Airplane Food : విమానంలో ఫుడ్‌లో డబుల్ సాల్ట్ ఎందుకు వేస్తారు? ఎయిర్ హోస్టెస్ చెప్పిన షాకింగ్ నిజాలు!
Airplane Food : విమానంలో ప్రయాణించడం అంటే చాలామందికి ఇష్టం. కానీ, విమానంలో ఇచ్చే ఫుడ్ గురించి కొన్ని నిజాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. సాధారణంగా ఉప్పు ఎక్కువ తినొద్దని చెబుతారు. కానీ, విమానంలో ఇచ్చే ఫుడ్‌లో మాత్రం డబుల్ సాల్ట్ వేస్తారట. ఈ సీక్రెట్ ను ఓ ఎయిర్ హోస్టెస్ బయటపెట్టింది. అసలు ఎందుకిలా చేస్తారు? విమానంలో ఏది తినాలి? ఏది తినకూడదు? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
డైలీ మెయిల్ రిపోర్ట్ ప్రకారం, ఎయిర్ హోస్టెస్ సలీనా బెడింగ్ విమానంలో ప్రయాణించే వాళ్లకు విమానంలో ఫుడ్ తినొద్దు ఆమె సలహా ఇచ్చింది. భూమిపై మనం ఏది తిన్నా పెద్ద సమస్య ఉండదు. కానీ, విమానంలో ప్రయాణించేటప్పుడు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే, విమానం ఆకాశంలో ఎత్తుగా ఎగురుతుంది కాబట్టి, అక్కడ వాతావరణం వేరుగా ఉంటుంది. అలాంటి టైంలో కొన్ని నియమాలు పాటించాలి.
ఇది కూడా చదవండి : UAE: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు
విమానాల్లో ఇచ్చే ఫుడ్‌లో చక్కెర, ఉప్పు ఎక్కువగా ఉంటాయట. మామూలు కంటే డబుల్ ఉప్పు కలుపుతారట. ఎయిర్ హోస్టెస్ సలీనా బెడింగ్ చెప్పిన ప్రకారం.. ఈ డబుల్ సాల్ట్ వేసిన ఫుడ్‌ని విమానంలో తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఎక్కువ ఉప్పు ఆరోగ్యానికి మంచిది కాదు.
మరి ఎందుకు రెట్టింపు ఉప్పు కలుపుతారు? దీనికి కారణం, విమానం ఎక్కువ ఎత్తులో ప్రయాణించేటప్పుడు క్యాబిన్ ప్రెషర్ ఉంటుంది. ఈ ప్రెషర్ వల్ల మన నాలుకపై ఉండే రుచి మొగ్గలు దాదాపు 30 శాతం వరకు దెబ్బతింటాయట. అంటే, మనం సాధారణంగా తినే ఫుడ్ రుచి, విమానంలో అంతగా అనిపించదు. అందుకే, రుచి బాగా తెలియడం కోసం డబుల్ సాల్ట్ కలుపుతారని ఆమె వివరించింది.
ఇది కూడా చదవండి : Azerbaijan అజర్ బైజాన్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? 10 టిప్స్!
ఎక్కువ దూరం విమానంలో ప్రయాణించేటప్పుడు ఏం తినాలని ఆలోచిస్తున్నారా? ఎయిర్ హోస్టెస్ సలీనా ఒక సింపుల్ చిట్కా ఇచ్చింది. ఫ్రూట్ సలాడ్ లేదా గ్రీన్ సలాడ్ తినమని ఆమె సలహా ఇచ్చింది. ఇలాంటివి తినడం వల్ల ఎక్కువ ఎత్తులో కూడా శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా, హెల్దీగా ఉంటుందని ఆమె చెప్పింది.
విమాన ప్రయాణాల్లోనే కాదు, బస్సు, కారు, రైలులో వెళ్లేటప్పుడు కూడా ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రైలులో ఆకలి వేసినప్పుడు ఏది పడితే అది తినేస్తే, తర్వాత ఆరోగ్య సమస్యలు రావచ్చు. మామూలు రైళ్లలో అమ్మే వాటర్ బాటిల్స్ కూడా క్వాలిటీగా ఉండకపోవచ్చు. సమోసాలు, టీ లాంటి చవకైన ఫుడ్ ఐటమ్స్ భవిష్యత్తులో మీకు చాలా హాని కలిగించవచ్చు. కాబట్టి, ప్రయాణాల్లో ఫుడ్ విషయంలో ఎప్పుడూ అలెర్ట్‌గా ఉండటం మంచిది.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
