Chai Samosa USA : భారతీయుల కోసం ఛాయ్ సమోసా స్ట్రాటజీని అమలు చేస్తున్న అమెరికా

షేర్ చేయండి

భారతీయ పర్యాటకుల కోసం అమెరికా హాస్పిటాలిటీ రంగం రెడ్ కార్పెట్ పరుస్తోంది. తమ మెన్యూలను మార్చి మనసు గెలుచుకోవాలని చూస్తోంది. దాని కోసం కొత్త వ్యూహాలను ( Chai Samosa USA ) అమలు చేస్తున్నాయి అక్కడి హోటల్స్.

2024 లో సుమారు 19 లక్షల మంది భారతీయులు అమెరికా పర్యాటనకు వెళ్లారు.2019 తో పోల్చితే ఈ సంఖ్యలో 48 శాతం వృద్ధి నమోదు అయింది. వ్యాపారంతో పాటు ఆహ్లాదం, వినోదం కోసం అమెరికా వెళ్లే భారతీయుల సంఖ్య పెరుగుతోంది. దీని వల్ల అక్కడి పర్యాటక రంగం పుంజుకుంటోంది. అందుకే ఇప్పుడు భారతీయులను ఆకర్షించేందుకు, వారికి తగిన విధంగా మార్పులు చేస్తోంది అమెరికా.

ఛాయ్ సమోసా టూరిజం | Chai Samosa USA

భారతీయ పర్యాటకులకు ఆత్మీయ ఆతిథ్య వాతావరణం కల్పించే దిశలో ఎన్నో హోటల్స్ ఛాయ్, సమోసా లాంటి ఇండియన్ రెసెపీలను ( Indian Food In USA ) తమ మెన్యూలో చేర్చుతున్నాయి.కేవలం ఆహార పదార్థాల విషయంలోనే కాదు భారతీయ అతిథుల కోసం మరెన్నో విషయాలపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నాయి అక్కడి హోటల్స్.

Chai Samosa USA
| భారతీయులు ఎక్కువగా సందర్శించే ప్రాంతాల్లో నయాగరా ఫాల్స్ కూడా ఒకటి

అతిథులు ఉండే రూమ్స్‌లో టీవీలలో భారతీయ ఛానెల్స్ ( Indian Tv Channels in America ) అందుబాటులో పెట్టడం కూడా ఒకటి. ఇలాంటి ప్రయత్నాల వల్ల పర్యాటకులకు మంచి అనుభూతి కల్పించినట్టు అవుతుంది అని ఏషియన్ అమెరికన్ హోటల్ ఓనర్ అసోసియేషన సీఈఓ లారా లీ బ్లేక్ తెలిపారు.

అమెరికాలో మిడిల్ క్లాస్ మెలోడిస్ | Indian Middle Class Travel Passion

భారత్‌లో మధ్యతరగతి జనాభా పెరగడంతో అంతర్జాతీయ ప్రయాణాలు చేసే వారి సంఖ్య ( Indian International Travelers ) కూడా పెరిగింది. ఇది వివిధ దేశాలకు ప్రయోజనాన్ని కలిగిస్తోంది. బడ్జెట్ ట్రావెల్ బడ్జెట్ ఆప్షన్స్, అందుబాటులో విమాన టికెట్ల ధరల ( America Ticket Prices ) వల్ల మరింత ఎక్కువ మంది భారతీయులు విదేశాలకు వెళ్తున్నారు.

Prayanikudu WhatsApp2
| ప్రతిరోజు వాట్స్ అప్ ద్వారా ట్రావెల్ కంటెంట్ తెలుగులో పొందాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి

భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న ఈ తరుణంలో ప్రయాణాలంటే ఇష్టపడే ఔత్సాహికులు మరిన్ని కొత్త ప్రదేశాలకు వెళ్తున్నారు. దీని వల్ల ప్యాండమిక్ తరువాత అమెరికా పర్యాటక రంగం కూడా పుంజుకుంటోంది.

ఆసియా లోటును భర్తి చేస్తూ

Dallas, Texas, USA Telugu People
| తెలుగు వాళ్లు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో టెక్సాస్‌లోని డల్లాస్, హూస్టన్స్ కూడా ఉన్నాయి

చైనా, జపాన్, సౌత్ కొరియా వంటి దేశాల నుంచి అమెరికా వెళ్లేవారి సంఖ్య తగ్గుముఖం పడుతోంది.ఈ లోటును భారతీయ పర్యాటకులు ( Indian Traveling USA ) ఫిల్ చేస్తున్నారు. అమెరికా వెళ్లే భారతీయులు కేవలం పెద్ద, ప్రముఖ నగరాలనే కాదు చిన్న చిన్న పట్టణాలను కూడా అన్వేషిస్తున్నారు. దీని వల్ల పర్యాటకం వల్ల కలిగే లాభాలు అమెరికాలోనే అన్ని ప్రాంతాలకు కలుగుతున్నాయి.

ఉజ్వలమైన భవిష్యత్తు


2024 లో అమెరికాలో ట్రావెలింగ్ కోసం బుకింగ్ చేసే భారతీయల సంఖ్య 50 శాతం పెరిగింది అని ఒక ట్రావెల్ సంస్థ తెలిపింది. అంటే అమెరికన్ సేవారంగం చాలా వేగంగా పుంజుకుంటోంది అని చెప్పవచ్చు. ఇక అమెరికాకు వెళ్లే భారతీయ పర్యాటకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఉండటం వల్ల భవిష్యత్తులో అమెరికాకే కాదు భారతీయ పర్యాకులకు కూడా లాభం కలుగుతుంది అని భావించవచ్చు.

భారతీయుల కోసం ఇప్పుడు ఛాయ్ సమోసా ( Chai Samosa )అందిస్తున్న అమెరికా…ముందు ముందు ఇంకేం చేయనుందో..వెయిట్ అండ్ వాచ్. భారతీయ టూరిస్టులపై కేవలం అమెరికానే కాదు అజర్ బైజాన్, థాయ్‌లాండ్, నేపాల్, శ్రీలంక, ఆఫ్రికాలోని పలు దేశాలు ఇలా ఎన్నో దేశాలు ఎక్కువగా ఆధారపడ్డాయి అని చెప్పవచ్చు.

గమనిక: ఈ వెబ్‌సైట్లో ప్రకటనలు కూడా ఉంటాయి. ముఖ్యంగా గూగుల్ యాడ్స్ ద్వారా ఈ ప్రకటనలు మీకు కనిపిస్తాయి. ఈ ప్రకటనలే మాకు ఆధారం. ఇందులో కొన్ని ప్రకటనలపై మీరు క్లిక్ చేస్తే మాకు ఆదాయం వస్తుంది.

Trending Video On : Prayanikudu Youtube Channel

ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

Most Popular Stories

ప్రపంచ యాత్ర గైడ్

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!