చాలా మందికి ఎయిర్‌ప్లేన్ మోడ్ ( Airplane Mode ) విమానంలో వాడుతారు అని తెలుసు. కానీ చాలా మందికి ఇది ఎందుకు వాడతారో తెలియదు. దాని అవసరం ఏంటో తెలియదు. వాడకపోతే జరిగే నష్టం గురించి తెలియదు. ఈ ఆర్టికల్ రాసే వరకు నాక్కూడా తెలియదు.

విమాన ప్రయాణం అనేది ఈ రోజుల్లో సాధారణం అయింది. ఒకప్పుడు లగ్జరీ ప్రయాణ సాధనంగా ఉండే విమానయానం అనేది నేడు అవసరంగా మారింది. అయితే ప్రయాణం ఏదయినా ముందు సేఫ్టీ రూల్స్ ( Air Travel Safety Tips ) తెలుసుకోవాలి. అందుకే ఈ ఆర్టికల్‌లో మీకు తెలిసిన అంశం గురించి వివరించబోతున్నాను.
విమాన ప్రయాణంలో సేఫ్టీ విషయంలో ప్రధానమైన అంశం ఫ్లైట్ మోడ్ ( Flight Mode ) . దీనిని ఎయిర్‌ప్లేన్ మోడ్ అని కూడా అంటారు. అందుకే ముందు ఎయిర్‌ప్లేన్ మోడ్ ( Airplane Mode ) నుంచి ప్రారంభిద్దాం.
Table Of Content
1. సేఫ్టీ రెగ్యులేషన్స్ | Safety Regulations On Flight
ఎయిర్ క్రాఫ్ట్ కమ్యూనికేషన్, నేవిగేషన్ సిస్టమ్ పనితీరు ప్రభావితం చేయకుండా ఉండేందుకు ఎయిర్‌లైన్, ఏవియేషన్ ఆథారిటీస్ పలు జాగ్రత్తలు తీసుకుంటాయి. ఈ సేప్టీ గైడ్‌లైన్స్‌లో ఎయిర్‌ప్లేన్ మోడ్ కూడా ఒకటి. ఈ మార్గదర్శకాలను పాటించే ప్రక్రియలో ముందుగా మీరు ఎయిర్‌ప్లేన్ మోడ్ ఆన్ చేయాల్సి ఉంటుంది.
2. సిగ్నలింగ్ వ్యవస్థలో జోక్యం | Why to Turn On Airplane Mode ?

మొబైల్ ఫోన్ పని చేయడానికి ముఖ్యంగా కావాల్సినవి రెండే రెండు. ఒకటి బ్యాటరి.. రెండోది సిగ్నల్స్. ఈ రెండూ లేకపోతే మనకు ఫోన్ వాడలేము. అవసరం కూడా లేదు. మొబైల్ ఫోన్ నుంచి వెలువడే సిగ్నల్స్ ఎయిర్‌క్రాఫ్ట్ నేవిగేషన్ సిస్టమ్ పనితీరులో జోక్యం కలిగించవచ్చు.ఎయిర్‌ప్లేన్ మోడ్ ఆన్ చేయడం వల్ల ఈ అనవసరమైన ట్రాన్స్‌మిషన్‌ను మీరు నివారించవచ్చు. దీంతో విమానం ఎగురుతున్నప్పుడు ఎలాంటి సమస్య తలెత్తదు.
3. బ్యాటరీ లైఫ్ పెంచుతుంది
Phone Battery Life Enhancement in Airplane Mode : ఒక వేళ బ్యాటరీ తక్కువగా ఉంటే మీరు ఎయిర్‌ప్లెయిన్ మోడ్ ఆన్ చేయండి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీ డివైజ్ బ్యాటరీని పని తీరును అనూహ్యంగా పెంచుకోవచ్చు. ఈ సమయంలో బ్లూటూత్, వైఫై, సెల్యూలర్ డేటా, వంటి ఫీచర్లను ఆఫ్ చేయడం వల్ల మీ డివైజ్ తక్కువ బ్యాటరీని వాడుతుంది. దీంతో మీరు ఎక్కువ సమయం పాటు విమానంలో ఫోన్ వాడవచ్చు.
4. కనెక్షన్ కట్ అవదు | Benefits Of Airplane Mode
బాగా ఎత్తైన ప్రాంతాల్లో నుంచి వెళ్తున్నప్పుడు మీ మొబైల్ భూమిపై ఉన్న టవర్ల నుంచి సిగ్నల్స్ డిటెక్ట్ చేసి వాటిని స్వీకరించేందుకు ప్రయత్నిస్తుంది. జస్ట్ ఇమాజిన్ మీ ప్రయాణంలో ఎన్ని వందల, వేల టవర్స్ పై నుంచి మీరు వెళ్తారు ? చాలా కాదా. మరి అన్నింటితో కనెక్ట్ అయ్యే ప్రయత్నంలో మీ మొబైల్ బ్యాటరీ పెనంపై నెయ్యిలా కరిగిపోతుంది. దీంతో మీరు తక్కువ సమయం మాత్రమే మీ ఫోన్ వినియోగించుకోగలరు.
5. క్యాబిన్ | Airplane Mode Effects on Cabin Crew
ఎయిర్‌ప్లెయిన్ మోడ్ ఆన్ చేయడం వల్ల మీకు కాల్స్ వచ్చే ఛాన్స్ ఉండదు. నోటిఫికేషన్స్ రావు, మెసేజులు రావు. ఫోన్ సైలెన్స్‌లో ఉంటుంది. దీని వల్ల మీరూ, మీతో పాటు ఇతరులూ చాలా ప్రశాంతంగా ప్రయాణాన్ని ఎంజాయ్ చేయవచ్చు.
6. ఫ్లైట్ సిబ్బంది సూచనలు

విమానంలో ఉన్న సిబ్బంది మీ ప్రయాణం సాఫీగా సాగేందుకు కొన్ని సూచనలు చేస్తారు. అందులో ఎయిర్‌ప్లేన్ ఆన్ చేయడం కూడా ఒకటి. ఎయిర్‌ప్లేన మోడ్ ఆన్ చేసి వారి సూచనలను మీరు గౌరవంగా పాటించవచ్చు.
7. వైఫై | WIFI replacing Airplane Mode In Flight
ఈ మధ్యా చాలా ఎయిర్‌లైన్స్ ప్రయాణికులకు వైఫై సదుపాయం కల్పిస్తున్నాయి. సో మీ ఫోన్ ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉన్నా కూడా మీరు వైఫై ఆన్ చేసి ఇంటర్నెట్ వినియోగించుకోవచ్చు. అది కూడా ఎలాంటి రూల్స్ బ్రేక్ చేయకుండా.
- ఇది కూడా చదవండి : ఈట్రైనుకు టికెట్ లేదు, టీసీ లేడు: 75 ఏళ్ల నుంచి ఫ్రీ సేవలు
8. రోమింగ్ చార్జీలు తగ్గించుకోండి | How to Reduce Roaming Charges
ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉన్నప్పుడు డాటా రోమింగ్ చార్జీలను తగ్గించుకోవచ్చు. అంతర్జాతీయ ప్రయాణాల్లో మీకు ఇది కలిసి వచ్చే అంశం అవుతుంది. మరీ ముఖ్యంగా విదేశాల్లో తమకు ఫోన్ నుంచి డాటా వినియోగిస్తే ఎంత చార్జ్ చేస్తారో తెలియని వారికి ఇది మంచి ఛాయిస్.
9.ఎంటర్‌టైన్మంట్‌కు ఢోకా లేదు | Entertainment In Airplane Mode

ఎయిర్‌ప్లేస్ మోడ్ ఆన్ చేసిన తరువాత కూడా ఎంటర్‌టైన్మెంట్ మీకు లభిస్తుంది. దీని కోసం మీరు ముందుగా మీకు నచ్చిన కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మ్యూజిక్, మూవీస్, ఈ బుక్స్ ముందే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీని వల్ల మీ దగ్గర ఉన్న కంటెంట్ మాత్రమే మీరు ఎంజాయ్ చేస్తారు. కాస్త బ్రౌజింగ్ నుంచి బ్రేక్ తీసుకోవచ్చు.
10. పర్యావరణానికి మేలు | Airplane Mode Effects
విమాన ప్రయాణంలో మొబైల్ పరికరాలు వినియోగించడం తగ్గిస్తే విమాన కమ్యూనికేషన్ వ్యవస్థ, సిగ్నలింగ్ వ్యవస్థకు ఎలాంటి ఇబ్బంది కలగదు. పైగా క్యాబిన్‌లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. దీని వల్ల విమానయానం చక్కగా సాగుతుంది.
మొత్తానికి | Significance of Airplane Mode
ఎయిర్‌ప్లేన్ మోడ్ ఆన్ చేయడం అనేది కేవలం ఇక ఆప్షన్ మాత్రమే కాదు. ఒక అవసరం కూడా. సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని అధికారులు, సిబ్బంది చెప్పే సూచనల్లో ఇది తప్పకుండా ఉంటుంది. దీని వల్ల తోటి ప్రయాణికులు కూడా చాలా ప్రశాతంగా తమ ప్రయాణాన్ని పూర్తి చేసి గమ్యస్థానానికి చేరుకుంటారు.సో నెక్ట్స్ టైమ్ ఫ్లైట్ ఎక్కితే ఎయిర్‌ప్లేన్ మోడ్ ఆన్ చేస్తారు కదూ?