2026 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఇండియాలోనే బెస్ట్ పార్టీ ప్లేసెస్, చార్జీలు అండ్ టిప్స్, గైడ్ | 2026 New Year Celebrations in India
New Year 2026 Party Destinations In India : కొత్త సంవత్సరం కోసం ఒక నెల ముందు నుంచే భారతీయులు సిద్ధం అవుతుంటారు. ఈ సారి సూపర్‌గా కొత్త ఏడాదిని మొదలుపెట్టాలని మంచి పార్టీ డెస్టినేషన్స్ కోసం వెతుకుతుంటారు. ఈ పోస్టులో మీకు అలాంటి ఎవర్గ్రీన్ న్యూ ఇయర్ పార్టీ డెస్టినేషన్స్ (New Year 2026 Party Destinations In India ) ఏంటో వివరిస్తాను.
న్యూ ఇయర్ అనేది కేవలం కౌంట్‌డౌన్ ఈవెంట్ మాత్రమే కాదు. ఇది ట్రావెల్ ఇండస్ట్రీ బాగా బూమ్‌లో ఉండే సీజన్ కూడా. బీచుల నుంచి మంచు పర్వతాల (Mountains) వరకు, రూఫ్ టాప్ డీజే నైట్ల నుంచి బోన్‌ఫైర్ వరకు మెట్రో నగరాలు పల్లెటూర్లు ఎక్కడ చూసినా కొత్త సంవత్సరం వేడుకలు అదిరిపోయేలా జరుగుతాయి.
కేవటం థర్టీ ఫస్ట్ నైట్ మాత్రమే సెలబ్రేట్ చేసుకునే వాళ్లతో పాటు డిసెంబర్ 30 నుంచి జనవరి 2వ తేదీ వరకు కూాడా పార్టీల్లో మునిగిపోయే వాళ్లు కూడా ఉంటారు. ఆరంభంలో అదిరిపోయే బిజినెస్‌తో ట్రావెల్ (travel) అండ్ హాస్పిటాలిటీ రంగానికి మంచి కిక్కించే బిజినెస్ దొరుకుతుంది.
ఒకవైపు ఫ్లైట్స్ (Flghts) అన్నీ బుక్ అవుతాయి, మరోవైపు హోటల్ ధరలు రెెట్టింపు అవుతాయి, వారాలకు ముందే పార్టీ పాసులు అన్నీ సేల్ అయిపోతాయి. అందుకే మీరు ఇప్పుడే ప్లానింగ్ మొదలు పెట్టకపోతే కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది. అందుకే నేను టైమ్‌కి ఈ పోస్టు పబ్లిష్ చేస్తున్నాను. ఎందుకంటే కొత్త సంవత్సరం మీకు బాగుంటేనే కదా నేను బాగుండేది.
ముఖ్యాంశాలు
ఎట్లైతే అట్ల…సూస్కుందాం | Mistakes In New Year Trips
కొత్త సంవత్సరం సందర్భంగా ప్రయాణాలు (New Year Travel) చేయాలి అనుకున్నప్పుడు చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే వాళ్లు కేవలం డెస్టినేషన్ గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఆ సమయంలో అక్కడ ఉండే జనం, వారి ఆలోచనా విధానం, ధరలు, బుకింగ్స్, రవాణాలో ఉండే ఇబ్బందులు, సేఫ్టీ వంటివి అంతగా పట్టించుకోరు. ఎట్లైతె అట్ల సూస్కుందాం అనుకుంటారు.

కానీ నేను మీకోసం ఆ ఆలోచన చేసి మంచి డెస్టినేషన్స్‌తో పాటు కొత్త సంవత్సరం సమయంలో ఉండే పరిస్థితుల గురించి మిమ్మల్ని అలెర్ట్ చేస్తున్నాను. ఈ పోస్టు మీ ఫ్రెండ్స్‌కు షేర్ చేయడం మర్చిపోకండి.
ప్రయాణికుడులో (Prayanikudu) 1000 పోస్టులు పెట్టినా…ఇంకా అంత గుర్తింపు రాలేదు. డబ్బు గురించి అడగకండి అది ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ నేనొక మంచి కమ్యూనిటీకి సేవ చేస్తున్నాను అనే సంతోషం మాత్రం పుష్కలంగా ( ఈ మధ్య పుష్కలంగా అనే పదం బాగా ట్రెండ్ అవుతోంది అని వాడాను ). అంటే ఫుల్లుగా ఉంది.
అయితే మీ సపోర్టు ఉంటే నాకు చాలా హెల్ప్ అవుతుంది. సో కథలో ముందుకు వెళ్దాం. మొదటి డెస్టినేషన్ గురించ తెలుసుకుందాం.
గోవా…రాజు ఎప్పటికీ రాజే | Why Goa Gets Fully Booked First In New Year 2026
బాహుబలి మూవీలో నాజర్ అన్నట్టు రాజు ఎక్కడున్నా రాజే. గోవా (Goa) గురించి, అక్కడి టూరిజం గురించి ఎంత నెగెటీవ్‌గా విన్నా, గోవా కన్నా థాయ్‌లాండ్ బెటర్ అని అన్వేష్ (Naa Anveshana) అన్నా కూడా…గోవా మన దేశంలో పార్టీ క్యాపిటల్ అనేది మాత్రం రాజమౌళి స్టాంప్‌లా ఫిక్స్ అయింది.
అందుకే ప్రతీ కొత్త సంవత్సరం గోవా టూరిస్టులతో కళకళలాడుతుంది. ఎందుకంటే ఇది ఒక డెస్టినేషన్ మాత్రమే కాదు…పార్టీ ప్రియుల కోసం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు సిద్ధంగా ఉండే రంగ స్థలం కూడా.
- ఇది కూడా చదవండి : గోవా వెళ్తున్నారా ? ఈ పని చేస్తే అరెస్టు అవుతారు జాగ్రత్త
2026 New Year Celebrations in India : ప్రతీ సంవత్సరం డిసెంబర్ 27వ తేదీ నుంచి జనవరి 2వ తేదీ వరకు గోవాకు దేశ విదేశాల నుంచి పార్టీ ప్రియులు పొలిటికల్ పార్టీ బహిరంగ సభలకు వెళ్లినట్టు భారీ సంఖ్యలో తరలివెళ్తారు (ప్రయాణికుడు అవ్వడానికి ముందు ముందు 14 ఏళ్లు జర్నలిస్టుగా వివిధ సంస్థల్లో పని చేశాను కదా…కొన్ని సార్లు పత్రికా భాష వచ్చేస్తుంది అంతే).
- ఇది కూడా చదవండి : రూ.430 కే ట్రిప్…అదే సాధ్యం ?
గోవాలోని బాగా బీచ్ (Baga Beach), కాలంగ్యూట్, అంజునా వంటి ప్రాంతాలు ఓపెనజ్ ఎయిర్ నైట్ క్లబ్బులుగా మారిపోతాయి. లగ్జరీ రిసార్టులు విషయానికి వస్తే సౌత్ గోవాలో చాలా పద్దతిగా కంట్రోల్డ్‌గా ఈవెంట్స్ జరుగుతాయి. వీటికి సంబంధించిన పాసులు, టికెట్లు ముందే బుక్ చేసుకుంటే బెటర్.
- ఇది కూడా చదవండి : ట్రెక్కింగ్ ప్రియులకు గోవా బంపర్ ఆఫర్…హిడెన్ స్పాట్స్‌లో సాహసమే శ్వాసగా సాగిపోండి.
- ఇది కూడా చదవండి : గోవాలా తప్పకుండా విజిట్ చేయాల్సిన 10 రెస్టారెంట్స్
ఖర్చుల్లో కూడా రాజే మాస్టారు | Reality Of Goa Travel Cost
అయితే చాాలా మంది ట్రావెల్ వ్లాగర్స్ (Travel Vloggers) అండ్ ఇంఫ్లుయెన్సర్స్ గోవా గురించి చెప్పని విషయ ఏంటంటే అక్కడి ధరలు.
చూడటానికి తళతళమనే మిరపకాయ…కొరికితే తిరుగుతుంది తలకాయ అన్నట్టు ఉంటాయి ధరలు.
- సాధారణంగా రూ.1500 ఉండే రూమ్స్ కొత్త సంవత్సరం సందర్భంగా రూ.5,000 నుంచి 8,000 లకు చేరుకుంటాయి. ముద్దొచ్చినప్పుడే సంకనెక్కాలి అన్నట్టు పీక్ సీజన్‌ను ఇలా వాడేసుకుంటారు. అప్పుడే థాయ్‌లాండ్ (Thailand) వెళ్లినా బాగుండు అని చాలా మంది అనుకుంటారు.
- ఇక టూ వీలర్స్ రెంట్లు దాదాపు డబుల్ అయిపోతాయి.
- మద్యం మత్తులో మునిగితేలాలనుకునే వాళ్ల జేబులకు చిల్లు పడేలా 30-40 శాతం వరకు ధరలు పెరుగుతాయి. స్టఫ్సుకు కూడా డబ్బులు మిగిలవేమో అనిపిస్తుంది. అలాంటప్పుడే ఏ అరుణాచలో, అస్సామో, మేఘాలయో లేదా భూటానో (Bhutan) వెళ్తే బాగుండేమో అని కూడా అనిపిస్తుంది. లిక్కర్ చీప్ కదా అక్కడ.
- ఇది కూడా చదవండి : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఎక్కడ ఉండాలి? ఏం చూడాలి ?
- ఇది కూడా చదవండి : 11 కారణాలతో భారతీయులను ఆయస్కాంతంలా లాగేస్తున్న థాయ్‌లాండ్…
మీరు బడ్జెట్ పద్మనాభంలా గోవా ట్రిప్పును (Goa Budget Tour ) ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం బీచు ఏరియాల్లో కాకుండా సియోలిమ్ (Siolim) పోర్వోరిమ్ (Porvorim), అర్పోరా వంటి దూరప్రాంతాల్లో ఉంటే బెటర్.
ముంబై, బెంగుళూరు ఇతర పట్టణాలు | Mumbai, Bangalore & Urban Party Reality
ముంబై, బెంగుళూరు వంటి పట్టణాల్లో బీచులు, రిసార్టుల కన్నా పబ్బులు, క్లబ్బుల్లో పెద్ద పార్టీలు జరుతాయి. ఈ రెండు నగరాల్లో నైట్ లైఫ్ అనేది అక్కడి ఇకో సిస్టమ్‌లో భాగం అయ్యాయి.అయితే ఇక్కడ కొన్ని విషయాలు మీరు గుర్తుంచుకోవాలి.
- ఎంట్రీ పాసులు ఉన్నంత మాత్రాన మీకు సీటింగ్ అండ్ ఫుడ్ దొరుకుతుంది అని గ్యారంటీ ఉండదు.
- రాత్రి 12.30 తరువాత క్యాబు ధరలు మూడింతలు, ఐదింతలు పెరుగుతాయి
- డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చాలా కఠినంగా ఉంటాయి.
- మన హైదరాబాద్‌లో కూడా థర్టీ ఫస్ట్ నైట్‌లో స్పెషల్ రూల్స్ అమలులోకి వస్తాయి. తాగితే బండి నడపకు. బండి నడపాల్సిందే అనిపిస్తే తాగకు అనేది సింపుల్ రూల్.
కొత్త సంవత్సరం సందర్భంగా మీరు మెట్రో నగరాలకు వెళ్తే మాత్రం రాత్రి సమయంలో కాకుండా పగలు జరిగే పార్టీలకు వెళ్తే బెటర్. ఇలా చేస్తే క్రౌడ్‌ను తప్పించుకోవచ్చు. దీంతో పాటు ఖర్చులు కూడా తగ్గుతాయి.
- ఇది కూడా చదవండి : భూటాన్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? ఎక్కడ ఉండాలి ? కంప్లీట్ ట్రావెల్ గైడ్
- ఇది కూడా చదవండి : రూ.19,999 కే భూటాన్‌లో 6 రోజుల ట్రిప్...
- ఇది కూడా చదవండి : ఈ పని చేస్తే భూటాన్ ప్రయాణ ఖర్చులు అన్నీ కవర్ అయిపోతాయి
పర్వతాలు వర్సెస్ బీచులు | Mountains vs Beaches for New Year Celebrations
న్యూ ఇయర్ విషయంలో ప్రతీ మనిషికి ఒక టేస్టు ఉంటుంది. ఉదాహరణకు చాలా మంది కొత్త సంవత్సరాన్ని గోవా లేదా ముంబై బెంగళూరు వంటి ప్రాంతాల్లో సెలబ్రేటట్ చేయాలి అనుకుంటే నాలాంటి వాళ్లు రిషికేష్ లేదా మనాలి వంటి కొండ ప్రాంతాల్లో సెలబ్రేట్ చేయాలి అనుకుంటారు.
మనాలి, కసోల్ వంటి మంచు పడే ప్రాంతాల్లో రొమాంటిక్‌గా కొత్త సంవత్సరం వేడుకలు చేసుకోవాలి అనుకునే జంటలు కూడా ఎక్కువే. అయితే ఇలాంటి ప్రదేశాలను ఎంచుకోవడానికి ముందు కొన్ని విషయాలు మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి.
- మనాలి వంటి పెద్ద టూరిస్టు డెస్టినేషన్స్‌లో డిసెంబర్ 30, 31వ తేదీన భారీ నుంచి అతి భారీ ట్రాఫిక్ జామ్స్ జరుగుతాయి. చాలా మంది విసుక్కుని వెనక్కి వచ్చేస్తారు.
- తక్కువ ధరలో రూమ్స్ దొరకాయని సంతోషించేలోపే అక్కడి వాటర్ పైపుల్లో నీరు గడ్డకట్టుకుపోతుంది. పోని మంచి హోటల్స్ బుక్ చేద్దాం అంటే దొరకవు. దొరికినా ధరలు అదిరిపోతాయి.
- అలా అని మాల్ రోడ్డుకు దూరంగా ఉండే హెటల్స్ బుక్ చేస్తే ఎమర్జెన్సీ వస్తే అంత సులువుగా వైద్య సదుపాయం అందవు.
- పైగా ఈ సమయంలో మనాలి (Manali) అంటే జాతరలా ఉంటుంది. మంచులో ఎంజాయ్ చేయడం పక్కన పెడితే జనాలను చూసి విసుక్కునే పరిస్థితి ఉంటుంది. అందుకే ఇతర ఆప్షన్స్ వెతుక్కుంటే బెటర్
- ఇది కూడా చదవండి : మనాలి ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? కంప్లీట్ ట్రావెల్ గైడ్
- Prayanikudu.com లో నేను రాసిన అతిపెద్ద ట్రావెల్ గైడ్ : మనాలి వెళ్తే తప్పకుండా చేయాల్సిన 30 యాక్టివిటీస్
కానీ ఒక్క విషయం మాత్రం చెప్పాలి కొత్త సంవత్సరాన్ని హిమాలయాల ఒడిలో సెలబ్రేట్ చేయడం అనేది ఆర్ట్ అంతే.
న్యూ ఇయర్ స్కామ్స్‌తో జాగ్రత్త | New Year Safety & Scam Awareness (Very Important)
ప్రపంచంలో ప్రతీ ప్రముఖ పర్యాటక ప్రదేశంలో కొన్ని స్కామ్స్ జరుగుతుంటాయి. కొత్త సంవత్సరం సందర్బంగా వీటి సంఖ్య పెరిగే అవకాశం ఎక్కువ. అందుకే ఈ విషయాల్లో జాగ్రత్త
- కొంత మంది ఫేక్ పార్టీ పాసులు అమ్ముతుంటారు. వెరిఫై చేసుకోండి.
- దీంతో పాటు ఫేక్ విల్లా బుకింగ్స్ కూడా చాలా మందిని ఇబ్బంది పెడుతుంటాయి.
- దీంతో పాటు వాస్తవానికి దూరంగా ఉండే ఇన్స్టాగ్రామ్ రిసార్టు యాడ్స్ చూసి మోసపోయే అవకాశం కూడా ఉంటుంది.
- దీంతో పాటు చాలా ఫేక్ ప్యాకేజీలు, ఆఫర్లు, డిస్కౌంట్లతో జాగ్రత్తగా ఉండాలి.
గోల్డెన్ రూల్ | Golden Rule
2026 New Year Celebrations in India : కొత్త సంవత్సరం సందర్భంగా పార్టీల నుంచి ట్రావెల్ ప్యాకేజీల ధరలు కాస్త కాస్ట్లీగానే ఉంటాయి. అలా కాకుకండా నమ్మశక్యం కానంత తక్కువ ధరలో ఇస్తానంటే…అది స్కామ్ అని గుర్తుంచుకోండి. ఏదేమైనా ఒకటికి రెండు సార్లు వెరిఫై చేసుకుంటే బెటర్.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
