Friendship Day Trip : స్నేహితులతో కలిసి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా ? 6 అద్భుతమైన ప్రదేశాలు ఇవే
Friendship Day Trip : ఏడాది మొత్తం ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నా, ఎక్కడ ఉన్నా ఫ్రెండ్‌షిప్‌డే రోజు మాత్రం పక్కాగా ఫ్రెండ్స్‌తో టైమ్ స్పెండ్ చేయాలనిపిస్తుంది. మీరు కూడా మీ ఫ్రెండ్స్‌తో కలిసి జాలీగా ఎంజాయ్ చేయాలని.. ఒక చిన్న టూరేయాలని ప్లాన్ చేస్తోంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 6 అద్భుతమైన ట్రావెల్ డెస్టినేషన్స్ మీ కోసం…
ముఖ్యాంశాలు
01. అరకు లోయ | Araku Valley
ఇంత షార్ట్ పిరియడ్‌లో అరకు వ్యాలీ (Araku Valley ) ఎలా అది కూడా ఒక్క రోజులో ఎలా అని ఆలోచిస్తున్నారా ? మీ ఆలోచన కరెక్టే కానీ ఫ్రెండ్‌షిప్‌డే సండేతో ఎండ్ అవుతుంది…కానీ ఫ్రెండ్షిప్ కాదు కదా.
వీలైతే మరో రెండు రోజులు యాడ్ చేసుకునేందుకు ట్రై చేస్తే అరకు లోయ ట్రిప్ మీ పాత రోజుల్ని తప్పకుండా గుర్తు చేస్తుంది.

వైజాగ్ (Vizag) నుంచి అరకు వెళ్లే దారిలో 50 కన్నా ఎక్కువగా టన్నెల్స్ ఉంటాయంటారు. నేను వెళ్లాను కానీ లెక్కపెట్టలేదు. మీరు వెళ్తే లెక్కపెట్టండి. మీ గ్యాంగులో లెక్కల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకున్న ఆ ఫ్రెండుకు ఈ పని ఇవ్వండి.
- ఇది కూడా చదవండి : Araku Trip : జస్ట్ రూ.2000 లకే అరకు ట్రిప్
Friendship Day Trip : ఇక్కడికి వెళ్తే మీరు బొర్రా గుహలు (Borra Caves) చూడొచ్చు, జలపాతాలు చూడొచ్చు, గిరిజనులు సంప్రదాయలు తెలుసుకోవచ్చు, అరకు కాఫీ(Araku Coffee) తోటలల్లో కాఫీ రుచి చూడొచ్చు…ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి.
2. లంబసింగి | Lambasingi
అరకు టూరును కంటిన్యూ చేయాలి అనుకున్నా..లేదంటే డైరక్టుగా వెళ్లాలి అనుకున్నా…ఎలా అనుకున్నా లంబసింగి ట్రిప్ అనేది మీ లిస్టులో తప్పకుండా చేర్చుకోండి. లంబసింగిని ఆంధ్రా కాశ్మీర్ (Andhra Kashmir) అని పిలుస్తారు. ఎందుకు అలా పిలుస్తారో తెలుసుకోవడానికి ట్రై చేయండి.
- ఇది కూడా చదవండి : Lambasingi : నేషనల్ క్రష్ లంబసింగి ఎలా వెళ్లాలి ? నిజంగా స్నో పడుతుందా ? 5 Tips & Facts
ఇక్కడ మీ ఫ్రెండ్స్‌తో కలిసి చిల్ అవ్వొచ్చు, క్యాంప్ ఫైర్, బోన ఫైర్ ఇలా చాలా ప్లాన్ చేయొచ్చు. ప్రపంచం నుంచి దూరంగా మరో ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతి కలిగిస్తుంది లంబసింగి.
3. అనంతగిరి హిల్స్ | Ananthagiri Hills
వికారాబాద్, తెలంగాణ
హైదరాబాద్ దగ్గర్లో ఉన్న అందమైన పర్యాటక ప్రాంతాలలో అనంతగిరి హిల్స్ ఒకటి. సిటీ నుంచి 80 కిమీ దూరంలో ఉన్న ఈ డెస్టినేషన్‌ను మీరు ఒక్కరోజులోనే కవర్ చేయవచ్చు. పైగా వర్షాకాలంలో ఈ రూట్ మిమ్మల్ని మేఘాలయలో (Meghalaya) ఖాసీ హిల్స్‌లో (Khasi Hills ) ఉన్న ఫీలింగ్ కలిగిస్తుంది.
చుట్టూ పరుచుకుని ఉన్న పచ్చదనం, స్వచ్ఛమైన గాలి, దూర దూరం వరకు అనంతంగా కనిపించే ఆకాశం ఇవన్నీ మీ రీయూనియన్‌ను మెమోరెబుల్గా మార్చేస్తాయి.
4.సూర్యలంక బీచ్ | Suryalanka Beach
బాపట్ల | ఆంధ్రప్రదేశ్ : బీచ్‌లో హ్యాప్పిడేస్ గ్యాంగ్‌లా ఎంజాయ్ చేయాలి అనుకుంటే మీకు సూర్యలంక బీచు బాగా సెట్ అవుతుంది. విజయవాడ లేదా హైదరాబాద్ అయినా మీకు ఒక్క రోజు సరిపోతుంది.
- ఇది కూడా చదవండి : Ooty Itinerary : 3 రోజుల్లో ఊటిలో ఏ ఏ ప్రాంతాలు కవర్ చేయవచ్చంటే
సూర్యలంకే ఎందుకు అంటే (Beaches In Andhra Pradesh)…ఇక్కడి సువర్ణ శోభితమైన ఐమీ న్ గోల్డెన్ కలర్ ఇసుక తీరాలు, బీచు రిసార్టులు, చల్లని గాలి ఇవన్నీ సహజంగానే మీ మనసును తేలికపరుస్తాయి. ఆహ్లాదకరమైన బీచు, ఆనందాన్ని ఇచ్చే ఫ్రెండ్సు…ఇంకేం కావాలి అనుకుంటోంది మీ మనసు ?
5. నల్లమల ఫారెస్ట్ | Nallamala Forest
కర్నూలు అండ్ నాగార్జునా సాగర్ మధ్యలో నల్లమల ఫారెస్ట్ ఏరియాలో మీ స్నేహితులతో కలిసి సాహసయాత్రకు ప్లాన్ చేయొచ్చు. అడవిలో అల్లరి చేయకుండా పద్ధతిగా సాగిపోయే అడ్వెంచర్ టూరు (adventure Tour) మీకు జీవితాంతం గుర్తుండిపోతుంది.
కాకులు దూరని కారడవిలో కలిగి కిక్కు, థ్రిల్ ఏంటో మీరు కూడా ఫీల్ అవ్వొచ్చు. ప్రకృతి ఒడిలో మమేకం అయిపోయి పూర్తిగా రీచార్జ్ అవ్వొచ్చు మీరు.
ప్రభుత్వ టూరిజం శాఖ అందించే ప్యాకేజీలో బుక్ చేసుకుంటే మీరు జీప్ సఫారీని కూడా ఎంజాయ్ చేయవచ్చు.
6. గండికోట | Gandikota

కడప, ఆంధ్రప్రదేశ్ | గ్రాండ్ కానియన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు తెచ్చుకున్న గండికోట జాలీ ట్రిప్ కోసం బాగా సెట్ అవుతుంది. ఫ్రెండ్స్ అంతా కలిసి ఈ ట్రిప్‌ను ఎంజాయ్ చేయడంతో పాటు మంచి ఫోటోలు కూడా తీసుకోవచ్చు.
- ఇది కూడా చదవండి : గండికోటను టూరిజం హబ్‌గా డెవెలెప్ చేస్తామన్న చంద్రబాబు
కొండపై క్యాంప్‌ఫైర్‌లో సరదాగా కబుర్లు చెప్పుకోవచ్చు. హ్యాప్పీడేస్ మళ్లీ గుర్తొస్తాయి మీకు.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.