Travel Smarter : 2025 లో ట్రావెలర్స్ వద్ద ఉండాల్సిన 5 గ్యాడ్జెట్స్

Share This Story

ఈ ప్రపంచం ఎంత వేగంగా మారుతోందో అంతే వేగంగా ప్రయాణికులు స్మార్ట్‌ ( Travel Smarter ) అవుతున్నారు. నిత్యం కొత్త కొత్త పరికరాలు, సాంకేతికను వాడుతున్నారు. మీరు కూడా స్మార్ట్ ట్రావెలర్ అవ్వాలంటే ఈ 5 పరికరాల గురించి తెలుసుకోండి.

స్మార్ట్‌గా ప్రయాణించండి | Travel Smarter

మీరు నా అన్వేషణలో అన్వేష్‌లా ( Naa Anveshana ) ప్రపంచ యాత్ర చేస్తున్నా లేదంటే సూపర్ స్టార్ మహేష్ బాబులా ( Mahesh Babu ) కుటుంబంతో కలిసి తరచూ విహార యాత్రకు వెళ్తున్నా…ఎలా వెళ్తున్నా స్మార్ట్‌గా ప్లాన్ చేసుకోండి. 

  • మీ వద్ద ఉన్న పరికరాలు ( Gadgets ) అన్ని సరిగ్గా పని చేస్తున్నాయా, ఫుల్‌గా చార్జ్ అయ్యాయా అనేవి ముందుగానే చెక్ చేసుకోడంతో స్మార్ట్ ట్రావెలర్ అయ్యే ప్రక్రియను మీరు ప్రారంభించవచ్చు.
  • మీ ప్రయాణంలో మంచి టెక్నికల్ ఎక్విప్‌మెంట్ ఉంటే ప్రయాణాన్ని ప్రశాంతంగా ఎంజాయ్ చేయవచ్చు.
  • దీని కోసం ఇంటర్నెట్ ఎప్పుడూ అందుబాటులో ఉండేలా పోర్టబుల్ వైఫై, కరెంటు లేని ప్రాంతాల్లో ఛార్జింగ్ చేసుకోవడానికి సోలార్ పవర్ బ్యాంకు , ఇలా 2025 లో ఎక్కడికి వెళ్లినా మీరు ఖచ్చితంగా ఈ 5 పరికరాలను తీసుకెళ్లండి. స్మార్ట్‌గా ట్రావెల్ చేయండి.
  • ఇది కూడా చదవండి :  First time Flyers : ఫస్ట్ టైమ్ విమానం ఎక్కుతున్నారా ? ఈ 10 టిప్స్ మీ కోసమే

ప్రయాణాన్ని సులభతరం చేసే 5 గ్యాడ్జెట్స్ | Top 5 Travel Gadgets for 2025

1. యాంటి థెఫ్ట్ ట్రావెల్ బ్యాగ్ | Anti Theft Travel Bag

పర్యాటక ప్రాంతాల్లో దొంగలు కూడా ఉంటారు. అందుకే యాంటి థెఫ్ట్ ట్రావెల్ బ్యాగ్ అనేది ఈ రోజుల్లో ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ బ్యాగులో ఒక సీక్రెట్ పాకెట్, కత్తిరించలేని స్ట్రాప్స్, దీంతో పాటు ఆర్‌ఎఫ్ఐడీ బ్లాకింగ్ సాంకేతికత కూాడా ఇందులో ఉంటాయి. ఆర్‌ఎఫ్‌ఐడీ ( RFID ) వల్ల మీ డెబిట్ , క్రెడిట్ కార్డులను మీకు తెలియకుండా ఎవరైనా స్కాన్ చేయాలనుకున్నా చేయలేరు.

Travel Smarter
Anti Theft Travel Bag

ఈ బ్యాగులు మీకు పలు మోడల్స్‌, స్టైల్స్‌లో అందుబాటులో ఉంటాయి. రెగ్యులర్‌గా వాడే బ్యాక్ ప్యాక్స్‌  ( Back Pack ) , క్రాస్ బాడీ వంటి వెరియేషన్‌లో ఇవి లభిస్తాయి. ఇందులో మీరు పాస్ పోర్ట్, ఫోన్, క్యాష్ ఇంకా డాక్యుమెంట్స్  దాచుకోవడానికి పాకెట్స్ ఉంటాయి. బ్రాండ్, ఫీచర్లను బట్టి వీటి ధర రూ.500 నుంచి రూ.10 వేల వరకు ఉంటాయి.

2. పోర్టబుల్ వైఫై హాట్‌స్పాట్ | Portable Wi-Fi Hot Spot

ఈ రోజుల్లో వైఫై లేదా మొబైల్ ఇంటర్నెట్ అనేది నిత్యవసరం నుంచి అత్యవసరంగా మారింది. మీరు వెళ్లాలి అనుకున్న ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడ వైఫై లేదంటే కాస్త నిరాశగానే ఉంటుంది కదా. ఈ నిరాశ చీకటిని పోర్టబుల్ వైఫై హాట్‌స్పాట్‌ పరికరంతో తొలగించండి.

a white phone next to an orange speaker
| కొత్త ప్రదేశంలో మీ సొంత వైఫై వినియోగించవచ్చు

ఎందుకంటే మీరు ఎక్కడ ఉన్నా ఈ డివైజ్ మీకు పర్సనల్ వైఫై నెట్వర్క్‌లా పని చేస్తుంది. దీంతో పాటు ఇక హోటల్స్‌లో, రిసార్టుల్లో వైఫై వాడే అవసరం కూడా ఉండదు. ఇక మీరు సోలా ప్రయాణం ( Solo Traveling )  చేస్తున్నా, జంటగా లేక టీమ్‌తో కలిసి వెళ్తున్నా…ప్రపంచంతో మీ కనెక్షన్ అస్సలు తెగిపోదు.

3. సోలార్ పవర్ బ్యాంక్ | Solar Power Bank

ఈ రోజుల్లో మన ఫోన్‌తో పాటు ఇతర పరికరాలను చార్జ్ చేసి పెట్టడం అనేది చిన్న ఛాలెంజ్ లాంటిదే. మరీ ముఖ్యంగా ప్రయాణాల్లో ఉన్నప్పుడు మరీ ఈ ఛాలెంజ్ కాస్త కష్టంగా మారిపోతుంది. దీని కోసం మీరు మల్టి కేబుల్ సోలార్ పవర్ బ్యాంక్ వినియోగింవచ్చు. ఇది ఇకో ఫ్రెండ్లీ అయిన చార్జింగ్ విధానం.

solar Power Bank-pexels
| పాత విధానంలా అనిపించ్చు మీకు. కానీ సూర్యుడు, సూర్య శక్తి ఎవర్ గ్రీన్

మీరు లాంగ్ ట్రెక్స్ ( Trekking) లేదా హైకింగ్‌కి వెల్లినా, బీచులో ఔటింగ్‌కు వెళ్లినా, లేదా సాహసయాత్రకు బయల్దేరినా ఈ పవర్ బ్యాంకు మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇంట్లో ఉంటే సాధారణ పవర్ బ్యాంకును కూడా మనం చార్జ్ చేస్తేనే మనకు ఉపయోగపడుతుంది.  సోలార్ పవర్ బ్యాంకు ఉంటే ఎండ ఉంటే చాలు దీనిని రీచార్జ్ చేసి వాడుకోవచ్చు. ఆన్‌లైన్‌లో బ్రాండ్, కెపాసిటీని బట్టి ( Solar Power Bank Price )  ఇవి రూ.2000 నుంచి రూ.8000 వరకు మీకు లభిస్తాయి. రిఫరెన్స్ కోసం ఒక లింక్ అందిస్తున్నాను. క్లిక్ చేయండి.

4. ట్రాకిబుల్ పాస్‌పోర్ట్ వ్యాలెట్ | Trackable Passport Wallet

విదేశాల్లో ఉన్నప్పుడు పాస్‌ పోర్టును ( Passport ) గుండెకాయలా చూసుకోవాలి. ఒక వేళ అది మిస్ అయితే సగం ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో మీకు ట్రాకిబుల్ పాస్‌పోర్ట్ వ్యాలెట్ ఉపయోగపడుతుంది.

Trackable Passport Holder
| పాస్‌పోర్ట్ భద్రంగా ఉండాలి అంటే ఈ పాస్‌పోర్ట్ ట్రాకర్ మీకు ఉపయోగపడుతుంది.

ఇందులో ఉన్న బ్లూటూత్ ట్రాకింగ్ టెక్నాలజీ ( Bluetooth Tracking Technology ) వల్ల మీ పాస్‌పోర్ట్ ఉన్న వ్యాలెట్ మిస్ అయినా మీ ఫోన్ వాడి దాని లొకేషన్ ట్రాక్ చేయవచ్చు. ఈ వ్యాలెట్‌లో క్రెడిట్, డెబిట్ కార్డులు, బోర్డింగ్ పాస్, ఇతర డాక్యుమెంట్స్ దాచుకునే సదుపాయం కూడా ఉంటుంది. 

5. హ్యాండ్ ఫ్రీ ఫోన్ హోల్డర్ | Handsfree Travel Phone Holder 

ఈ డిజైజ్ ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువ పాపులర్ అవుతోంది. దీనికి కారణం మీరు ఏదైనా కొత్త ప్రదేశంలో ఉన్నప్పుడు హోటల్స్‌లో, వాహనాాల్లో దీనిని సులభంగా వాడుకోవచ్చు. ఫోనును చేతితో పట్టుకోకుండా డెస్కుకు, సీటుకు ఒక క్లిప్పులా పెట్టేసి వీడియోలు, ఫోటోలు, మ్యాప్స్ చూడవచ్చు. కార్లు, బైకు, విమానం ( Flights ) , బస్సులో కూడా వీటిని వినియోగించవచ్చు.

Handless Mobile Holder-unsplash
| ఆన్‌లైన్లో మీకు వందల రకాలు మొబైల్ హోల్డర్స్ లభిస్తాయి

360 డిగ్రీలు రొటేట్ అయ్యే ఈ హోల్డర్ వల్ల మీరు సులభంగా వీడియో కాల్స్, వీడియో రికార్డింగ్, వ్లాగ్స్ ( Travel Vlogs ) కూడా చేసుకోవచ్చు. బ్రాండ్, క్వాలిటీ , ఫీచర్లను బట్టి వీటి ధర రూ.600 నుంచి రూ.3000 వరకు ఈ హోల్డర్లు లభిస్తాయి.

ఈ ఆర్టికల్‌లో ప్రస్తావించిన గ్యాడ్జెట్స్ వినియోగించి మీరు ప్రయాణాన్ని ప్రశాంతంగా కొనసాగింవచ్చు. ఇవే కాకుండా మీకు తెలిసిన, మీరు వాడుతున్న స్మార్ట్ గ్యాడ్జెట్స్ ( Smart Gadgets ) ఏమైనా ఉంటే కామెంట్ చేయగలరు.

Share This Story

Leave a Comment

error: Content is protected !!