మనాలి వెళ్తే తప్పకుండా 30 యాక్టివిటీస్ ట్రై చేయండి | 30 Activities in Manali For Travelers

షేర్ చేయండి

హిల్ స్టేషన్స్ అంటే ముందుగా మనకు షిమ్లా ( Shimla ) , కొడైకెనాల్, ఊటి ( ooty ) , మనాలియే గుర్తుకు వస్తాయి. ఈ మధ్య షిమ్లాకు బదులు చాలా మంది మనాలి వెళ్లడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే మనాలి అంత అందంగా ఉంటుంది . అయితే మనాలిలో ఏం చేయాలి ఏం చూడాలి అనే ప్రశ్నకు సమాధానం కనుక్కునేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. నేను మనాలికి వెళ్లాను కాబట్టి మీకు మనాలిలో చేయాల్సిన 30 యాక్టివిటీస్ ( 30 Activities In Manali ) గురించి వివరిస్తాను.

మనాలి టూరు‌కు వెళ్లాలి అనుకుంటే ఈ పోస్ అల్టిమేట్ గౌడ్ ( Manali Ultimate Guide ) అవుతుంది.

Prayanikudu WhatsApp2
ప్రతిరోజు వాట్స్ అప్ ద్వారా ట్రావెల్ కంటెంట్ తెలుగులో పొందాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి | If You Want to Get Travel & Tourism Updates On Your WhatsApp Click Here

1.సొలాంగ్ వ్యాలీ | Activities In Solang Valley , Manali

Doing Yoga in manali, dining in manali, skiing in manali
సొలాంగ్ వ్యాలిలో…

మనాలి వెళ్లిన వారిలో 70 నుంచి 90 శాతం మంది సొలాంగ్ వ్యాలికి వెళ్తుంటారు. ఎందుకంటే ఇక్కడ మీరు స్నోలో ఎన్నో యాక్టివీటీస్ ( Manali Snow Activities ) చేయవచ్చు. మీ బడ్జెట్‌ను బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. నేను బడ్జెట్ అండ్ ఎక్స్‌పీరియెన్స్ రెండూ బ్యాలెన్స్ చేసుకుంటూ ప్లాన్ చేశాను. ముందు రెండు నిమిషాలు నా ప్రయాణంలో నా కాలికింద నలిగిన చీమలు, నా చేతిలో వీర మరణం పొంది స్వర్గాన్ని చేరిన దోమల ఆత్మకు శాంతి కలగాలి అని రెండు నిమిషాలు మంచులో మౌనం పాటించాను. ఎక్కువ సేపు మంచులో మౌనంగా ఉండలేక అక్కడి నుంచి లేచి బ్రెడ్ ఆమ్లెట్ తిని నా అంతరాత్మను శాంతి పరుచుకున్నాను. వీటన్నింటి కన్నా ముందే స్కీయింగ్ ( Skiing in Manali ) ట్రై చేశాను.

2. హాట్ ఎయిర్ బెలూన్ | Hot Air Balloon In Manali

hot air balloon ride in manali
కులు నుంచి మనాలి వెళ్లే దారిలో హాట్ ఎయిర్ బెలూన్ క్యాంప్

మనాలిలో మంచు పర్వతాలను మీరు ఆకాశం నుంచి చూడాలి అనుకుంటే మీరు హాట్ ఎయిర్ బెలూన్‌ ట్రై చేయవచ్చు. దీనికి మీరు రూ. 1500 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఒక సారి లోకల్‌గా కూడా ధర కనుక్కోండి. నేను ఇలాంటి అడ్రెనెలిన్ యాక్టివిటీస్ చేయడానికి ఇష్టపడను. ఎందుకు సుఖంగా ఉన్న ప్రాణాన్ని ఇబ్బంది పెట్టడం అనేది నా ఫిలాసఫి.

3. స్నోలో నడవండి | Walk In Snow In Manali

Snow Activity near Atal Tunnel
స్నో చూస్తే హిస్టీరిక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఇది స్నో కాబట్టి.

మనాలిలో మీరు స్నో యాక్టివిటీస్ చేయడమే కాదు….డైరక్టుగా స్నోలో కాసేపు నడవవచ్చు. దీంతో పాటు మీరు ఇక్కడ చిన్న చిన్న స్నో మ్యాన్ ( Snow Man ) బొమ్మలు తయారు చేసుకోవచ్చు. ఒంటరిగా మంచులో ఎక్కువ దూరం వెళ్లకండి , మీ గైడ్, అక్కడి అధికారుల సూచనలు పాటించండి.

4. వశిష్ట మహార్షి ఆలయం | Vashisht Maharshi Temple, Manali

Vashisht Temple inside in Manali
వశిష్ట మహర్షి ఆలయంలో భక్తులు

మనాలి అనేది ఇప్పుడు ఒక హిల్ స్టేషన్ ( Hill Station ) అండ్ హనీమూన్ స్పాట్ అయింది కానీ..ఇది చాలా పవిత్రమైన క్షేత్రం. మను మహర్షి ( Manu Maharshi ) స్థానం ఇది. అందుకే దీనికి మనాలి అనే పేరు వచ్చింది. దీంతో పాటు ఇక్కడ వశిష్ట మహర్షి ఆలయం కూడా ఉంది. దీనిని కలపతో నిర్మించారు. ఇక్కడే లక్ష్మణుడు తన బాణంతో తవ్విన వేడి నీటి గుండం కూడా ఉంటుంది.

5. మనాలి మాల్ రోడ్ | Manali Mall Road

Manali mall road tour
మనాలి మాల్‌ రోడ్‌లో చిల్ అవుతున్న పర్యాటకులు

హిల్ స్టేషన్స్‌ అన్నప్పుడు మాల్ రోడ్ ఉండటం కామన్. మనాలిలో కూడా మాల్ రోడ్ ఉంటుంది. అయితే ఇది మిగితా మాల్ రోడ్స్‌లా నదీ సైడ్‌లో, లోయ పక్కన ఇది ఉండదు. ఇది చాలా పెద్దది. ఇక్క మీరు బాగా షాపింగ్ చేయవచ్చు. నచ్చింది తినవచ్చు. నేను లోకల్ మార్కెట్‌లో ఒక స్నో క్యాప్ కొన్నాను.

6. సిసు వ్యాలీ | Sissu Valley Near Manali

Sissu Valley View near manali
సిసు లోయ ఎంట్రాన్స్

నార్త్ ఇండియాలో ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న డెస్టినేషన్ ఇది. మనాలి నుంచి అటల్ టన్నెల్ వెళ్లాక ఈ వ్యాలీ కూడా కనిపిస్తుంది. ఇది పూర్తిగా మంచు ప్రపంచం. ఇక్కడ నివాసాలు చాలా తక్కువ. ఇక్కడ ఒక నది ఉంటుంది. దాని పేరు చంద్రా నది ( Chandra River , Atal Tunnel ) దాదాపు గడ్డకట్టుకుపోయి ఉంటుంది. సో మీరు బాగుంది కదా అని నదీ తీరం వైపు వెళ్లకండి. మంచు విరిగితే నదిలో పడే అవకాశం ఉంది.

7. గ్రీన్ టీ, ఇతర దినుసులు | Buying Green Leaf in Manali Mall Road

buying Green tea and pulses in manali mall road
మనాలిలో లోకల్ స్టోర్

మనాలి మాల్ రోడ్‌లో చివరన కొన్ని స్టోర్స్ ఉంటాయి. ఇక్కడ మీరు గ్రీన్ టీ పౌడర్, బాదామ్, కాజూలు వంటివి కొనవచ్చు. నేను ఇక్కడ పహాడి వెల్లుల్లి కొన్నాను. ఎందుకంటే అది చూడటానికి గుండ్రంగా, మంచి వాసనతో ఉంది. టేస్ట్ కూడా మన ఇంట్లో ఉండే వెల్లుల్లిలా లేదు. అలాగని అమృతంలా ఉంది అని కూడా అనలేను. ఎందుకంటే అమృతం నేను ఎప్పుడూ టేస్ట్ చేయలేదు.

8. వైష్ణో దేవి ఆలయం | Vaishno Devi Temple, Kullu , Manali

Vaishno Devi Temple Visit in kullu
వైష్ణో దేవి ఆలయం ఎంట్రెన్స్‌లో నేను

మనాలిలో చాలా మంది వెళ్లే అయ్యే ఆలయం వైష్ణో దేవి ఆలయం. ఇది కులులో ఉంటుంది. ఇక్కడ అమ్మవారు కోరిన కోరికలు నెరవేర్చుతారట. ఆలయం లోపల నేను ఫోటోలు తీయలేదు. ఆలయ ప్రాంగణం నుంచి బియాస్ నది చాలా అందంగా ప్రశాంతంగా తన పని తను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణంలో మీకు శాలిగ్రామ శిలలు ( Shaligram ) కూడా కనిపిస్తాయి. అయితే వాటిని చాలా పవిత్రంగా చూసుకోవాల్సి ఉంటుంది. నేను మనాలి తరువాత ఇంకా చాలా ప్రదేశాలకు వెళ్లాలి. సో బ్యాగులో పెట్టుకుని తిరగడం మంచిది కాదని నేను తీసుకోలేదు.

9. చిన్న ధాబాలో తినడం | Eating In Local Food Stalls In Manali

Eating Local Food In Manali
మనాలిలో ఒక చిన్న హోటల్…

మనాలి వస్తే బడ్జెట్‌ను బట్టి మీరు రెస్టారెంట్స్ అండ్ ఈటరీస్ ( Eateries in Manali ) ‌లో ఫుడ్ తినొచ్చు. అయితే నేను ఎక్కువగా చిన్న చిన్న ఈటరీస్‌లో తినడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఇక్కడ పర్సనల్ కేరింగ్ ఉంటుంది. పెద్ద రెస్టారెంట్స్‌లో సర్వర్ మనం ముఖం కూడా చూడడు. నోట్‌ ప్యాడ్‌ను చూస్తూ మనం చెప్పింది విని రాసుకుని కాసేపు అయ్యాక వడ్డించి వెళ్తాడు.

కానీ నేను వెళ్లిన ఇలాంటి చిన్న ఫుడ్ స్టాల్స్‌లో ( Manali Food Stalls ) ఓనరు, కుక్ మనం ఎవరితో మాట్లాడినా వాళ్లు మనం చెప్పింది వింటారు. జీ సర్ అని మనం కోరిన విధంగా వండి వడ్డిస్తారు. నేను తిన్న ధాబాలో రద్దీ లేదు. నీట్‌గా ఉంది. లోకల్స్‌తో మాట్లాడుతూ ఫుడ్ ఎంజాయ్ చేశాను. వాళ్ల స్టోరీస్ విన్నాను. అక్కడ ఉన్న 45 నిమిషాలు, నేను కట్టిన రూ. 45 రూపాయలు రెండూ వర్తే అనిపించాయి.

పైగా మనం ఇచ్చిన డబ్బులను ప్రసాదంగా తీసుకుంటారు. అయితే హోటల్ ఎంత క్లీన్‌గా ఉంది, అక్కడి సర్వ్ చేసే వాళ్లు నీట్‌గా ఉన్నారా ? తాజాగా వండిన వంటకాలేనా అని తెలుసుకోవడం ముఖ్యం.

10. రివర్ రాఫ్టింగ్ | River Rafting in Manali

River Rafting In Beas River Manali
మనాలిలో రివర్ రాఫ్టింగ్

మనాలిలో మీరు రివర్ రాఫ్టింగ్ కూడా చేయవచ్చు. బియాస్ నది ప్రశాతంగా ముందుకెళ్తూ మనల్ని కూడా మోస్తూ ప్రవాహిస్తుంది. రివర్ రాఫ్టింగ్ ధర విషయానికి వస్తే ఆన్‌లైన్‌లో రూ.450 అని, రూ.950 అని చూపిస్తున్నారు. కానీ అక్కడ వేరే రేటు ఉంటుంది. నేను ట్రై చేయలేదు ఎందుకంటే..నాకు తీరంలో నడవడం ఇష్టం. నీటిలో తడవడం కాదు.

ప్రాస బాగుంది అని చెప్పాను. ప్రపంచాన్ని నడిపిస్తున్న ఏంటంటే మిడిల్ క్లాస్ మైండ్‌ సెట్ నాది. ఇది మనకు అవసరం లేదు అని డబ్బులు మిగుల్చుకున్నాను. ఇందులో మొహమాటం ఏమీ లేదు. జర్నలిస్టుగా నాలుగు స్టోరీలు రాసి , నాలుగు రాళ్లు వెనకేసుకుని ప్రయాణికుడు ఛానెల్‌, వెబ్‌‌సైటును ముందుకు నడిపిస్తున్నాను. నాలుగు పైసలు సేవ్ చేసుకుంటే ఇంకా నాలుగు చోట్లు తిరగొచ్చు ( 30 Activities in Manali ) అనే ఆలోచన నాది .

11. ట్యూబ్ స్లైడింగ్ | Tube Sliding In Solang Valley , Manali

Tube Silding in manali solang valley
ప్రతీ కాత్మక చిత్రం

మనాలిలోని సొలాంగ్ వ్యాలి అనేది అడ్వెంచర్ టూరిజాన్ని ( Adventure Tourism ) ఇష్టపడి, యాక్టివిటీస్ చేయాలి అనుకునే వారికి బెస్ట్ స్పాట్. ఇక్కడ మీరు ట్యూబ్ స్లైడింగ్ తక్కువ ధరకే చేయవచ్చు. అయితే ఇది 30 సెకన్లలో అయిపోతుంది. డబ్బు తగలేయడమే అని నేను చేయలేదు.

12. జిప్‌లైన్ | Zipline in 30 Activities in Manali

30 Activities in Manali
Zipline In Manali

ఇక్కడ నేను తప్పకుండా చేయాలి అనుకున్నది జిప్ లైనింగ్. భారీ బండరాళ్లు, నది, చెట్ల పై నుంచి ఇలా జారుకుంటూ అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు వెళ్లడం చాలా థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. దీనికి రూ. 500 -రూ.2500 నుంచి చార్జీలు వసూలు చేస్తారు. రద్దీని బట్టి కూడా ధరలో హెచ్చు తగ్గులు ఉంటాయి.

13. మనాలి కాటేజ్‌ | Mana Cottages ( 30 Activities in Manali)

Sitting Peacefully in solang valley in manali
Sitting Peacefully in solang valley in manali

సొలాంగ్ వ్యాలీలో అరక్కు అనే కాటేజెస్ ఉంటాయి. మంచి గార్డెన్ దీంతో పాటు స్నో వ్యూ కూడా ఉంటుంది. ఇక్కడ ఒక అరుగు ఉంటుంది. అక్కడ కూర్చుని ఫోటో దిగితే మంచు కొండలు కూడా కవర్ అవుతాయి. మనాలి వెళ్లాము అని మనం చెప్పే అవసరం లేదు. ఈ పోటో చూస్తే చాలు మీరు మనాలిలో ఉన్నట్టు ఎవరైనా చెప్పేస్తారు.

14. ఒంటరి జలపాతం | Unexplored Waterfalls & Old Bridges in Manali

Unexplored Waterfalls and old bridge in manali
రైసన్ అనే ప్రాంతంలో ఉన్న జలపాతం, అక్కడి వెళ్లే దారిలో బ్రిడ్జి

మనాలి అనగానే ఆన్‌లైన్లో కనిపించే ఐదారు ప్లేసులను ( Top Places to Visit In Manali ) సెర్చ్ చేసి అక్కడికే వెళ్లాలి అని ఫిక్స్ అవుతారు చాలా మంది. కానీ లోకల్‌గా ప్రజలతో చర్చిస్తే వాళ్లు మీకు తక్కువ మంది వెళ్లిన ప్రాంతాలను సజెస్ట్ చేస్తారు. ఇక్కడ ఉన్న జలపాతం రైసన్ ( Raison ,Manali ) అనే ప్రాంతంలో ఉంది. ఇక్కడ నాకు ఎవరూ కనిపించలేదు. దీంతో పాటు ఈ జలపాతానికి వెళ్లే దారిలో ఒక పాత ఐరన్ బ్రిడ్జి ఉంటుంది. దీన్ని చూస్తే మనం గతంలోకి వెళ్లామేమో అనిపిస్తుంది. ఒకసారి మీ గైడ్‌ లేదా, డ్రైవర్‌ను అడగండి దీని గురించి. ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చాకే వెళ్లండి. ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది వెళ్లరు.

15. సూర్యోదయాన్ని చూడండి | Watching Sun Rise in Manali

Wearing Pahadi Cap In Manali
సూర్యోదయం అంటే రీచార్జ్ అవ్వడమే కదా

ఏంటి మనాలీలో సన్‌రైజ్ పాయింట్ ఉందా అనేగా మీరు ఆలోచిస్తున్నారు ? సూర్యుడు ప్రతీ చోట ఉదయిస్తాడు. అస్తమిస్తాడు. మనాలీలో కూడా సూర్యుడు ఉదయిస్తాడు. పర్వతాలను దాటి సూర్యుడు ఉదయించే సీన్ చాలా బాగుంటుంది. కానీ ఎవరూ దీని గురించి ప్రస్తావించరు. ఎందుకంటే సూర్యుడు ఉదయించడానికి ముందే రెడీ అయ్యి గడ్‌బడ్ గడ్‌బడ్‌గా కారెక్కి భయ్యా ఈ రోజు మనం ఇక్కడికి వెళ్లాలి అని డ్రైవర్‌ను అడుగుతాం. సోలోగా అయితే మన లిస్టులో ఉన్న వాటినే పూర్తి చేసే పనిలో ఉంటాం. వీలైతే మీరు ఒక రోజు స్నానం చేసి సూర్యుడిని ఉదయించడాన్ని చూడండి. శరీరాన్ని సూర్య రశ్మితో రీచార్జ్ చేయండి. వర్త్ వర్మ వర్త్ అని మీరే అంటారు.

16. హిమాచల్ కల్చరల్ మ్యూజియం | Museum of Himachal Culture and Folk Art

himachal traditional attire in manali
మ్యూజియం వెళ్తే వారి కట్టుబాట్లు అర్థం అవుతాయి

నిజానికి ఈ మ్యూజియమ్స్‌కు వెళ్లాలి అంటే నాకు బోరుగా అనిపించేది. కదలని బొమ్మలు, వస్తువులు, చరిత్ర , రాజులు రాణులు ఇవన్నీ ఒడవని ముచ్చట అని అనిపించేది . కానీ జర్నలిస్టు అయ్యాక వాటి విలువ తెలిసింది.మ్యూజియంలో చూసిన వస్తువులు, తెలుసుకున్న విషయాలు చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. మన గతం అది. మార్చలేని కథ అది. బాటనీ తెలిసిన వాడికి పూవులు అందం మరింత బాగా అర్థం అవుతుంది అంటారు.

ఒక ప్రాంత ప్రజల గురించి తెలుసుకోవాలి అనుకుంటే మ్యూజియంలు తప్పకుండా వెళ్లాలి అని కాస్త లేటుగా అర్థం అయింది. మనాలిలో హిమాచల్ ఆర్ట్ మ్యూజియం ఉంటుంది. ఈ మ్యూజియం కూడా వెళ్లాను. ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ ప్రజలు జీవన విధానాన్ని, వార ఆహారం, ఆర్ట్, ఆహార్యం గురించి మీరు తెలుసుకోవచ్చు.

17. బియాస్ నది తీరం | Beas River Side In Kullu and Manali

Leaser Time At Beas River Side In Kullu and Manali
బియాస్ నది

మనాలిలో కొండలు ( Himalayas in Manali ) ఎంత అందంగా ఉంటాయో అక్కడి బియాస్ నది కూడా అంతే అందంగా ఉంటుంది. నీటి ఫ్లో తక్కువగా ఉండటంతో మా కారు డ్రైవర్ సూచనల మేరకు రిస్కు తక్కువగా ఉన్న ప్రాంతంలో బియాస్ నదీ తీరంలో కానేసు టైమ్ స్పెండ్ చేశాను . ఇక్కడ పొరపాటున కాలు నీటిలో పెట్టాను. షూ మొత్తం తడిసిపోయింది. ఈ రోజు షూ లేకుండా మనాలిలో తిరిగాను. కాల్లకు జ్వరం వచ్చినట్టు అనిపించింది.

ఇక్కడి నీటిలో మీరు 5 సెకన్ల కన్నా ఎక్కువ టైమ్ చేయి పెట్టలేరు. ఇంకో విషయం తెలుసా ఈ నీటి రెండు సార్లు వేలు పెట్టానో లేదో…నా వేలికున్న ఉంగరం తళతళా మెరిసిపోయింది. మిమ్మల్ని ఇది ట్రై చేయమని చెప్పడం లేదు. ఎందుకంటే పొరపాటున మీ చేతికి ఉన్న ఉంగరం జారి కింద పడిపోవచ్చు.

18. కులు శాలువ పరిశ్రమ | Kullu Shawl wavering Industry visit

Kullu Shawl wavering Industry visit
శాలువ నేస్తున్న మహిళ

నార్త్ ఇండియాలో చలి ఎక్కువ. దీంతో శాలువలు కూడా బాగా సేల్ అవుతాయి. పైగా ఈ మధ్య శాలువల ట్రెండ్ నడుస్తోంది. ఈ షాల్స్ ఎలా తయారు చేస్తారో చూడాలి అనుకుంటే మీరు మనాలిలో ట్రై చేయవచ్చు. మీ టూర్ గైడ్ లేదా కారు డ్రైవరును ” Bhayya, Yaha Shawls Kaha Banathe ?” అని అడిగితే అతనే తీసుకెళ్తాడు.

19. సన్‌సెట్ వ్యూ | Sun Set in Manali ( 30 Activities in Manali )

sunset in manali
మొబైల్లో చూస్తూ తల దించడం కన్నా..సూర్యుడిని చూసేందుకు తల ఎత్తడం మిన్న

ఉదయం నుంచి వివిధ ప్రాంతాలను అన్వేషించిన తరువాత మీ స్టే లేదా హోటల్‌కు వచ్చి రిఫ్రెష్ అయ్యాక, వేడి వేడి టీ తాగుతూ సూర్యస్తమయాన్ని చూడండి. మనం వచ్చింది చెక్ లిస్టు కంప్లీట్ చేయడానికి కాదు. మెమోరీస్ పోగు చేయడానికి. వేగంగా నాలుగు చోట్లు తిరగడం కన్నా ప్రశాంతంగా ఒక ప్లేసు ఎంజాయ్ చేయడం బెస్ట్.

నేను 5 రోజులు ఉన్నాను మనాలిలో. ఎక్కడ ఎంత సేపు ఉండాలి అనిపిస్తే అంత సేపు ఉన్నాను. అనసరమైన ఖర్చులకు పోకుండా, అనవసరమైన వస్తువులు కొనకుండా, మనాలిలో నాకు కావాల్సిన మెమోరీస్ కలెక్ట్ చేసుకున్నాను. కొన్ని చోట్ల ఆపమన్నప్పుడు డ్రైవర్ ఏమనుకుంటాడో అని ఆలోచించరాదు మనం. అన్నా ఇక్కడ ఎవరూ ఆపరు అని డ్రైవర్ అన్నా మనం మాత్రం మన పని చేసుకోవాలి. నేను కూడా అలాగే చేశాను.

సన్మాలపై ఆశలేదు. అవమానలంటే భయం లేదు. ఎవరినీ ఇంప్రెస్ చేయాలనే కోరిక లేదు.

20. యాపిల్ చెట్లు | Visiting Apple Garden, Checking Apple Plants in Manali

Visiting Apple Garden and watching leaf and Apple Plants in Manali
మనాలిలో ఒక చోట యాపిట్ తోట. యాపిల్ చెట్టు ఆకు, యాపిల్ మొక్క

మనాలిలో యాపిల్ సీజన్లో వెళ్తే మీరు ఎర్రని యాపిల్స్ చూడొచ్చు. కానీ నేను వెళ్లినప్పుడు చెట్టు పూర్తిగా ఆకులు లేకుండా ఉంది. దీంతో ఎండిన కొమ్మలు రాలిన ఆకులను మాత్రమే చూశాను. మనాలి మాల్ రోడ్డులో యాపిట్ మొక్కలను అమ్ముతారు. నేను యాపిల్ గింజలు తెచ్చి ఇంట్లో వేశాను. భూమిలోకి ఇంకిపోయి ఎవరువుగా మారిపోయాయి. కానీ మొలకెత్తలేదు. హైదరాబాద్‌లో యాపిల్స్ పండవు కదా. బట్ ఏదో ఆశతో ట్రై చేశాను.

ఇది కూడా చదవండి : Lambasingi : నేషనల్ క్రష్ లంబసింగి ఎలా వెళ్లాలి ? నిజంగా స్నో పడుతుందా ? 5 Tips & Facts

21. హిడింబా దేవి ఆలయం | Hidimba Devi Temple

Hidimba temple in manali
హిడింబా దేవి ఆలయం

ఇది భీముడి సతీమని హిడింబా దేవి ఆలయం. మనాలికి వచ్చే వారిలో 99 శాతం ఇక్కడి వస్తుంటారు. ఈ ఆలయ నిర్మాణ శైలి బాగుంటుంది. లొకేషన్ కూడా బాగుంటుంది.

22. అటల్ టన్నెల్ | Atal Tunnel

Atal Tunnel
అటల్ టన్నెల్

రోహ్తాంగ్ పాస్ ( Rohtang Pass ) అనే మార్గంలో అటల్ టన్నెల్ ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అతిపెద్ద సోరంగ మార్గం ( Longest High Way Tunnel In the World ) . లద్దాఖ్ చేరుకునే మార్గం ఏడాదికి ఐదారు నెలల మూసి ఉండేది. దీంతో స్థానికులు చాలా ఇబ్బంది పడేవారు. వారి కోసం ఈ టన్నెల్ ఏర్పాటు చేశారు. ఈ టన్నెల్‌ చాలా బాగుంటుంది. దీని పక్కనే చంద్రా రివర్ ఉంటుంది.

23. పహడి టోపి | Kinnauri Topi

Wearing Pahadi Cap in Manali In Himachali Style
కిన్నోరీ క్యాప్‌లో కిషోర్

రోమ్‌లోనే కాదు హిమాచల్‌లో ఉన్నప్పడు కూడా హిమాచల్ ప్రదేశ్ వాసిలా ఉండాలి. అందుకే నేను ఈ పహాడీ క్యాప్ కొన్నాను. దీనిని హిమాచల్ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో స్థానికులు ఎక్కువగా ధరిస్తారు. దీనిని కిన్నోరి టోపీ అని కూడా అంటారు. ఎందుకంటే దీనిని కిన్నోర్ ప్రాంతంలో ( Kinnaur Region ) ఎక్కువగా ధరిస్తారు.

24. ఐరన్ బ్రిడ్జిల అందాలు | Iron Bridges in Himachal Pradesh

Watching The Beautiful Iron Bridges in manali
ఐరన్ మ్యాన్ కూడా ఇష్టం. ఐరన్ బ్రిడ్జిలు కూడా ఇష్టమే.

భారత దేశపు ఉత్తర భాగంలో ఎక్కువగా కనిపించే ఐరన్ బ్రిడ్జిలు చాలా అందంగా ఉంటాయి. వీటి నుంచి వెళ్లే సమయంలో కలిగే అనుభూతి వేరు. ఒకసారి ట్రై చేసి చూడండి

25. నదీ తీరంలో | Beas River Side White Sand

write your name and take a snap at beas river side white sand in manali
ఎవరి పిచ్చి వారికి ఆనందం

ఇసుక అనేది ఎడారి, సముద్ర తీరాల్లోనే కాదు నదీ తీరాల్లో కూాడా ఉంటుంది. మనాలిలో బియాస్ నదీ తీరంలో తెల్లని ఇసుక కనిపిస్తే ఇలా పేరు రాసి గులక రాళ్లతో ఫ్రేమ్ కూడా డిజైన్ చేశాను. ఇది కూాడా ఒక ఆర్ట్ అయితే నేను ఒక ఆర్టిస్టునేమరి

26. రోడ్డు జర్నీ | Manali Road Trip

Cars At Manali Sissu Valley
మెల్లిగా వెళ్లండి

మంచు కొండల్లో ( Snow Mountains Of Himalayas ) వెళ్లే సమయంలో మీరు కారు నడపడం కన్నా…ట్యాక్సీ తీసుకోవడం బెస్టు. ఎందుకంటే మీరు వ్యూస్ ఎంజాయ్ చేయవచ్చు. దానికి తోడు అక్కడి టర్నింగ్స్ అవన్నీ మనకన్నా స్థానికులకే బాాగా తెలుసు.

27. దగ్గర్లో చూడాల్సినవి | Places Near Manali

Distance Of Places From Manali
మనాలి నుంచి ఏ ప్రదేశం ఎంత దూరం అంటే

మనాలికి వచ్చే ముందు ఇతర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉందా లేదా చూసుకోండి. ఇక్కడి నుంచి మీరు జిబీ వ్యాలీ ( Jibi Valley ) , స్పితీ వ్యాలీ ( Spiti Valley ) , సిసు వ్యాలీ, లద్దాఖ్ ( Laddakh ) వంటి అనేక ప్రదేశాలకు కూాడా వెళ్లొచ్చు.

28. మనాలిలో లోకల్ మార్కెట్ | Manali Local Market

మనాలి మాల్ రోడ్డులో లోకల్ మార్కెట్‌లో మీరు షాపింగ్ బాగా ఎంజాయ్ చేయవచ్చు. ఇక్కడ లోకల్‌గా చైనా, నేపాల్ నుంచి వచ్చిన వస్తువులు, జాకెట్స్, మఫ్లర్స్, గ్యాడ్జెట్స్ కలెక్షన్ మీకు నచ్చుతుంది.

29. మనాలి ఫుడ్ | Food in Manali

మనాలిలో మీరు మంచి మంచి లొకేషన్స్ చూడటమే కాదు మంచి మంచి ఫుడ్ కూడా ఎంజాయ్ చేయవచ్చు. ఇక్కడ మీరు ధామ్, సిడు, ఛనా మాద్రా, కులు ట్రౌట్ అనే హిమాచలీ వంటకాలు ( Himachali Cuisine ) ఎంజాయ్ చేయవచ్చు. దీంతో పాటు నార్త్, సౌత్ , చైనీస్ వంటకాలు కూడా లభిస్తాయి.

30. కులులో విజయ దశమి | Kullu Dussehra Festival

కులులో విజయ దశమి వేడుకలు చూడటానికి చాలా మంది దూర దూరం నుంచి వస్తూ ఉంటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి .

ముగింపు

మనాలిలో నాకు తోచిన, నేను ఎక్స్‌పీరియెన్స్ అయిన వాటినే నేను షేర్ చేశాను. ఇలా లిస్టు రాసుకుంటూ వెళ్తే కొన్ని వందల యాక్టివిటీస్ ఉంటాయి. వాటి గురించి మరెప్పుడైనా మీతో షేర్ చేసుకుంటాను ( 30 Activities in Manali ). మీరు ఏమైనా సజెస్ట్ చేయాలి అనుకుంటే కామెంట్ చేయగలరు.

గమనిక: ఈ వెబ్‌సైట్లో ప్రకటనలు కూడా ఉంటాయి. ముఖ్యంగా గూగుల్ యాడ్స్ ద్వారా ఈ ప్రకటనలు మీకు కనిపిస్తాయి. ఈ ప్రకటనలే మాకు ఆధారం. ఇందులో కొన్ని ప్రకటనలపై మీరు క్లిక్ చేస్తే మాకు ఆదాయం వస్తుంది.


మనాలి తెలుగు వ్లాగ్ | Manali Telugu Vlog

మనాలిపై ప్రయాణికుడు య్యూట్యూబ్ ఛానెల్‌లో ఒక వీడియో చేశాను. ఇందులో మనాలి ఎలా వెళ్లాలి ? ఎక్కడ ఉండాలి ? ఏం చూడాలి ? ఇలా చాలా వివరాలు ( 30 Activities in Manali ) షేర్ చేశాను.

Watch : మనాలీ కంప్లీట్ ట్రావెల్ గైడ్

Prayanikudu

Watch More Vlogs On : Prayanikudu

ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

ప్రపంచ యాత్ర గైడ్

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!