విమానాశ్రయంలో సమర్థదతను పెంచేందుకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ( BCAS ) , సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ( CISF ) కొత్త హ్యాండ్ బ్యాగేజీ నియమాలను తీసుకువచ్చాయి. రోజు రోజుకూ ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో సెక్యూరిటీ ప్రాసెస్‌ను సులభతరం చేసి, రద్దీని తగ్గించే దిశలో ఈ నిర్ణయాలు ( New Hand Baggage Rules ) తీసుకున్నారు. మరిన్ని వివరాలు…
ముఖ్యాంశాలు
1. ఒకే బ్యాగు | New Hand Baggage Rules & Policy
డొమెస్టిక్ విమానం అయినా, లేక అంతర్జాతీయ విమానంలో ప్రయాణిస్తున్నా ట్రావెలర్స్ ఇకపై తమతోపాటు ఒక హ్యాండ్ బ్యాగును మాత్రమే తీసుకెళ్లగలరు. ఒకటికన్నా ఎక్కువ బ్యాగులు తీసుకొస్తే దాన్ని చెకిన్ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రతీ బ్యాగుకు ఒక వెయిట్ లిమిట్ కూడా ఉంటుంది.

2. బరువు | Weight Limits of Travel Bags
విమానంలో ప్రయాణించే ట్రావెలర్స్‌కు వారి టికెట్ శ్రేణిని బట్టి బ్యాగుల బరువుపై పరిమితులు విధించారు.
- ఎకానమీ , ప్రీమియం ఎకానమీ : 7 కేజీల వరకు బరువున్న ఒక బ్యాగు
- ఫస్ట్, బిజినెస్ క్లాస్ : 10 కేజీల వరకు బరువున్న ఒక బ్యాగు
సో మీ ప్యాకింగ్ ముగిశాక బయల్దేరే ముందు బరువు కూడా చెక్ చేసుకోండి.
3. సైజు పరిమితులు | Hand Bag Size Restrictions

హ్యాండ్ బ్యాగ్ సైజు విషయంలో కూడా కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. మీ బ్యాగు ఈ సైజులో ఉందో లేదో చెక్ చేయండి.
- బ్యాగు ఎత్తు : 55 సెంటీ మీటర్లు ( 21.6 ఇంచులు )
- పొడవు : 40 సె.మీ ( 15.7 ఇంచులు )
- వెడల్పు : 20 సెం.మీ ( 7.8 ఇంచులు )
మీ బ్యాగులు ఈ సైజులో ఉండేలా చూసుకుంటే చెక్ పాయింట్స్‌లో ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంది.
4. వీరికి మినహాయింపు | Exemptions for New Hand Baggage Rules
ఒక వేళ మీరు 2024 మే 2కు ముందే టికెట్లు బుక్ చేసుకుని ఉంటే ( One Bag Rule For Before May 2, 2024 Bookings ) మీకు కొన్ని మినహాయింపులు లభించే అవకాశం ఉంది. అవి…
- ఎకానమీ క్లాసులో : 8 కిల వరకు తీసుకెళ్లవచ్చు
- ప్రీమియం ఎకానమీలో : 10 కిలోల వరకు
- ఫస్ట్, బిజినెస్ క్లాసులో : 12 కేజీల వరకు తీసుకెళ్లవచ్చు
5. మరి 2024 మే 2వ తేదీ తరువాత బుక్ చేసుకుంటే ?
One Bag Rule For Post May 2, 2024 Bookings : 2024 మే 2 తరువాత టికెట్లు కొనుగోలు చేసిన వారు, వారి టికెట్ క్లాసు ఏదైనా పైన వివరించిన కొత్త హ్యాండ్ బ్యాగ్ ( New Hand Bag Rules ) నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.
6. కొత్త రూల్స్ ఎందుకంటే ?
Why New Hand Baggage Rules : సెక్యూరిటీ చెక్స్ సమయంలో ప్రయాణికులు వేగంగా ముందుకు కదిలే దిశలో ఈ కొత్త నియమాలను తీసుకొచ్చినట్టు సమాచారం. బ్యాగుల సంఖ్య తగ్గడంతో తక్కువ సమయంలో ఎక్కువ మంది ప్రయాణికులు సెక్యూరిటీ చెకింగ్‌ను పూర్తి చేసుకునే అవకాశం ఉంది.
7. స్మార్ట్‌గా ప్యాక్ చేసుకోవాలి
బ్యాగేజికి సంబంధించి కొత్త రూల్స్ అమలులోకి వచ్చిన తరువాత మీరు బ్యాగులను జాగ్రత్తగా ప్యాక్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త రూల్స్‌కు తగిన విధంగా మీ బ్యాగులు లైట్‌గా ఉండేలా చూసుకోండి.
మీ ప్రయాణానికి ( Travel ) ముందు ఈ కొత్త నియమాలను పాటిస్తూ మీ ప్రయాణాన్ని ప్లాన్ చేయండి. మీ ప్రయాణానికి సంబంధించిన ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. తెలిస్తే మీకు సమాధానం చెబుతాము. లేదంటే కనీసం ప్రయత్నిస్తాం.
గమనిక: ఈ వెబ్‌సైట్లో ప్రకటనలు కూడా ఉంటాయి. ముఖ్యంగా గూగుల్ యాడ్స్ ద్వారా ఈ ప్రకటనలు మీకు కనిపిస్తాయి. ఈ ప్రకటనలే మాకు ఆధారం. ఇందులో కొన్ని ప్రకటనలపై మీరు క్లిక్ చేస్తే మాకు ఆదాయం వస్తుంది.
Watch More Vlogs On : Prayanikudu
- Pandharpur: 7 గంటల్లో 7 ఆలయాల దర్శనం
- Hemkund Sahib Trek : హిమాలయాల్లో బ్రహ్మకమలం దర్శనం
- Kamakhya Temple: కామాఖ్య దేవీ కథ
- Tuljapur : శివాజీ నడిచిన దారిలో తుల్జా భవానీ మాత దర్శనం
- Shillong : అందగత్తెల రాజధాని షిల్లాంగ్
ఈ Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
ప్రపంచ యాత్ర గైడ్
- అంటార్కిటికా : 70 శాతం మంచినీరు ఇక్కడే ఉంది…రాత్రి సూరీడు…పగలు చీకటి
- Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు
- Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
- Milaf Cola : ఖర్జూరంతో సాఫ్ట్ డ్రింక్ లాంచ్ చేసిన సౌదీ అరేబియా
- Egypt Travel Guide: ఈజిప్ట్..ఇక్కడ డబ్బు కట్టి సమాధులను చూస్తారు.. 15 Facts
- ప్రపంచ యుద్ధం వస్తే ఈ 10 దేశాలు చాలా సేఫ్
- Thailand 2024 : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?
- Azerbaijan అజర్ బైజాన్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? 10 టిప్స్!
- UAE: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు
- సౌదీ అరేబియాకి ఎవరైనా వెళ్లవచ్చా ? వెళ్తే ఏం చూడవచ్చు?
- Indian License : భారతీయ లైసెన్స్ ఈ 15 దేశాల్లో కూడా చెల్లుతుంది
- Oymyakon : ప్రపంచంలోనే అత్యంత చల్లని గ్రామం