతంగులు తయారు చేయడం ప్రారంభిస్తారు. జనవరి నెలలో సేల్స్ ఊపందుకుంటాయి.
పతంగులను స్థానికంగా తయారు చేస్తారు. కానీ దారం, లేదా మాంజా చుట్టే చెరాక్‌కు మాత్రం సిటీలోని వివిధ ప్రాంతాల నుంచి తీసుకుచ్చి అమ్ముతారు.
Dulhan Patang: మార్కెట్లో ఎక్కువ మంది కొనే పతంగ్ ఇది. దీని పేరు దుల్హన్. పెల్లి కూతురిలా దీన్ని తయారు చేయాల్సి ఉంటుంది .
Parni Patang : పేపర్లతో చేసిన పతంగుల గురించి తెలిసిందే. దీంతోపాటు చాలా మంది పర్నీ పతంగ్ అంటే ప్లాస్టిక్‌ కవర్‌లో చేసిన పతంగ్ కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. దీని ధర రూ.25 నుంచి 40 మధ్యలో దాని సైజులు బట్టి ఉంటుంది.
చైనీస్ , టంగూస్ మాంజాల కాలంలో కూడా ఇక్కడ స్థానికులు తయారు చేసే మాంజాకు మంచి డిమాండ్ ఉంది. మాంజా తయారు చేయడానికి వాడే మెటీరియల్‌లో రంగు, సీసం, మట్టి వంటి పదార్థాలు వినియోగిస్తారు.
మాంజా తయారు చేయడాన్ని ఇక్కడ మాంజా సూత్‌నా అంటారు. బట్టలు ఆరేసి నట్టే దారంపై మాంజా మెటీరిలయ్ అప్లై చేసి కాపేపు ఆరనిస్తారు. ఆరిన తరువాత చెరాక్‌కు చుడతారు.
ఢీల్ మాంజా, ఖీంచ్ మాంజా అని రెండు రకాల మాంజాలు అందుబాటులో ఉంటాయి ఇక్కడ. ఇందులో మీ ఛాయిస్‌ను బట్టి ఒక చెరాక్ మాంజా కొనాలంటే ధర.700 నుంచి మొదలవుతుంది.
ధూల్‌పేట్‌ పక్కనే ఉండేవాళ్లం. స్కూల్ అయ్యాక నేను కూడా పతంగ్‌లు తయారు చేసేవాడిని. ఎంత ఇచ్చేవాళ్లో గుర్తులేదు కానీ...కట్ అయిన పతంగులు వెనక పరిగెత్తే అవసరం లేకుండా నాకు కావాల్సిన పతంగ్‌లు వాళ్లే ఇచ్చే వాళ్లు. సైజును బట్టి ఒక్కో పతంగ్‌కు తయారు అవడానికి 3 నుంచి 5 నిమిషాల సమయం పడుతుంది.
స్థానికులు తమ ఇంట్లో తయారు చేసిన పతంగ్‌లను ఇలా చీర లేదా లుంగీతో చుట్టి స్టాల్స్ దగ్గరికి తీసుకొచ్చి ఇస్తారు.
అధికారికంగా తెలియకపోయినా...నాకు తెలిసి ధూల్‌పేట్ మన దేశంలో ఉన్న పతంగుల మార్కెట్లలో ఒకటి. సంక్రాంతికి ముందు ఇక్కడ చాలా రష్ ఉంటుంది. అందుకే ఇక్కడికి కార్లో రావడానికి బదులు బైక్ పై రావడానికి ప్రయత్నించండి.
చిన్నప్పుడు సైకిల్ రెంటుపై తీసుకోవడానికి ఈ రూట్లో వెళ్తోంటే రూ.2 కాయిన్ పడిపోయింది. తరువాత రెండు సార్లు రోడ్లు వేశారు ఇక్కడ. కానీ ఇప్పటికి ఇక్కడి నుంచి వెళ్తుంటే కాయిన్‌ కోసం ఆటోమెటిగ్‌గా వెతకడం మొదలుపెడతాను. అది దొరకదు. కానీ మన మజిల్ మెమోరీ మనతో అలా చేయిస్తుంది.
పతంగ్‌లను వాటి సైజును బట్టి అమ్ముతారు. అద్దా, పౌండ్‌కా, దో పౌండ్‌కా ఇలా సైజుల్లో కొలుస్తారు.
చిన్న పిల్లల పతంగ్ సెట్‌ ఇది. ఇందులో చిన్న చిన్న పతంగులు, చిన్న చెరాక్, ఒక మాస్కు, దారం వుండ, కళ్లద్దాలు, ఒక హాంకింగ్ పైప్ ఉంటాయి.
దేశ వ్యాప్తంగా మకర సంక్రాంతి సందర్భంగా గాలిపటాలు ఎగరేస్తారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కూడా ఇలాగే పతంగ్‌ల మార్కెట్ ఉంటుంది. కానీ అక్కడ దొరికే వెరైటీస్ ఇక్కడ లభించే వెరైటీస్ వేరు వేరుగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

Prayanikudu
| వాట్స్ అప్‌లో ఆసక్తికరమైన ట్రావెల్ కంటెంట్ పొందడానికి ఇక్కడ క్లిక్ చేసి గ్రూపులో చేరగలరు

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!