హైదరాబాద్‌లో న్యూ ఇయర్ ట్రాఫిక్ ఆంక్షలు, ఫ్లైఓవర్లు మూసేస్తారు..ఈ రెండు తప్పా | Hyderabad New Year 2025 Travel Guide

షేర్ చేయండి

ఒక వేళ మీరు న్యూ ఇయర్ సందర్భంగా ( Hyderabad New Year 2025 ) ట్యాంక్‌బండ్ వెళ్లాలని అనుకుంటే ఈ ప్రాంతాల్లోనే మీ వాహనాన్ని పార్క్ చేయాల్సి ఉంటుంది.

2024 మరికాసేపట్లో ముగియనుంది. 2025 ప్రారంభం కానుంది. కొత్త సంవత్సరాన్ని ఆనందంగా ఆహ్వానించడానికి హైదరాబాదీలో సిద్ధం అయ్యారు. అయితే వేలాది మంది ఈ రోజు రాత్రి హైదరాబాద్‌ రోడ్లపై సెలబ్రేట్ ( New Year Celebrations in Hyderabad 2025 ) చేసేందుకు బయటికి రానున్నారు. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉంది. అందుకే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో కేవలం ఈ రాత్రి కోసం మాత్రమే కొన్ని ఆంక్షలను విధించారు.

Prayanikudu WhatsApp2
| ప్రతిరోజు వాట్స్ అప్ ద్వారా ట్రావెల్ కంటెంట్ తెలుగులో పొందాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి

నూతన సంవత్సరాన్ని సేప్ అండ్ సంతోషంగా సెలబ్రేట్ చేసేందుకు ఈ ట్రాఫిక్ మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది.

  • హుస్సేయిన్ సాగర్ పరిధిలోని ట్యాంక్ బండ్ ప్రాంతంలోకి 2024 డిసెంబర్ 31వ తేదీ రాత్రి 8 గంటల నుంచి 2025 జనవరి 1 రాత్రి 1 గంట వరకు వాహనాలను అనుమంతించరు.
  • ట్యాంక్‌బండ్, పరిసర ప్రాంతాల్లో పార్కింగ్‌కు అనుమతి లేదు ( New Year Traffic Rules On Tankbund )
  • ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడటాన్ని నిషేధించారు.
  • 2024 డిసెంబర్ 31వ తేదీ రాత్రి 8 గంటల నుంచి 2025 జనవరి 1వ తేది రాత్రి 1 గంట వరకు హుస్సెయిన్ సాగర్‌లో బోట్లు, ఫెర్రీలు నడపడానికి అనుమతి లేదు.
  • న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ : హైదరాబాద్ పోలీసుల 7 రూల్స్ ఇవే

ఫ్లైఓవర్లు మూసేస్తారు..ఈ రెండు తప్పా

Hyderabad New Year 2025 Travel Guide
ట్యాంక్ బండ్ పరిసరాల్లో వాహన పార్కింగ్‌కు అనుమతి లేదు
  • బేగంబేట్, టోలిచౌకి ఫ్లై ఓవర్లు మినహా నగరంలోని అన్ని ఫ్లై ఒవర్లను డిసెంబర 31 నుంచి జనవరి 1 వరకు మూసేస్తారు.
  • పీవీఎన్నార్ ఎక్స్‌ప్రెస్ వే : ఈ ఫ్లై ఓవర్‌పైకి విమాన టికెట్లు ఉన్న ప్రయాణికులకు మాత్రమే అనుమతి ఉంటుంది.
  • డిసెంబర్ 31 రాత్రి 10 గంటల నుంచి 2025 జనవరి 1వ తేది రాత్రి 2 గంటల వరకు భారీ వాహనాలను, ప్రైవేటు టూరిస్టు బస్సులను హైదరాబాద్ పరిధిలోకి అనుమతించరు. ఔటర్ రింగు రోడ్డు మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది.
ట్యాంక్ బండ్‌లో పార్కింగ్ | Parking Arrangements for Tank Bund Visitors

ఒక వేళ మీరు ట్యాంక్‌బండ్ వెళ్లాలని అనుకుంటే ఈ ప్రాంతాల్లోనే మీ వాహనాన్ని పార్క్ చేయాల్సి ఉంటుంది.

  • సెక్రటేరియట్ విజిటర్స్ పార్కింగ్‌
  • ప్రసాద్ మల్టిప్లెక్స్ దగ్గరున్న హెచ్‌ఎండీఏ పార్కింగ్ గ్రౌండ్
  • జీహెచ్ఎంసి హెడాఫిస్ మార్గంలో
  • రేస్ కోర్స్ రోడ్ ( ఎన్టీఆర్ ఘాట్ రోడ్డు పక్కన )
  • ఆదర్శ్‌నగర్ లైన్ ( టూ వీలర్స్ కోసమే)
  • ఎన్టీఆర్ స్టేడియం
రాచకొండ, సైబరాబాద్ పరిధిలో | New Year Traffic Rule In Rachakonda
  • ఔటర్ రింగు రోడ్డు : ఔటర రింగు రోడ్డులోకి రాత్రి పది నుంచి ఉదయం 5 వరకు లైట్ మోటార్ వెహికల్స్‌కు అనుమతి లేదు. శంషాబాద్ వెళ్లే ప్రయాణికులకు మినహాయింపు ఉంటుంది.
  • ఫ్లైఓవర్స్, అండర్‌పాస్‌లు : నాగోల్, కామినేని, ఎల్బీ నగర్ క్రాస్ రోడ్స్, బైరామల్ గూడ క్రాస్ రోడ్స్, ఎల్బీనగర్ అండర్ పాస్, చింతల్ కుంట అండర్ పాస్‌లలో రాత్రి 10 నుంచి ఒంటిగంట వరకు లైట్ మోటార్ వెహికల్స్, టూ వీలర్స్‌కు అనుమతి లేదు. మీడియం, హెవీ మోటార్ వెహికల్స్‌‌కు అనుమతి ఉంటుంది.


గమనిక: ఈ వెబ్‌సైట్లో ప్రకటనలు కూడా ఉంటాయి. ముఖ్యంగా గూగుల్ యాడ్స్ ద్వారా ఈ ప్రకటనలు మీకు కనిపిస్తాయి. ఈ ప్రకటనలే మాకు ఆధారం. ఇందులో కొన్ని ప్రకటనలపై మీరు క్లిక్ చేస్తే మాకు ఆదాయం వస్తుంది.

Watch More Vlogs On : Prayanikudu

ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

Most Popular Stories

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!