అన్వేష్ ఇప్పుడు తెలుగు ట్రావెల్ వ్లాగింగ్‌లో ఒక లెజెండ్. అన్వేష్ నడిపే రెండు ఛానెల్స్ ఒకటి Naa Anveshana , Prapancha Yatrikudu ఈ రెండింటిలో ఏది పోస్ట్ చేసినా మిలియన్ వ్యూస్ వచ్చేస్తుంటాయి.
నా అన్వేషణ ఛానెల్‌లో ట్రావెల్ మాత్రమో పోస్ట్ చేసే అన్వేష్ ప్రపంచ యాత్రికుడిలో బిహైండ్ ది సీన్స్ తో పాటు తను ఏదైనా టాపిక్‌పై మాట్లాడాలి అనుకుంటే దానిపై ఒక వీడియో చేసి పెడుతుంటాడు.
ఇటీవలే ప్రపంచ యాత్రికుడు అనే ఛానెల్‌లో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు గురించి తన స్టైల్లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియో చేశాడు.
మన దేశంలో స్టాక్ మార్కెట్‌ను జూదంగా చూసే వాళ్లు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వారి మాటలు విని చాలా మంది ఈ మార్కెట్‌కు దూరంగా ఉంటున్నారు. ఈ అంశంపై అన్వేష్ ఈ వీడియో చేశాడు.
నా కామెంట్…
Naa Anvesha Prayanikudu | అన్వేష్ వీడియో చూసిన తరువాత నాకు కామెంట్ చేయాలి అనిపించింది. ఎందుకంటే నేను 2009 ( ఇంటర్ డిగ్రీ సమయంలో ) లో బ్రోకింగ్ చేసే మార్వాడీ దగ్గర అసిస్టెంట్‌గా సమ్మర్ జాబ్ చేశాను. నా పని అతని క్లైంట్స్‌కు ఫోన్ చేసి వారి పోర్ట్ ఫోలియో స్టాక్స్‌పై అప్డేట్ ఇవ్వడం దాంతో పాటు వారు చెప్పినప్పుడు అమ్మడం లేదా కొనడం చేసేవాడిని.
ఓ కన్నేసి పెట్టేవాడిని…
కానీ ఆ జాబ్ అంతగా నచ్చలేదు. ఎందుకంటే టెర్మినల్ ముందు కూర్చుని ఫోన్లో మాట్లాడి లాభం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు క్లైంట్స్ రియాక్షన్ గమనించేవాడిని. వాళ్లు చాలా వేగంగా నిర్ణయాలు తీసుకునే వారు. కొన్ని సార్లు అవి పాజిటీవ్ రిజల్ట్స్ ఇచ్చేవి కొన్నిసార్లు నెగెటీవ్. కానీ నాకు ఎందుకో ఇది నా కెరియర్ కాదు అనిపించి వదిలేశాను. కానీ స్టాక్ మార్కెట్‌పై ఒక అవగాహన రావడంతో ఎప్పుడూ ఒక కన్నేసి పెట్టేవాడిని. అంతే కానీ పైసా కూడా ఇన్వెస్ట్ చేసేవాడిని కాదు.
Also Read : Thailand 2024 : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?
కానీ 2019-20 లో సమయంలో స్టాక్స్ అన్నీ పడిపోతున్నప్పుడు అందరూ మార్కెట్ వదిలి వెళ్తున్నప్పుడు నేను కొన్ని స్టాక్స్ మాత్రమే కొన్నాను. ఎందుకంటే నాకు తెలుసు ఎండాకాలం తరువాత వర్షాకాలమే వస్తుంది మంచి కంపెనీ షేర్ ధర పడిపోయినా తరువాత అది లేస్తుంది అని. అలా నేను కొద్దిగా లాభం సంపాదించాను. అప్పటి నుంచి చాలా విషయాలు తెలుసుకున్నాను.
చాలా స్ట్రాటజీలు డెవలెప్ చేసుకున్నాను. సందర్భాన్ని బట్టి ఒక్కో స్ట్రాటజీని వాడుతుంటాను.
కామెంట్‌లో ఏముంది ?
సో విషయానికి వచ్చేస్తే అన్వేష్ వీడియో చూసిన తరువాత నాకు ఎందుకో నాకు తెలిసిన కొన్ని విషయాలు చెబితే బాగుంటుంది అనిపించి ఒక పది సూచనలు చేశాను. ఎవరైనా వాటిని పాటించి లాభాలు గడించవచ్చు ఆర్థికంగా కొంచెం మెరుగు అవ్వవచ్చు అనేది నా ఆలోచన.
Also Read : Telugu Women Travel Vloggers : ట్రావెల్ వ్లాగింగ్‌లో వీర వనితలు
కామెంట్ పెట్టిన కొన్ని గంటల తరువాత ఎవరైనా చూశారా అని చెక్ చేస్తే అప్పటికే అన్వేష్ నా కామెంట్‌ను పిన్ చేశాడు. చాలా సంతోషంగా అనిపించింది.
ఆ పిన్ ఇదే.
నా కామెంట్‌కు లైక్ చేశాడు. నా అన్వేషన ఖాతా నుంచి ప్రపంచ యాత్రికుడు ఖాతా నుంచి రిప్లై కూడా ఇచ్చాడు అన్వేష్.
నా సూచనలు చాలా సింపుల్‌గా ఉండేలా చూసుకున్నాను. అవి చాలా మందికి సహాయపడతాయి అని ఆశించి కామెంట్ చేశాను. అన్వేష్ కూడా ఇదే భావించి పిన్ చేశాడేమో అనిపిస్తోంది. అయితే కొన్ని గంటల తరువాత మరో వ్యక్తి కామెంట్‌ను కూడా పిన్ చేశాడు అనుకోండి. తన ఆడియెన్స్‌కు ఏది బెస్టో అదే చేస్తాడు కాబట్టి నేను ఏమీ అనుకోలేదు. కానీ నా కామెంట్ చాలా మందికి నచ్చడం అనేది నాకు నచ్చిన విషయం. దాదాపు వెయ్యి లైక్స్ కూడా వచ్చాయి. థ్రిల్లింగ్‌గా అనిపించింది. అందుకే ఈ విషయాన్ని ఇక్కడ షేర్ చేస్తున్నాను.
మీకోమాట చెప్పాలి..
స్టాక్ మార్కెట్ గురించి అర్థం చేసుకుని అందులోకి దిగితే ఎవరైనా దాని నుంచి లాభాలను సంపాదించుకోవచ్చు. దీని కోసం మీరు చేయాల్సిందల్లా నిత్యం రీసెర్చ్ చేయడం దాంతో పాటు నాలెడ్జ్ పెంచుకోవడం. సెబీలో రిజిస్టర్ అయిన స్టాక్ అడ్వైజర్ నుంచి సలహాలు సూచనలు తీసుకోవాలి మీరు. బ్రోకర్లు బ్రోకరేజ్ కోసం ప్రయత్నిస్తారు. వారికి మీ లాభాలతో సంబంధం ఉండదు.
అందుకే ఫీజు చెల్లించి గైడెన్స్ ఇచ్చే గురువులాంటి ఆర్థిక నిపుణుడు మీకు అవసరం. ఫీజు ఇచ్చినప్పుడు మీకు మంచి సలహా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కానీ నేను క్వాలిఫైడ్ పర్స్‌ను కాదు. సో ఇప్పటికి అయితే ఇంతే
గమనిక : స్టాక్ మార్కెట్‌పై ,మార్కెట్ రిస్కులపై పూర్తిగా అవగాహన పెంచుకోవడానికి ఆర్థిక నిపుణులను సంప్రదించండి. నా కామెంట్ గురించి ఇక్కడ ఒక బ్లాక్ రూపంలో ప్రస్తావించాను కానీ పెట్టుబడుల విషయంలో ఎవరినీ ప్రోత్సాహించడం లేదా నిరాశ పరచడం నా ఉద్దేశం కాదు. థ్యాంక్యూ
ప్రయాణికుడును సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.